సెంటిమెంట్ నిర్మాతతో సక్సెస్ ఫుల్ హీరో

రాహుల్ యాదవ్ నక్కా.. ప్రచారానికి కాస్త దూరంగా ఉండే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఇప్పటివరకు ఈ ప్రొడ్యూసర్ చేసిన సినిమాలన్నీ హిట్టే. ఇతడితో సినిమా చేస్తే సక్సెస్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడీ…

రాహుల్ యాదవ్ నక్కా.. ప్రచారానికి కాస్త దూరంగా ఉండే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఇప్పటివరకు ఈ ప్రొడ్యూసర్ చేసిన సినిమాలన్నీ హిట్టే. ఇతడితో సినిమా చేస్తే సక్సెస్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడీ హిట్ నిర్మాతతో చేతులు కలిపాడు హీరో సందీప్ కిషన్.

స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నిర్మాతగా సందీప్ కిషన్ హీరోగా సినిమా వస్తోంది. ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ లాంటి హిట్ సినిమాను అందించిన స్వరూప్ ఈ మూవీకి దర్శకుడు. ఈ మూవీకి వైబ్ అనే టైటిల్ పెట్టారు.

వైబ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. సందీప్ కిషన్ రక్తపు మరకలతో కత్తి పట్టుకొని రెబల్ గా కనిపిస్తున్నాడు. అతడి వెనక అతడి ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమాలో అతడు కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తాడు.

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ లవ్ స్టోరీ ఇది. బాగా చదివే ఓ స్టూడెంట్, అతడి స్నేహితులు సాధారణ కుర్రాళ్ల స్థాయి నుంచి రెబల్స్ గా ఎలా మారారు, ఎందుకు మారాల్సి వచ్చిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది.

ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవే. హీరోయిన్, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. వచ్చే ఏడాది వేసవికి వైబ్ ను రిలీజ్ చేస్తారు.