పవన్ ప్రజాపాలకుడేనా? అనేక సందేహాలు!

పవన్ చిత్తశుద్ధిని అనుమానించలేం. ఆయన ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాదని కూడా అనలేం.

పవన్ చిత్తశుద్ధిని అనుమానించలేం. ఆయన ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాదని కూడా అనలేం. కానీ. గేమ్ ఛేంజర్ వేదిక మీద చెప్పిన కొన్ని మాటలు మాత్రం అనేక సందేహాలు పుట్టిస్తున్నాయి.

సర్కారీ బ్లాక్ టికెట్లు!

గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన వేడుకలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక అద్భుతమైన లాజిక్ చెప్పారు. ఈ లాజిక్ విన్న ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ కావాల్సిందే. తల తిరగాల్సిందే. సినిమా టికెట్ల ధరలు విచ్చలవిడగా పెంచేసి, అభిమానుల్ని, సినిమా పిచ్చోళ్లని దోచుకోవడానికి లాకులు ఎత్తేస్తున్న సర్కారీ పోకడలను ఆయన చాలా అసహ్యకరమైన రీతిలో సమర్థించుకున్నారు.

ఇంతకూ పవన్ కల్యాణ్ ఏం చెబుతున్నారో తెలుసా? సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించడం అనేది డిమాండ్ అండ్ సప్లయి సూత్రం మీద ఆధారపడి ఉంటుందట. ఈ విషయాన్ని ఆయన చాలా సుదీర్ఘమైన వివరణతో సమర్థించుకున్నారు.

‘సినీ పరిశ్రమ అడగ్గానే టికెట్ల ధరలు పెంచుతున్నారని చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. డిమాండు ఆధారంగానే ధరల పెంపు ఉంటుంది. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్ మేన్ సినిమా టికెట్ బ్లాక్ లో కొనుక్కుని చూశాను. బ్లాక్ లో పెట్టిన డబ్బు ఎవరికో వెళుతుంది. అదే టికెట్ మీద పెడితే.. సినీ పరిశ్రమకు వెళుతుంది. తెలుగు సినిమాకు ప్రపంచంలో మార్కెట్ పెరిగింది. సినిమా బడ్జెట్ కూడా పెరిగింది. పెరిగిన ప్రతిరూపాయికీ 18శాతం జీఎస్టీ చెల్లిస్తారు.’ అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.

అంటే ఆయన ఉద్దేశం.. బ్లాక్ లో విక్రయాల వల్ల ఏ కొద్ది మంది వ్యక్తులో బాగుపడకుండా.. ప్రజల సొమ్ము మొత్తం ఇండస్ట్రీకి దోచిపెట్టడానికే ఈ ధరల పెంపు, ప్రభుత్వానికి 18శాతం జీఎస్టీ వస్తుంది గనుక దోచుకోడానికి అనుమతి ఇస్తాం అని ఆయన చెబుతున్నట్టుగా ఉంది. ఇండస్ట్రీకి వెళుతుంది అంటే.. ఆ అదనపు దోపిడీ మొత్తం ఇండస్ట్రీ బాగుకోసం కార్పస్ ఫండ్ కు వెళ్లదు కదా.

ఒక నిర్మాతకు మాత్రమే వెళుతుంది.‘ఇండస్ట్రీకి వెళుతుంది’ అనే బుకాయింపు మాటలు దండగ. ఎక్కువ ఖర్చు పెట్టారు గనుక, వారికి మేలు చేయడం కోసం అని నిజాయితీగా చెబితే చాలు కదా. దీని బదులుగా బ్లాక్ టికెట్లు అమ్మేవారిని ప్రోత్సహించి.. వారికి వేల రూపాయల జరిమానాలు విధించడం ద్వారా.. 18శాతం జీఎస్టీ కంటె ఎక్కువే సర్కారు సంపాదించొచ్చు కదా అనేది ప్రజల సందేహం.

పైగా ఈ అసమర్థ విధానాన్ని సమర్థించుకోవడానికి పవన్ కల్యాణ్.. తాను జెంటిల్‌మేన్ సినిమా చూసిన ఉదాహరణ చెప్పడం అనేది చాలా చవకబారుగా ఉంది.

