మలయాళీ సినిమా ఆవేశం రీమేక్ వార్తల్లో కొనసాగుతూనే ఉంది! ఫహవాద్ ఫాజిల్ అదరగొట్టిన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని, అందులో బాలకృష్ణ హీరోగా నటిస్తాడనే ఒక ప్రచారం కొన్నాళ్ల పాటు జరిగింది. అయితే ఇంకా రీమేక్ ల మీద మోజు పోని తెలుగు మూవీ మేకర్లు ఆ సినిమా రైట్స్ ను అయితే కొనితీరారట! రవితేజ చేతికి ఆ సినిమా రైట్స్ వెళ్లాయనేది కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం! అయితే ఇన్నాళ్ల తర్వాత ఆవేశం సినిమాను రీమేక్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ప్రశ్న!
చివరకు ఆ సినిమాను రీమేక్ చేస్తే.. గతంలో అనువాదాలను నిషేధించేసి అన్ని సినిమాలనూ రీమేక్ లు చేసిన కన్నడీగులకూ ఇప్పుడు తెలుగు వాళ్లకూ పెద్ద తేడా ఉండదు. కనీసం కన్నడీగులు తెలివిగా అనువాదాలను అప్రకటిత నిషేధించి తెలుగు, తమిళ, హిందీ సినిమాలను రీమేక్ చేశారు. అయితే తెలుగు వారు ఓటీటీ యుగంలో కూడా రీమేక్ ల వెంట పడే వెర్రివాళ్లుగా మిగిలిపోతారు!
కథల కొరత, కొత్తగా ఆలోచించేలేకపోవడం, ఆలోచించినా అలాంటి పాత్రలను చేసే సాహసం లేక ఎవరో చేసి వదిలేసిన పాత్రల వెంట తెలుగు హీరోలు పడటం కొనసాగుతూ ఉంది. అయ్యప్పనుం కోషియుం, లూసీఫర్ వంటి సినిమాల రీమేక్ లు ఇవే కోవలోకే వస్తాయి. మరి ఆ రీమేక్ లను కూడా సవ్యంగా చేయలేకపోయారనేది వేరే సంగతి! అలా కూడా తేలిపోయారు. ఇప్పుడు ఆవేశం కూడా రీమేక్ చేస్తే అంతకు మించిన భావ దారిద్ర్యం ఉండకపోవచ్చు! అయితే సినిమా అనేది కేవలం వ్యాపారమే అనే లెక్కలేసి రీమేక్ చేసేసి వ్యాపారం చేసుకుంటే దాంట్లో తప్పు లేకపోవచ్చు.
ఆవేశం ఒకరకంగా ఓవర్ రేటెడ్ కూడా. కేవలం ఆ పాత్ర, దాన్ని ఫహవాద్ పండించిన తీరే హైలెట్. పక్కా ఓటీటీ సినిమా. మలయాళీ యూత్ కు వారి జీవన శైలితో బాగా కనెక్ట్ అయ్యింది. అక్కడ కలెక్షన్ల పంట పండించింది, ఓటీటీల్లో మిగతా వాళ్లంతా చూశారు. ఆ కథ ప్రకారం చూసినా తెలుగు కుర్రాళ్లకు అలా కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు! హృదయం, ఆవేశం, ప్రేమలు .. ఇలాంటి సినిమాలన్నీ పక్క రాష్ట్రాలకు చదువులు- ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున వెళ్లే మలయాళీ యువత కథాంశాలు. ఎక్కడకు వెళ్లినా ఒక చోట వారు సమూహంగా తయారవ్వడం, వారిలో వారి వ్యవహారాలే ఈ సినిమా కథలు.
అనువాదం వరకూ ఇవి ఓకే. అయితే పక్క రాష్ట్రాలకు వెళ్లే తెలుగు కుర్రాళ్ల వ్యవహారాలకూ మలయాళీల కథలకూ సంబంధం ఉండదు. అయినా రీమేక్ కాబట్టి.. అన్వయించే ప్రయత్నాలు జరుగుతాయి. అవి ఎలాగూ కనెక్ట్ కావు! అయినా టాలీవుడ్ రీమేక్ ఆరాటాలు తీరవు!
Nuvvu ado cheppalani sariga cheppalekapotunnav
vc estanu 9380537747
Intha bada remake chestunnanduka leka Ravi Teja remake chestadana?
ఆ సినిమా ఏమీ బాగోలేదు! ఫాజిల్ ఆవేశం ఏదో పిచ్చి ఆవేశం లాగా అనిపించింది!
అసలు వాళ్లేమీ చేసుకుంటారో వీడికెందుకు? వాళ్ల డబ్బులు వాళ్ల ఇష్టం..
.
ఒటిటి కన్నా రీమేక్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటే రీమేక్ చేసుకుంటారు..
.
ఇప్పుడు “కా” అని ఒక సినిమా వచ్చి బాగా ఆడుతుంది..రీమేక్ రైట్స్ టీకుకున్నారు వేరే లాంగ్వేజ్ కి..
Telugu industry remakes cheste nekenti noppi ni Pani nuvvu chusuko vala Pani vallu chusukuntaru
vadu article raste nekenti neppi, nuvu commen tpedite nakenti neppi ade noppi vadiki vachindi raskunnadu
మళ్లీ ఇంకోసారి థియేటర్లో ఎందుకు చూస్తాం
జ్యోతిష్యం చెప్పబడును ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును
9063262606
జ్యోతిష్యం చెప్పబడును ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును
9063262606
జ్యోతిష్యం చెప్పబడును ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును
9063262606