Thandel Review: మూవీ రివ్యూ: తండేల్

ఒక్క మాటలో చెప్పాలంటే – అనుకున్నంత గొప్పగా లేదు, కానీ పూర్తిగా నిరాశపరిచేలా కూడా లేదు.

చిత్రం: తండేల్
రేటింగ్: 2.75/5
తారాగణం: నాగ చైతన్య, సాయిపల్లవి, ప్రకాష్ బెలవాడి, దివ్య పిళ్లై, కరుణాకరన్, తదితరులు
కెమెరా: షామ్‌దత్ సైనుదీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: బన్నీ వాసు, అల్లు అరవింద్
దర్శకత్వం: చందూ మొండేటి
విడుదల: 7 ఫిబ్రవరి 2025

సాయిపల్లవి సినిమా అంటే అంచనాలు ఉండడం సహజం. పైగా, నాగచైతన్య హిట్ కోసం పరితపిస్తూ, ఈ చిత్రం తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందంటున్నాడు. అల్లు అరవింద్ స్వయంగా ముందుకొచ్చి ప్రచారం చేశారు. ట్రైలర్ ఆకట్టుకుంది. మరి కథలోకి వెళ్తే, సినిమా ఎలా ఉందో, ఏ అనుభూతిని కలిగించిందో చూద్దాం.

సత్య (సాయిపల్లవి) ఒక జాలరి (పృథ్వి) కూతురు. ఆమె, జాలర్ల నాయకుడైన రాజు (నాగచైతన్య)ను ప్రేమిస్తుంది. సముద్రంలో వేటకు వెళ్లిన ఓ జాలరి మరణించడంతో, భయపడిన సత్య, రాజుకు వేటకు వెళ్లొద్దని చెప్పుతుంది. కానీ, అతను వెళ్తాడు. పొరపాటున బోట్ పాకిస్తాన్ నీటిలోకి వెళ్లడంతో, పాకిస్తాన్ నేవీ వారిచే అరెస్ట్ అవుతారు. అక్కడే జైల్లో కొన్ని రోజులు గడపాల్సి వస్తుంది.

రాజు రాక కోసం సత్య ఎదురుచూస్తుంటుంది, కానీ తాను వెళ్లొద్దని చెప్పినా వెళ్లాడన్న కోపంతో మురళి (కరుణాకరన్) అనే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకుంటుంది. చివరికి, పాకిస్తాన్ జైలు నుంచి రాజు మరియు అతని అనుచరులు ఎలా విడుదలయ్యారు? రాజు, సత్య ఒక్కటయ్యారా? అనేదే కథ.

మురళి పాత్ర మినహా, ఈ కథ దాదాపుగా ట్రైలర్‌లోనే అర్థమైపోతుంది. అయినప్పటికీ, కథనం ఎలా సాగిందో అనుభవించేందుకు సినిమా చూడాల్సిందే. హీరో, హీరోయిన్ మధ్య విరహవేదన, ఎడబాటు వంటి భావోద్వేగ దృశ్యాలు, ఎంతగా పోయటిక్‌గా తెరకెక్కించారనేదే ప్రధానమైనది. ఈ విషయంలో, చందూ మొండేటి దాదాపు సక్సెస్ అయ్యాడు. దీనికి తోడు దేవీ శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం, హైలెస్సో పాట లవ్ ట్రాక్‌ను నిలబెట్టాయి.

ఇక, పాకిస్తాన్ ట్రాక్ మాత్రం పూర్తిగా నిరాశపరిచేలా ఉంది. బలవంతపు దేశభక్తి సన్నివేశాలు, పాకిస్తాన్ జైల్లో వందేమాతరం పాడే సీన్లు, అక్కడ భారత జెండాను ఎగరేయడం, డ్యాన్సులు చేయడం వంటివి అతి‌గా అనిపించాయి. పాకిస్తాన్ జైల్లో ఉండి భారతదేశ భక్తిని అతిగా ప్రదర్శించడం హీరోయిజంగా అనిపించదు, మరీ మూర్ఖత్వంగా అనిపిస్తుంది.