శంకర్ డైరక్ట్ చేసిన జెంటిల్‌మేన్ సినిమా 1993లో విడుదల అయింది. 1996లో తన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదల అయిన పవన్ కల్యాణ్ అప్పటికి (1993 నాటికి) ఒక మామూలు కుర్రవాడు. ఇంటర్మీడియట్ చదివి, సినిమా హీరో కావాలనే ఆశలతో ఉన్న 22 ఏళ్ల కుర్రవాడు మాత్రమే. కాకపోతే ఆయనకు అప్పటికే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే అతిపెద్ద హోదా ఉంది. ఆర్థికంగా ఆ స్థాయి కూడా ఉంది. అలాంటి సంపన్న వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ లాంటి, హీరో కావాలని కలలు కంటున్న కుర్రాడు.. బ్లాకులో టికెట్లుకొని సినిమా చూస్తుంటాడు గనుక.. బ్లాక్ టికెట్ల వ్యవస్థను అడ్డుకోడానికి.. దోచుకునే అధికారాన్ని సినిమా నిర్మాతల చేతికే కట్టబెడుతున్నారా? పవన్ కల్యాణ్ చెప్పదలచుకున్న వాదన అదేనా?

ఇవాళ సినిమా టికెట్ ను 600రూపాయలకు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా. మరి.. ఆ టికెట్ ఏ థియేటర్ బయట కూడా వెయ్యికో, రెండు వేలకో బ్లాకులో విక్రయం జరగకుండా చూడగలం అని పవన్ కల్యాణ్ హామీ ఇవ్వగలరా?

‘ఆ మాట నేనెలా చెప్తా’ అని పవన్ బుకాయించడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఆయన ఇప్పుడు కేవలం ఒక నటుడు కాదు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి. సినిమా టికెట్ల బ్లాక్ మార్కెట్ అనే ఒక దందాను నియంత్రించడం చేతకాక.. సినిమా పరిశ్రమ వాళ్లే దోచుకోవడానికి లాకులు ఎత్తేశాం అని పవన్ సమర్థించుకుంటున్నట్టుగా ఉంది.

ఏదో బడ్జెట్ పెంచి తీశారు.. భారీ సినిమా తీశారు.. తెలుగు సినిమా గౌరవాన్ని ఎటూ పెంచలేరు.. కనీసం స్థాయి పెంచే సినిమా.. కాబట్టి రేట్లు పెంచుకోమని చెప్పాం అంటే అదొక తీరు. అలా కాకుండా.. కుర్రతనంలో పవన్ లాంటి యువకులు బ్లాక్ లో టికెట్లు కొంటున్నారు గనుక.. ధరలు పెంచుకునే అనుమతి ఇచ్చాం అని వాదించడం చాలా లేకిగా ఉన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

జగన్‌ను అనే అర్హతఉందా?

ఇదేమీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం కోసం వినిపిస్తున్న వాదన కానే కాదు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినిపిస్తున్న అడ్డగోలు, తలాతోకాలేని లాజిక్ విని ఆశ్చర్యంతో చేస్తున్న వాదన.

సినిమా టికెట్ల ధరలు పెంచడం అనేది డిమాండ్ అండ్ సప్లయి మీద ఆధారపడి ఉంటుందని ఈ ప్రజాపాలకుడు చెబుతున్నారు. పైగా పెంచిన ప్రతి రూపాయి మీద 18శాతం జీఎస్టీ ప్రభుత్వానికి వస్తుందని కూడా వాదిస్తున్నారు. కొద్దిసేపు ఆయన చెబుతున్న వాదన మొత్తం కరక్టే అని అనుకుందాం. అనగా..

1. డిమాండును బట్టి ధరలు పెంచవచ్చు

2. ప్రభుత్వానికి అదనపు లాభం ఉంటే ధరలు పెంచవచ్చు.

ప్రభుత్వాలు, పాలకులు అసలు ఆలోచించవలసిన ధోరణి ఇదేనా? కాదా? అనే చర్చ తర్వాత.. కొద్దిసేపు పవన్ కల్యాణ్ మాటలు అక్షరసత్యాలనే అనుకుందాం.

మరి మొన్నమొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లిక్కర్ ధరలను పెంచితే.. పవన్ కల్యాణ్ సహా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నవారందరూ కూడా భోరు భోరున విలపించారు ఎందుకు? మద్యం ధరల పెంపును తప్పు పట్టడానికి వారికి ఏం అర్హత ఉంది?

1వ సూత్రం ప్రకారం.. ప్రజల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నది గనుక.. లిక్కరు రేట్లను ఎలాపడితే అలా పెంచుకుంటూ పోతే తప్పేంటి? ఎక్కువ డిమాండ్ పెరిగే కొద్దీ మరింత ఎక్కువగా కూడా పెంచవచ్చుననేది పవన్ సూత్రం ప్రకారం నీతి. కానీ.. జగన్ ఒక స్థాయి వరకే ధరలు పెంచారు.

