ఆర్ఆర్ఆర్..ఈసారి హిస్టారికల్

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ విడుదల దగ్గరకు వస్తోంది. ఇక రెండునెలల సమయం మిగిలింది. ఇప్పటికే పాత్రల పరిచయం అయిపోయింది. ఇప్పుడు సంఘటనల పరిచయంతో ఓ గ్లింప్స్ వదిలారు. 45 నిమిషాల ఈ గ్లింప్స్ చూస్తుంటే…

రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్ విడుదల దగ్గరకు వస్తోంది. ఇక రెండునెలల సమయం మిగిలింది. ఇప్పటికే పాత్రల పరిచయం అయిపోయింది. ఇప్పుడు సంఘటనల పరిచయంతో ఓ గ్లింప్స్ వదిలారు. 45 నిమిషాల ఈ గ్లింప్స్ చూస్తుంటే రాజమౌళి చెప్పింది తక్కువ, తీస్తోంది ఎక్కువ అన్నట్లు వుంది.

కొమరం భీమ్-అల్లూరి పాత్రలు దేశభక్తి ఉద్యమంలోకి రావడానికి ముందు సంఘటనలు ఊహించి ఓ కథ అల్లుకున్నా అని చెప్పారు రాజమౌళి. కానీ ఇప్పుడు ఈ గ్లింప్స్ చూస్తుంటే ఒ భారీ స్వాంతంత్ర్య పోరాటాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.

తెరనిండా భారీగా జనం, సెట్టింగ్ లు, ధ్వంసరచన..భావోద్వేగాలు ఒకటేమిటి సమస్తం గ్లింప్స్ లో పరిచేసారు. అయితే ఏ ఇన్సిడెంట్ లోనూ హీరోలను కాకుండా కేవలం సీన్లు మాత్రమే చూపించారు.

హీరోల కట్ షాట్ లు యాడ్ చేసారు. భీకరమైన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ జోడించారు. మొత్తానికి జానపద బాహుబలికి బదులు చారిత్రాత్మక బాహుబలిని తెరపైకి తెస్తున్నట్లున్నారు.