ఇది బాలకృష్ణ రాసుకున్న కథ కాదు

“ఓ అద్భుతమైన కథ రాస్తున్నాను, నా కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమా ఈ కథతోనే ఉంటుంది. కుదిరితే నేనే డైరక్ట్ చేస్తా.” దాదాపు మూడేళ్లుగా బాలకృష్ణ చెబుతున్న డైలాగ్ ఇది. అతను ఓ కథ…

“ఓ అద్భుతమైన కథ రాస్తున్నాను, నా కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమా ఈ కథతోనే ఉంటుంది. కుదిరితే నేనే డైరక్ట్ చేస్తా.” దాదాపు మూడేళ్లుగా బాలకృష్ణ చెబుతున్న డైలాగ్ ఇది. అతను ఓ కథ రాస్తున్న మాట వాస్తవమే. అందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అసలు కథ మారింది.

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన తొలి సినిమా చేయబోతున్నాడు మోక్షు. అయితే ఈ సినిమా గతంలో బాలకృష్ణ రాసుకున్న కథతో తెరకెక్కడం లేదు.

ప్రశాంత్ వర్మ తన టీమ్ తో కలిసి కూర్చొని, చర్చించి, మధించి రాసుకున్న కథ ఇది. కాకపోతే ఇందులో బాలకృష్ణ చెప్పిన సూచనలు-సలహాల్ని కూడా చొప్పించారు. అంతేతప్ప, మూడేళ్ల కిందట బాలయ్య రాసుకున్న కథకు మోక్షు మొదటి సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఇందులో కూడా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి.

మరో నెల రోజుల్లో ప్రకటన.. నిజానికి ఈ నెల్లోనే మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ సినిమాను ఎనౌన్స్ చేయాలనుకున్నారు. కానీ వచ్చేనెల 6న మోక్షజ్ఞ పుట్టినరోజు ఉంది. ఆ రోజున సినిమాను ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. గతంలో హను-మాన్ కు ఈ దర్శకుడు క్రియేట్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ పెద్ద హిట్టయింది.

మోక్షజ్ఞ మొదటి సినిమాతో, అతడి సోదరి తేజశ్విని నిర్మాతగా మారుతున్నారు. ఈ సినిమాకు ఆమె సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

9 Replies to “ఇది బాలకృష్ణ రాసుకున్న కథ కాదు”

Comments are closed.