అమరావతి వార్త కనిపించలేదు

ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలోనే రాజధాని వుండాలి. విశాఖ జనాల మనోభావాలు అక్కరలేదు. ఉత్తరాంధ్ర జనాల కోరిక అవసరం లేదు. మా తరతరాలుగా అమరావతే వుండాలి అంటూ నినదిస్తున్నారు అక్కడి జనాలు. తప్పు లేదు. అది…

ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిలోనే రాజధాని వుండాలి. విశాఖ జనాల మనోభావాలు అక్కరలేదు. ఉత్తరాంధ్ర జనాల కోరిక అవసరం లేదు. మా తరతరాలుగా అమరావతే వుండాలి అంటూ నినదిస్తున్నారు అక్కడి జనాలు. తప్పు లేదు. అది వారి కోరిక. కానీ ఉత్తరాంధ్రలో కూడా పత్రికలు అమ్ముకుంటున్న మీడియా కూడా తమకు అమరావతే కావాలి అని కిందా మీదా అయిపోవడం విశేషం. ఉత్తరాంధ్ర జనాలు మంచోళ్లు కాబట్టి సరిపోయింది కానీ, మా ప్రాంతం మీకు రాజధానిగా వద్దు అన్నపుడు, ఇక్కడ మీ పత్రికలు ఎందుకు అని, ఉద్యమం మొదలుపెడితే, ఈ మీడియాలు కిందామీదా అయిపోతాయి.

సరే, ఈ సంగతి అలా వుంచితే కరోనా టైమ్ లో కూడా ఏదైనా అరుగు మీద ముగ్గురో, నలుగురో మాస్క్ తో ఒక ఫొటో దిగితే, 'అమరావతిలో ఆగని ఉద్యమం' అంటూ ఫ్రంట్ పేజీలో వార్త పడిపోయేది. అలాంటిది అమరావతికి సంబంధించిన కీలక వార్త ఇప్పుడు ఆ మీడియాలో కనిపించలేదు. 

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు 2020-21 కాలాని వార్షిక కౌలు చెల్లించేందుకు గాను ప్రభుత్వం 47 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. అలాగే రాజధాని పరిథిలో పేదలకు ఫిక్స్ చేసిన ఫింఛన్ల కోసం మరో 142 కోట్లకు పైగా విడుదల చేసింది. అంటే రాజధానిలో నిర్మాణాలు, ఇతరత్రా వ్యవహారాల సంగతి అలావుంచితే అక్కడి ప్రజలకు గత ప్రభుత్వం ఏమైతే అమలు చేస్తామని చెప్పిందో, అవి వైకాపా ప్రభుత్వం కొనసాగిస్తోంది.

మరి ఈ వార్త రాష్ఠ్రంలోని మిగిలిన ప్రాంతాలు ఎలా పోయినా ఫరవాలేదు, ఏమైపోయినా ఫరవాలేదు, అమరావతి బాగుంటే చాలు అనుకునే మీడియాకు ఈ వార్త ఎందుకు పట్టలేదో? ఆ మీడియాలో ఈ వార్త ఎందుకు కనిపించలేదో?

ఏపీలో రేపటినుంచి కొత్త రాజకీయం