‘ఊ’ అనిపిస్తుందా.. ‘ఉఊ’ అనిపిస్తుందా?

తిరుగులేని డాన్సర్.. ఈ విషయంలో శ్రీలలపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాల్లేవ్. కానీ పుష్ప-2లో ఐటెంసాంగ్ చేయడానికి డాన్సింగ్ టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోతుందా? కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. దీనికి కారణం పుష్ప-1 ఐటెం…

తిరుగులేని డాన్సర్.. ఈ విషయంలో శ్రీలలపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాల్లేవ్. కానీ పుష్ప-2లో ఐటెంసాంగ్ చేయడానికి డాన్సింగ్ టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోతుందా? కచ్చితంగా కాదనే సమాధానం వస్తుంది. దీనికి కారణం పుష్ప-1 ఐటెం సాంగ్ తో సమంత వేసిన ముద్ర.

“ఊ అంటావా.. ఉఊ అంటావా” అనే సాంగ్ లో మంచి స్టెప్పులున్నాయి. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య తన అనుభవాన్ని రంగరించి, ఈ సాంగ్ కోసం మంచి సిగ్నేచర్ స్టెప్పులు కంపోజ్ చేశాడు. బన్నీ-సమంత ఆ మూమెంట్స్ లో అలా సింక్ అయిపోయారు.

అయితే ఆ డాన్స్ కు మించి సమంత ఎక్స్ ప్రెషన్స్ పాటకు ఓ కొత్త అందం, కైపు తెచ్చిపెట్టాయి. మత్తెక్కించే ఆమె హావభావాలు, సిగ్నేచర్ స్టెప్పుల్ని మించి హిట్టయ్యాయి. వేసుకున్న గౌను అటుఇటు దులపడం, జాకెట్ సర్దుకోవడం, ఓరచూపులు చూడడం లాంటివి సమంత అద్భుతంగా పండించింది. ఐటెంసాంగ్ అంటే ఇలా ఉండాలి అనిపించేలా సమంత ప్రదర్శన ఇచ్చింది.

మరి ఆ రేంజ్ ‘ప్రదర్శన’ శ్రీలలకు సాధ్యమేనా? ఆమె డాన్సింగ్ టాలెంట్ చూసిన జనాల్లో ఎంతమంది ఆమెలోని కవ్వించే కోణాన్ని చూశారు? అసలు శ్రీలీల తన కళ్లతో మత్తెక్కించగలదా? ఇలా ఎన్నో సందేహాలు, ఇంకెంతో ఉత్సుకత.

కిస్సిక్ సాంగ్ తో కచ్చితంగా సమంతను మరిపించాలి శ్రీలీల. సమంత కంటే బాగా చేసింది అనిపించుకోకపోయినా ఫర్వాలేదు కానీ, సమంతకు ఏమాత్రం తగ్గలేదనిపించుకోవాలి. ఇది ఆమెకు మాత్రమే కాదు, పుష్ప-2 సినిమాకు కూడా చాలా అవసరం. ఆమె ప్రదర్శన చూసి జనం ఊ అంటారో.. ఉఊ అంటూ నిట్టూరుస్తారో ఆదివారం తేలిపోతుంది.

10 Replies to “‘ఊ’ అనిపిస్తుందా.. ‘ఉఊ’ అనిపిస్తుందా?”

  1. నాగ చైతన్య మీద ఉన్న కసి అంతా చూపించి, డివోర్స్ తర్వాత టాలెంట్ చూపించుకునే తహ తహ గా ఉండడం తో సాధ్యం అయి ఉంటుంది. అయినా సౌందర్య, రమ్యకృష్ణ, సిమ్రాన్ తర్వాత తానే టాలెంటెడ్ హీరోయిన్ కదా!

  2. అప్పుడు సమ్ము పెళ్ళయిన పతివ్రత.. పక్కవాడి పెళ్ళాం రంకు పనులు చేస్తే ఆ కిక్ ఏ వేరు.. ఈ పిల్ల పెళ్లి కానీ కన్య.. ఎవరి మీద పడినా.. కింద పడినా.. ఒకటే.. పసి కూన కి కసి కూన కి అదే తేడా…

Comments are closed.