అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా బుధవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్వి.కృష్ణా రెడ్డి,అచ్చి రెడ్డి, బోయపాటి శ్రీను, బాబీ, జీవిత రాజశేఖర్, తనికెళ్ల భరణి, హేమ తదితరులు పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి ఎస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అలీతో నాకు మంచి అనుబంధం ఉంది. అందరూబాగుండాలి అందులోనేనుండాలి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. భవిషత్తులో అలీ మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అలీ మాట్లాడుతూ దర్శకుడు కిరణ్ నేను చెన్నై లో రూమ్ మేట్స్, మలయాళం లో జరిగిన ఒక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాము. మళయాలం బ్లాక్ బస్టర్ మూవీ వికృతి సినిమాకు రీమేక్ ఇది. ఈ కథ నచ్చి వెంటనే నరేష్ గారికి ఈ సినిమా చూడమని చెప్పాను. ఆయనకు ఈ మూవీ బాగా నచ్చి ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. అందరూ పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.
నరేష్ మాట్లాడుతూ అలీ సినిమా చేస్తున్నాడంటే సినిమాకు ఒక బ్రాండ్ వస్తుంది. తను నేను కలసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాము. అందరూబాగుండాలి అందులోనేనుండాలి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా అలీ ఈ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నాడు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ అలీ గారు స్థాపించిన అలీవుడ్ బ్యానర్ లో నేను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.