సాధారణంగా ఓ సినిమా రిలీజైన తర్వాత హిట్టా..ఫ్లాపా అని ఆరా తీయడం సహజం. అయితే అంతకంటే ముందు మరో దశ ఉంటుంది. అసలు సినిమా వచ్చిందా లేదా అని పట్టించుకోకపోవడం. ఈ దశలో ఓ సినిమా ఉందంటే దాని పరిస్థితి దారుణం. ఇప్పుడు అలాంటి దారుణమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది మిస్ యు సినిమా.
సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఆ విషయం చెప్పేవరకు చాలామందికి తెలియదు. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి సిద్దార్థ్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గడం. రెండోది నిన్నంతా జనం పూర్తిగా అల్లు అర్జున్ అరెస్ట్ పై ఫోకస్ పెట్టడం.
ఈ రెండు కారణాలకు తోడు మరో 2 కారణాలు కూడా సిద్ధూ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కీలకంగా మారాయి. ఈ రెండు కారణాలకు కూడా అల్లు అర్జునే కారణం. ఒకటి, థియేటర్లలో పుష్ప-2 సినిమా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈమధ్యనే పుష్ప-2 కోసం డబ్బులు వెచ్చించిన జనం, మరోసారి థియేటర్ల వైపు రావడానికి ఆసక్తి చూపించలేదు.
ఇక మరో ముఖ్యమైన కారణం, అల్లు అర్జున్ పై సిద్దార్థ్ చేసిన జేసీబీ కామెంట్స్. జేసీబీతో ఇంటిని పడగొట్టిస్తున్నప్పుడు జనం వస్తారని.. బీరు-బిర్యానీ కోసం రాజకీయనాయకుల సమావేశాలకు కూడా జనం వస్తారని.. కాబట్టి పుష్ప-2 ఈవెంట్ కు పాట్నాలో జనం రావడాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదని అన్నాడు.
ఆ తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలపై సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ బన్నీ ఫ్యాన్స్ పట్టించుకోలేదు. ఆ ప్రభావం సినిమాపై గట్టిగా పడినట్టు చెబుతున్నారు. ఇలా ఎన్నో కారణాల వల్ల సిద్దార్థ్ నటించిన ‘మిస్ యు’ సినిమా డిజాస్టర్ అయింది. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్ అనే పదం కూడా ఈ సినిమా విషయంలో చిన్నదే.
Siddharth movies baguntai
వెళ్లరా.. వెళ్లి మళ్ళీ మళ్ళీ చూడు…