వెన్నెలకంటి ఇక లేరు

ప్రముఖ సినీ రచయిత, సాహిత్యవేత్త వెన్నెలకంటి కన్నుమూశారు. ఎన్నో సినిమాలకు పాటలు, డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన వెన్నెలకంటి, కొద్దిసేపటి కిందట గుండెపోటుతో మరణించారు. ఆయన పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. పరిశ్రమలో…

ప్రముఖ సినీ రచయిత, సాహిత్యవేత్త వెన్నెలకంటి కన్నుమూశారు. ఎన్నో సినిమాలకు పాటలు, డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన వెన్నెలకంటి, కొద్దిసేపటి కిందట గుండెపోటుతో మరణించారు. ఆయన పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. పరిశ్రమలో ఆయన వెన్నెలకంటిగానే అందరికీ పరిచయం.

చంద్రగిరిలో చేస్తున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలోకొచ్చారు వెన్నెలకంటి. ముందుగా ఆయన సాహిత్యంతోనే పాపులర్ అయ్యారు. శ్రీరామచంద్రుడు అనే సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది వెన్నెలకంటికి. 

అదే ఆయన తొలి తెలుగు సినిమా. 1988 నుంచి ఎన్నో సినిమాలకు గేయరచయితగా పనిచేశారు. ఆదిత్య 369, ఘరానాబుల్లోడు, శీను, సమరసింహారెడ్డి, టక్కరిదొంగ, రాజా లాంటి ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. అలా 200కు పైగా పాటలు రాశారు.

లిరిసిస్ట్ నుంచి డైలాగ్ రైటర్స్ గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాయకుడు సినిమాతో అనువాదంలోకి ప్రవేశించారు. పంచతంత్రం, ప్రేమ చదరంగం, ముంబయి ఎక్స్ ప్రెస్, దశావతారం, ప్రేమఖైదీ.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కలేనన్ని డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు.

ఒక దశలో వెన్నెలకంటి లేకుండా ఓ పెద్ద సినిమాను తెలుగులో డబ్ చేయలేని పరిస్థితికి వచ్చింది ఇండస్ట్రీ. డైలాగ్స్ అయినా, సాంగ్స్ అయినా.. అన్నింటిలో తన మార్క్ చూపించారు వెన్నెలకంటి.

చిన్నప్పట్నుంచే సాహిత్యంపై వెన్నెలకంటికి మక్కువ ఎక్కువ. ఆధ్యాత్మిక ప్రసంగాలు, రేడియో ప్రసంగాలు వినేవారు. ఆయన రాసిన కవితలు ఎన్నో కవితల పోటీలకు ఎంపికయ్యాయి. వీటితో పాటు జంధ్యాల రాసిన కొన్ని నాటకాల్లో కూడా నటించారు వెన్నెలకంటి.

వెన్నెలకంటి తనయుడు శశాంక్ వెన్నెలకంటి తండ్రిబాటలోనే నడుస్తూ, డబ్బింగ్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా కొనసాగుతున్నాడు. ఇక మరో కొడుకు రాకేందు మౌళి కూడా గీతరచయితగా, సింగర్ గా, నటుడిగా ఎదుగుతున్నాడు.

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు