తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’

తెలుగు సెలబ్రిటీలతో షో చేస్తూ, తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ, ఎక్కువగా ఇంగ్లిష్ లో మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న.

ది రానా దగ్గుబాటి షో.. హోస్ట్ చేస్తున్నది ఓ తెలుగువాడు. అందులో పాల్గొంటున్నది ఎక్కువగా తెలుగు వాళ్లు. టార్గెట్ ఆడియన్స్ కూడా తెలుగు వాళ్లే. కానీ ఎందుకో ఆ షో మాత్రం తెలుగులో ఉండదు.

ఈ కార్యక్రమం లాంఛింగ్ కు ముందు రానా ఓ మాటన్నాడు. ఈ షోను ప్రపంచంలో ఏ భాషకు చెందిన వారైనా చూసి ఆస్వాదించొచ్చు అని. మరీ ముఖ్యంగా తెలుగు అర్థంకాని వాళ్లకు సబ్ టైటిల్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. కానీ ఒక్కో ఎపిసోడ్ బయటకొస్తున్నకొద్దీ తెలుగువాళ్లకు తప్ప అందరి కోసం ఈ షో ప్లాన్ చేశారని ఇట్టే అర్థమైపోతుంది.

బాగా ఇంగ్లిష్ తెలిసిన తెలుగువాళ్లకు మాత్రమే తన షో అర్థమౌతందనే విషయాన్ని రెండో ఎపిసోడ్ నుంచే చెప్పకనే చెప్పాడు రానా. మొదటి ఎపిసోడ్ నాని, ప్రియాంక మోహన్ తో చేశాడు. ఉన్నంతలో అందులో తెలుగు వినిపించింది. రెండో ఎపిసోడ్ ను సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీలతో చేశాడు. వీళ్లూ తెలుగోళ్లే. కానీ అంతా కలిసి ఆ కార్యక్రమంలో పట్టుమని 10 నిమిషాలు కూడా తెలుగులో మాట్లాడుకోలేదు. పైపెచ్చు వాళ్లు మాట్లాడిన ఇంగ్లిష్ చూస్తే, సగటు తెలుగోడు బెదిరిపోవడం ఖాయం.

ఆ తర్వాత నాగచైతన్యతో పాటు, తన కుటుంబ సభ్యులతో షో పెట్టాడు రానా. అంతా కలిసి ఎంచక్కా ఇంగ్లిష్ లో మాట్లాడుకున్నారు. ఉన్నంతలో నాగచైతన్య మాత్రమే తెలుగులో మాట్లాడాడు. ఇక తాజాగా రాజమౌళి, రామ్ గోపాల్ వర్మను మిక్స్ చేసి ఓ ఎపిసోడ్ చేశాడు. ఇక్కడ కూడా సేమ్. అంతా తెలుగులో తక్కువ, ఇంగ్లిష్ లో ఎక్కువగా మాట్లాడుకున్నారు.

ఇలాంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలనే నిబంధన లేదు. ఎటొచ్చి తెలుగు తెలిసిన తెలుగు సెలబ్రిటీలతో షో చేస్తూ, తెలుగు ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ, ఎక్కువగా ఇంగ్లిష్ లో మాట్లాడ్డం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రశ్న.

అంతర్జాతీయ స్థాయి ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని అంతా ఇలా మూకుమ్మడిగా ఇంగ్లిష్ వాడుతున్నారనే విషయం అర్థమౌతోంది కానీ, టార్గెట్ ఆడియన్స్ సంగతేంటి రానా..? బహుశా ఈ షో టార్గెట్ ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులు కాదేమో.

11 Replies to “తెలుగు ప్రేక్షకుడికి అక్కర్లేని ‘రానా’”

  1. నువ్వు ఒక్క వ్యాసం వ్రాయటానికే సవాలక్ష ఆంగ్ల పదాలను వాడావు. తెలుగు మీద పెద్ద అభిమానం ఉన్నట్లుగా మళ్ళీ నువ్వు ఇంకొకడి కార్యక్రమాన్ని విమర్శించడం!

  2. Absolutely. Audience are more serious than hosts. Show is hopelessly casual that I felt insulted. I was more attentive and curious to watch the show , but the hosts are absolutely casual, rather careless.

Comments are closed.