ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు!

ఎట్ట‌కేలకు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

ఎట్ట‌కేలకు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసి, కించ‌ప‌రిచార‌నేది టీడీపీ ఆరోప‌ణ‌. ఇదంతా కూట‌మి నేత‌లు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు జ‌రిగింది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత టీడీపీ నాయ‌కుడి ఫిర్యాదు మేర‌కు వ‌ర్మ‌పై ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు పీఎస్‌లో గ‌త ఏడాది న‌వంబర్‌లో కేసు న‌మోదైంది.

అప్ప‌ట్లో వ‌ర్మ‌ను అరెస్ట్ చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. విచార‌ణ‌కు రావాల‌ని రెండు ద‌ఫాలు పోలీసులు నోటీసులు ఇచ్చినా, ఆయ‌న ప‌ట్టించుకోలేదు. హైకోర్టులో ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ద‌క్క‌డంతో వ‌ర్మ‌కు భారీ ఊర‌ట ల‌భించింది. విచార‌ణ‌కు హాజ‌రై పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని వ‌ర్మ‌ను న్యాయ స్థానం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఇవాళ ఒంగోలు రూర‌ల్ సీఐ కార్యాల‌యంలో విచార‌ణ నిమిత్తం వ‌ర్మ హాజ‌ర‌య్యారు. చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్‌ల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎవ‌రైనా ఉన్నారా? అస‌లు ఎందుకు ఆ ప‌ని చేయాల్సి వ‌చ్చింది త‌దిత‌ర ప్ర‌శ్న‌లు వేసిన‌ట్టు తెలిసింది.

అయితే తానెప్పుడో రెండేళ్ల క్రితం పోస్టులు పెట్టాన‌ని, ఇప్పుడు బాధితుల‌కు కాకుండా, మ‌రెవ‌రికో మ‌నోభావాలు దెబ్బ‌తిన‌డం ఏంట‌ని వ‌ర్మ ఇది వ‌ర‌కే ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ‌ను అరెస్ట్ చేయాల‌న్న కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డం టీడీపీ, జ‌న‌సేన శ్రేణుల్ని మాత్రం నిరాశ ప‌రిచింది.

6 Replies to “ఎట్ట‌కేల‌కు విచార‌ణ‌కు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు!”

  1. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది vc

  2. తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది nud cal

Comments are closed.