క్లైమాక్స్‌లో, పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ ఉన్న సమయంలో, “నేను వెళ్లను” అంటూ ఇండియా బోర్డర్ నుంచి తిరిగి పాకిస్తాన్ వైపు దూకే సన్నివేశం పరమ కామెడీగా ఉంది. అలాగే, పాకిస్తాన్‌లో ఒక ఉద్యమకారుడిని హీరో కాలెత్తి తన్నే సీన్ కూడా అసహజంగా అనిపిస్తుంది.

పాకిస్తాన్ ట్రాక్‌ను ఆసక్తికరంగా మలచేందుకు రెండు మార్గాలుంటాయి. ఒకటి, సరబ్జీత్ సినిమా తరహాలో పాకిస్తాన్ జైళ్లలో భారత ఖైదీలకు జరిగే హింసను హృదయ విదారకంగా చూపించడం. లేదా, భజరంగీ భాయిజాన్ తరహాలో మానవత్వాన్ని హైలైట్ చేస్తూ కథను నడిపించడం. కానీ, ఈ సినిమా సీ-గ్రేడ్ యాక్షన్ డ్రామాగా పాకిస్తాన్ జైలు ఎపిసోడ్‌ను మలచడం నిరాశ కలిగించింది.

పాకిస్తాన్ ట్రాక్‌ను మినహాయిస్తే, మిగిలిన సినిమా బాగుంది. అయితే, కథనం ప్రారంభమవ్వడానికి దాదాపు గంట సమయం తీసుకోవడం కూడా మైనస్. అయినప్పటికీ, సాయిపల్లవి-నాగ చైతన్యల ప్రదర్శన వల్ల సినిమా మరీ నీరసం కలిగించదు.

టెక్నికల్‌గా, ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ హైలైట్. ఆద్యంతం టెంపో లూజ్ కాకుండా నిలబెట్టాడు. హైలెస్సో, శివ తాండవం పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఓకే.

నాగ చైతన్య జాలరిగా సరిపోయాడు. కొన్ని చోట్ల భక్తుడిగా, కొన్ని చోట్ల దేశభక్తుడిగా, మరికొన్ని చోట్ల ప్రేమికుడిగా తన పాత్రను నిలబెట్టాడు.

సాయిపల్లవి ఈ చిత్రానికి ప్రధాన పుల్ ఫ్యాక్టర్. కానీ, ఆమె శ్రీకాకుళం యాస అసలు నప్పలేదు. గతంలో తెలంగాణ యాసలో నటించినప్పుడు సహజంగా అనిపించినా, ఈ సినిమాలో ఆమె డైలాగ్ డెలివరీ కృతకంగా ఉంది. సిటీ అమ్మాయి కష్టపడి ఇమిటేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. గుజరాత్‌లో ఆందోళన చేసి, సహాయం సేకరించే సన్నివేశాన్ని దర్శకుడు ఇంకాస్త బలంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.

తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా బాగా చేసాడు. పాకిస్తాన్ జైలర్‌గా ప్రకాష్ బెలావాడి జస్ట్ ఓకే. మిగిలిన నటీనటులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది.

సినిమా ప్రేక్షకులను కట్టిపడేసిన అంశం సాయిపల్లవి-నాగ చైతన్య ప్రేమకథ. వేట నుంచి రాగానే చేయిపట్టుకుని జెండా వైపు పరుగెత్తడం, లైట్‌హౌస్ పైన కూర్చుని కాలికి పట్టీ వేయడం, సిగ్నల్ కోసం హీరో, కాల్ కోసం హీరోయిన్ పరితపించడం, “ఒక్క నీటి బొట్టుతో మనసులో ఉన్నదంతా చెప్పేసింది” అనే డైలాగ్ – ఇవన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.

