శ్రీమంతుడు తరువాత మళ్లీ…

శ్రీమంతుడు సినిమాలో నటించాడు రాహుల్ రవీంద్రన్. ఇన్నాళ్ల తరువాత మళ్లీ మహేష్ సినిమాలో నటిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. మంచి నటుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దర్శకుడిగా మారిన తరువాత మరీ…

శ్రీమంతుడు సినిమాలో నటించాడు రాహుల్ రవీంద్రన్. ఇన్నాళ్ల తరువాత మళ్లీ మహేష్ సినిమాలో నటిస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. మంచి నటుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. దర్శకుడిగా మారిన తరువాత మరీ సెలక్టివ్ గా చేస్తున్నారు. లేటెస్ట్ గా రష్మిక హీరోయిన్ గా ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లోగా నటుడిగా ఓ సినిమా చేసేస్తున్నారు. అదే గుంటూరు కారం.

గుంటూరు కారం సినిమాలోకి ఈసారి దర్శకుడు త్రివిక్రమ్ చాలా మందిని తీసుకున్నారు. అజయ్, వెన్నెల కిషోర్ ఇలాంటి పేర్లు చాలా వున్నాయి. వాటిల్లో రాహుల్ రవీంద్రన్ కూడా ఒకటి. సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కన వుండే కీలకపాత్రను రాహుల్ రవీంద్రన్ చేస్తున్నారు. 

దర్శకుడు త్రివిక్రమ్ సాధారణంగా ఎవరిని పడితే వారిని తీసుకోరు. పాత్రలకు పెర్ ఫెక్ట్ గా సెట్ అవుతారు అనుకున్న వాళ్లనే తీసుకుంటారు. వాళ్లని టీవీ, సినిమారంగం అనే తేడా లేకుండా ఎంచుకుంటారు. సో రాహుల్ రవీంద్రన్ ను తీసుకున్నారు అంటే సమ్ థింగ్ స్పెషల్ అనే అనుకోవాలి.

సంక్రాంతి విడుదల టార్గెట్ గా గుంటూరు కారం సినిమా ఫాస్ట్ ఫేస్ తో నడుస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు షూట్ వుంది. డిసెంబర్ లో పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని, జనవరిలో విడుదలవుతుంది. ఈ సినిమా తరువాత మహేష్ దర్శకుడు రాజమౌళి సినిమా మీదకు వెళ్తారు.