ఏ యాంగిల్ లో స్ట్రయిక్ చేస్తే కాయిన్ హోల్ లో పడుతుందో తెలియాలి ఆటగాడికి. అలాగే ఏ యాంగిల్ లో వెళ్తే టాలీవుడ్ లో చకచకా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చో తెలియాలి హీరోయిన్లకు.
టాలీవుడ్ లో ఒక అప్ కమింగ్ హీరోయిన్ కు ఈ విద్య బాగా వచ్చు అని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మరో చిన్న సినిమాలో 'స్పెషల్' చాన్స్ వచ్చింది. ఒక్క పాటతో దుమ్ము దులిపేసింది.
ఆ సినిమా తో ఆ డైరక్టర్ గుడ్ లుక్స్ లోకి వెళ్లిపోయింది. ఆ డైరక్టర్ రికమెండేషన్ తో ఓ సినిమాలో హీరోయిన్ చాన్స్ వచ్చేసింది. అక్కడితో ఆగిపోలేదు. మరి కొంత మందికి కూడా రికమెండ్ చేస్తున్నట్లు బోగట్టా.
ఆ ఛానెల్ అలా వుండగానే ఈ హీరో గుడ్ లుక్స్ లోకి వెళ్లిపోయిందట ఆ హీరోయిన్. దీంతో ఆ హీరో కూడా ఆ హీరోయిన్ కు మళ్లీ మళ్లీ చాన్స్ లు ఎలా ఇవ్వాలా? ఇప్పించాలా? అని చూస్తున్నట్లు బోగట్టా.
మొత్తానికి తెలివైన అమ్మడే…అందరితో సరదాగా వుంటూ, సెల్ఫీలు దిగుతూ, బాగానే మద్దతు కూడగట్టి చాన్స్ లు కొల్లగొట్టే ప్లానింగ్ లో వుంది.