త్రివిక్రమ్ షూటింగ్…ఇక కొత్తగా

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే కాస్త ఎక్కువ రోజులే పడుతుంది. ఎప్పుడూ ఫాస్ట్ గా తీయడానికి ట్రయ్ చేస్తా అంటారు. కొద్ది కొద్దిగా ఫాస్ట్ గా తీయడం చేస్తున్నారు. కానీ సినిమా కు…

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే కాస్త ఎక్కువ రోజులే పడుతుంది. ఎప్పుడూ ఫాస్ట్ గా తీయడానికి ట్రయ్ చేస్తా అంటారు. కొద్ది కొద్దిగా ఫాస్ట్ గా తీయడం చేస్తున్నారు. కానీ సినిమా కు కావాల్సిన సెట్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి నటీనటుల వరకు త్రివిక్రమ్ అస్సలు రాజీ పడరు. అల వైకుంఠపురములో సినిమా కోసం కాకినాడ పోర్ట్ దగ్గరకు రోల్స్ రాయస్ కావాల్సిందే అంటే కావాల్సిందే. మరో కారుతో రాజీ పడరు. పని మనిషి క్యారెక్టర్ కు అయినా ఫలానా నటి కావాలి అంటే కావాల్సిందే..రాజీ పడరు.

కానీ తొలిసారి త్రివిక్రమ్ కాస్త రాజీ పడి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు స్టార్ కాస్ట్ అన్నది సమస్య. వివిధ భాషలు, నోటెడ్ యాక్టర్లను తీసుకోవడం అన్నది అలవాటు. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ సంగతి అలా వుంచితే షూటింగ్ షెడ్యూళ్లు ప్లాన్ చేయడం అన్నది కొంచెం సమస్య అవుతుంది. అందరి డేట్ లు సమీకరించడం అంత ఈజీ టాస్క్ కాదు. పైగా ఇటీవల నటులు అంతా ఫుల్ బిజీగా వుంటున్నారు.

అందుకే త్రివిక్రమ్ ఈసారి ముందుగా షెడ్యూళ్లు వేసి, షూటింగ్ డేట్ లు డిసైడ్ చేసుకుని, ఆపైన ఆ తేదీలకు ఎవరు అందుబాటులో వుంటే వారినే తీసుకోవాలని అనుకుంటున్నారట. మహేష్, పూజా, శ్రీలీల ఇలా మెయిన్ క్యారెక్టర్ల వరకు ఓకె. మిగిలిన పాత్రలకు మాత్రం ఫలానా అనే పట్టుదలకు పోరు. వీలయినంత వరకు ట్రయ్ చేస్తారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే ఎవరూ వదులుకోరు.

అదే విధంగా విదేశీ షూటింగ్ లు, టైమ్ వేస్టేజ్ వ్యవహారాలు పెట్టుకోకుండా వీలయినంత వరకు ఇక్కడే షూట్ చేస్తారు. చకచకా షూట్ చేసి కుదిరితే సమ్మర్ కు లేదంటే ఆగస్టుకు సినిమా ను తీసుకురావాలన్నది మహేష్-త్రివిక్రమ్ ల ఆలోచనగా తెలుస్తోంది.