విష్వక్ సేన్.. మళ్లీ తన రూట్ లో..!

విష్వక్ సేన్ మాట సూటిగా వుంటుంది. మొహమాటం లేకుండా వుంటుంది. సినిమాల్లో క్యారెక్టర్లు కూడా దాదాపుగా అలాగే వుంటాయి. ఇటీవల తను తీసుకునే కథల్లో కాస్త వైవిధ్యం వుండేలా చూసుకుంటున్న విష్వక్ సేన్, ఒక్క…

విష్వక్ సేన్ మాట సూటిగా వుంటుంది. మొహమాటం లేకుండా వుంటుంది. సినిమాల్లో క్యారెక్టర్లు కూడా దాదాపుగా అలాగే వుంటాయి. ఇటీవల తను తీసుకునే కథల్లో కాస్త వైవిధ్యం వుండేలా చూసుకుంటున్న విష్వక్ సేన్, ఒక్క సినిమాను మాత్రం రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. మెకానిక్ రాఖీ అంటూ వస్తోందీ సినిమా. గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో మంచి నటనకు అస్కారం వున్న పాత్ర పోషించాడు. లైలా అనే సినిమాలో అమ్మాయి గెటప్ లో కనిపించబోతున్నారు. ఈ రెండింటి మధ్య మరి ఈ రొటీన్ కమర్షియల్ సినిమా ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు.

ట్రయిలర్ లో డబుల్ లేదా సింగిల్ మీనింగ్ లు చూస్తే, విష్వక్ మళ్లీ తన పాత రూట్ లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. సగటు తండ్రి, అల్లరి చిల్లరి కొడుకు, ఓ విలన్.. ఓ సవాల్.. మధ్యలో అమ్మాయి వెంటపడడం, ఇలాంటి రొటీన్ కథ ను ఇప్పుడు విష్వక్ ఎందుకు చేస్తున్నట్లో? లేదా ట్రయిలర్ ను రొటీన్ గా కట్ చేసారా? ఎంత రొటీన్ గా కట్ చేసినా కథ అయితే తెలుస్తోంది కదా?

మెకానిక్ రాఖీ తరువాత లైలా సినిమా చేస్తున్నారు. తరువాత సుధాకర్ చెరుకూరి సినిమా చేస్తున్నారు. అనుదీప్ డైరక్షన్ లో సితార సంస్థలో సినిమా చేస్తున్నారు. అందువల్ల ఈ లైన్ అంతటిలో ఒక సినిమా రొటీన్ గా చేసినా వచ్చిన ఇబ్బంది లేదు. పైగా ఇప్పుడు మంచి రెమ్యూనిరేషన్ అందుకుంటారు కనుక, ఙస్ట్ ఓ అట విడుపు మాదిరిగా వుంటుంది అంతే.

3 Replies to “విష్వక్ సేన్.. మళ్లీ తన రూట్ లో..!”

  1. అన్నీ సినీమా ప్రిరిలీజ్ లో ఓవర్ యాక్షన్ చేసాడు ఒక గామి తప్ప. ఆ మూవీ కాస్త జనాలు చూశారు. ఇలాంటి అతి తగ్గించుకుంటే మంచిది

Comments are closed.