ఇల్లు కోసం వెదుకుతున్న తమన్న

ఇలా పెళ్లి చేసుకొని అలా కొత్తింటికి మారింది కత్రినాకైఫ్. అలియాభట్-రణబీర్ కూడా తమ డ్రీమ్ హౌజ్ నిర్మించుకునే పనిలో పడ్డారు. సోనాక్షి కూడా ఇదే పని చేసింది. ఇలా చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్ల తర్వాత…

ఇలా పెళ్లి చేసుకొని అలా కొత్తింటికి మారింది కత్రినాకైఫ్. అలియాభట్-రణబీర్ కూడా తమ డ్రీమ్ హౌజ్ నిర్మించుకునే పనిలో పడ్డారు. సోనాక్షి కూడా ఇదే పని చేసింది. ఇలా చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్ల తర్వాత కొత్త ఇంట్లోకి మారారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తమన్న కూడా చేరబోతోంది.

ప్రస్తుతం మిల్కీబ్యూటీ, విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉంది. కొత్త ఏడాది ప్రధమార్థంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతకంటే ముందు ఓ మంచి ఇల్లు కోసం ఇద్దరూ కలిసి వెదుకుతున్నారు.

తారలంతా ఉండే బాంద్రా ఏరియాలోనే తమన్న-విజయ్ వర్మ కూడా ఉండాలని ఫిక్స్ అయ్యారు. దీని కోసం వాళ్లు కొన్ని ఖరీదైన అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్స్ చూస్తున్నారు. పెళ్లి తర్వాత కొత్త ఫ్లాట్ లోకి మారాలనేది వాళ్ల ఆలోచన. అంతకంటే ముందు తమ అభిరుచులకు తగ్గట్టు ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటారు.

విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న తమన్న.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని గతంలో తెలిపింది. ఒక దశలో మీడియాపై ఆమె అసహనం కూడా వ్యక్తం చేసింది. కానీ అంతలోనే ఆమె మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది.

2 Replies to “ఇల్లు కోసం వెదుకుతున్న తమన్న”

Comments are closed.