మొత్తమ్మీద, ఈ చిత్రం కథ పరంగా కొత్తగా ఏమీ లేదు. పైగా, ట్రైలర్ చూసినా కథ అర్థమైపోతుంది. కథనం పరంగా లవ్ ట్రాక్ బాగా తెరకెక్కింది. సాయిపల్లవి రెండు పాటల్లో సింపుల్ స్టెప్స్ వేసినా, ఆమె నాట్యప్రతిభకు పెద్దగా అవకాశం లేదు.

అయినప్పటికీ, సాయిపల్లవిని నమ్ముకుని చూసే ప్రేక్షకులకు నిరాశ కలగదు. జాతీయ అవార్డు స్థాయి దర్శకుడు చందూ మొండేటి, పాకిస్తాన్ ట్రాక్‌ను మరింత మెచ్యూర్డ్‌గా రాసుకుంటే, సినిమా క్లాసిక్ అయ్యేదే. కానీ, అలా జరగలేదు. అందుకే, కథనం ఎక్కడికో వెళ్ళినా, చివరికి తండేల్ పడవ ఒడ్డుకు చేరింది.

ఒక్క మాటలో చెప్పాలంటే – అనుకున్నంత గొప్పగా లేదు, కానీ పూర్తిగా నిరాశపరిచేలా కూడా లేదు.

బాటం లైన్: పడుతూ లేస్తూ

22 Replies to “Thandel Review: మూవీ రివ్యూ: తండేల్”

  1. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది nud cal

  2. ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా,

  3. ఏమిటి ఏమిటి? చేపలు పట్టే బోట్ లో శ్రీకాకుళం నుండీ పాకిస్తాన్ వాటర్ వరకూ వెళ్లాడా? భలేగుంది కత.

  4. మూవీ ఇప్పుడే చూశాను చాలా బాగుంది, పాకిస్తాన్ ఎపిసోడ్ కూడా బాగుంది బహుశా మీకు లంచం ఇవ్వలేదని ఇలా రివ్యూ ఇవ్వడం జరిగినట్లు ఉంది.మంచి సినిమా ను బ్రతికించండి బ్రదర్ మీ స్వలాభం కొరుకు ఇలాంటి రివ్యూ ఇవ్వద్దు.

  5. ఇంతక ముందు ఒకే ఒక కామెంట్ చేశా ga lo నేను కడప లో ఉంటా కాబట్టి. కొత్తగా కట్టే వంతెన పిక్ పెట్టీ ఇదే పడిపోయిన వంతెన కమలాపురం ప్రజల కష్టాలు అని ఏదేదో నాన్సెన్స్ రాసిండు ఎం చేయట్లేదు mla ani. Allready 80% పూర్తి అయిన కొత్త వంతెన ఫోటో పెట్టీ. అప్పుడే అర్థమైంది ఇన్ని రోజులు నేను ఈ ga website lo.చదువుతుంది నిజాలు కావు అని. ఒకటే రిప్లై పెట్టిన కామెంట్ లో చూసుకుని నిజాలు తెలుసుకుని రాయండి అని. ఆ mla చేసాడు లేదా చేయలేదు కానీ false news spreading ani I understood.

    Ika ee rewrite is not genuine. పాకిస్తాన్లో ఉచ్చ పోయడం ఆ సీన్స్ బాలేవు అనడం… పోనీ నువ్వు thi ra cinema ga గా. Ni బోడి రివ్యూ నువ్వు.

    సమస్య ఎందంటే నువు pallathu గడివి డాలర్స్ vasthunay అది.

    రాజకీయం అనవసరం ప్రేక్షకుడికి నీకు పైత్యం ఎక్కువైంది. దేశభక్తి చూపిస్తే నీకు అంత కడుపు మంట ఎందుకు. అసలు ట్రంప్ ఈ ga ni బయటకు పంపాలని కోరుకుంటున్న…..

  6. నా కామెంట్ అప్రూవ్ చేయకపోతే మీ కొంపలో దరిద్రం తండవించును గాక. ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః

  7. Naga Chaitanya has done a decent acting and was at best when he comes to know about Sai Pallavi getting married to someone else. Sai Pallavi is most irritating. Pakistan jail scenes, Sai Pallavi getting the pending salaries and meeting the minister seems artificial.

Comments are closed.