రాజమౌళి టీనేజ్ ప్రేమకథ

నా పిలుపుతో ఆ అమ్మాయి ఒక్కసారి వెనక్కుతిరిగి నావైపు చూసింది. ఎన్నో ఏళ్లుగా నా మాట కోసం ఆమె ఎదురుచూస్తున్నట్టు ఆ చూపులో నాకు అర్థమైంది

రాజమౌళి గతం గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. తన పాత రోజుల్ని రాజమౌళి గుర్తుచేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. తొలిసారి తన టీనేజ్ ప్రేమకథను బయటపెట్టాడు ఈ దర్శకుడు.

“నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా క్లాస్ లో ఓ అమ్మాయి ఉండేది. ఆమె పేరు భారతి. నాకు చాలా ఇష్టం. కానీ మాట్లాడ్డానికి భయం. ఆ అమ్మాయంటే నాకిష్టమని క్లాస్ లో అబ్బాయిందరికీ తెలుసు. నన్ను ఎన్నోసార్లు ఏడిపించారు. ఆ ఏడాది మొత్తమ్మీద నేను ఒకే ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడాను. ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగానంతే. నా పిలుపుతో ఆ అమ్మాయి ఒక్కసారి వెనక్కుతిరిగి నావైపు చూసింది. ఎన్నో ఏళ్లుగా నా మాట కోసం ఆమె ఎదురుచూస్తున్నట్టు ఆ చూపులో నాకు అర్థమైంది. అయితే ఆ విషయం నాకు అప్పుడు తెలియలేదు. ఆమె చూపులో ఎక్స్ ప్రెషన్స్ ను నేను ఎప్పటికీ మరిచిపోలేను.”

ఇలా తన టీనేజ్ ప్రేమకథను బయటపెట్టాడు రాజమౌళి. దర్శకుల జీవితానుభవాలు సినిమాల్లో ప్రతింబిస్తాయని, తన టీనేజ్ ప్రేమకథలోని భారతి చూపుల్ని.. ఈగ సినిమాలో సమంత ద్వారా పలికించానని వెల్లడించాడు.

ఈ సందర్భంగా ఆహార పదార్థాల్లో తనకు ఇష్టమైనవి ఏంటనేది కూడా బయటపెట్టాడు. స్వీట్స్ అంటే రాజమౌళికి చాలా ఇష్టమంట. మరీ ముఖ్యంగా తన ఇంట్లో చేసే బొబ్బట్లు చాలా ఇష్టమని చెబుతున్నాడు.

One Reply to “రాజమౌళి టీనేజ్ ప్రేమకథ”

Comments are closed.