2వ సూత్రం ప్రకారం.. లిక్కర్ ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన అదనపు లాభం చాలా ఎక్కువ. ప్రధానంగా లిక్కరు వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించడం వల్ల మధ్యలో ఎక్కడా ఎవ్వరూ కాజేయడానికి అవకాశం లేకుండా.. లాభాలన్నీ ప్రభుత్వానికే వచ్చాయి. అలాగే.. పవన్ చెబుతున్న 18 శాతం జీఎస్టీ అదనపు లాభాల కంటె.. లిక్కరు ధరలు పెంచడం వలన పన్నుల రూపేణా ప్రభుత్వానికి వచ్చే లాభం ఇంకా ఎక్కువ.

లిక్కరు ధరలు పెంచడం ద్వారా, బ్రూవరీలను తమ బినామీల గుప్పిట్లోనే పెట్టుకున్న జగన్ అనుచరులే దోచుకున్నారనే విమర్శలు అన్నింటినీ పక్కన పెట్టండి. డిమాండును బట్టి ధరలు పెంచడం, పన్నుల అదనపు లాభం వస్తుంది గనుక ధరలు పెంచడం అనే రెండు అంశాల గురించి మాత్రమే మాట్లాడండి.

కానీ ఆ సమయంలో ఈ సో కాల్డ్.. ప్రజాక్షేమాన్ని కాంక్షించే పవన్ కల్యాణ్ సహా.. పెద్దలందరూ కూడా జగన్ మీద విరుచుకుపడుతూనే వచ్చారు. వీళ్లకసలు నైతికత ఉందా?

ఇంకా చెప్పాలంటే.. జగన్ ఆరోజున లిక్కరు ధరలు పెంచడానికి ఒక ప్రజాప్రయోజనం ఉంది. నిజమో అబద్ధమో తరువాత.. ఆయన పైకి మాత్రం ఒక ప్రజాప్రయోజనం గురించి చెప్పారు. ప్రజల్లో లిక్కరు తాగే అలవాటును తగ్గించడానికే.. ఆ రకంగా మద్యనిషేధం దిశగా అడుగులు వేయడానికే ధరలు పెంచుతున్నట్టు చెప్పుకున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలనే నిర్ణయాల వెనుక అలాంటి ప్రజా ప్రయోజనం ఉందనగలరా?

అసలు నిర్మాతలెందుకు రావాలి?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల గురించి వైఫల్యాల గురించి పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు గత అయిదేళ్లుగా బాగానే ప్రచారం చేశారు. చాలావరకు ప్రజలు వాటిని నమ్మారు. ఫలితంగానే వీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. నిందలు వేయడానికి సంబంధించి.. ‘జగన్ ఒక ముగిసిపోయిన ఎపిసోడ్’ అనే క్లారిటీ మాత్రం ఏడు నెలలు గడుస్తున్నా పాలకులకు రావడం లేదు.

ఇప్పటికీ ప్రతి విషయాన్నీ మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి, ఆయనను నిందించి ఆనందించాలని వారు భావిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా వేడుకలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇదే పనిచేశారు.‘మేము లో లెవెల్ వ్యక్తులం కాదు’ అని ఆయన చాలా తెలివిగా చెప్పుకున్నారు.

ఇంతకూ ఆయన ఏం చెప్పారంటే.. ‘సినిమా టికెట్ల ధరలతో హీరోలకు పనేంటి..? హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ, యూనియన్లు వచ్చి మాట్లాడాలి. అంతేగానీ హీరోలు వచ్చి మాకు నమస్కారం పెట్టాలి.. అనేంత లోలెవెల్ వ్యక్తులం మేం కాదు’’ అని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ నిందలు వేశారు. చాలా మంచి మాట అది. హీరోలందరూ వచ్చి తమకు నమస్కారాలు పెట్టాలని పాలకులు కోరుకోవడం (పవన్ చెప్పిన ప్రకారం) సంకుచిత బుద్ధి మాత్రమే. లోలెవెల్ మాత్రమే.

కానీ ఇంకాస్త లోతుగా వెళ్లి ఆలోచిద్దాం. అసలు నిర్మాలు మాత్రం ఎందుకు రావాలి? ఒక సినిమా తయారైన తర్వాత.. దాని టికెట్ ధర పెంచడం సబబు అని నిర్మాత ఫీలైతే.. ఆ కారణాలు పేర్కొంటూ ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టుకుంటే సరిపోతుంది కదా? పాలకుల ఎదుటకు వచ్చి మోకరిల్లవలసిన అవసరం ఏమిటి? పవన్ కల్యాణ్ హీరో కనుక.. తాను వెళ్లి నమస్కారం పెట్టడం ఇష్టం లేదు గనుక.. హీరోలు రాకూడదు.. నిర్మాతలు రావాలి అని అనడం ఎలా సబబు అనిపించుకుంటుంది?

నిర్మాతలు రావాలి అని ప్రభుత్వంలోని ఒక హోదా గల వ్యక్తి కోరుతున్నారంటే.. అది కేవలం వారితో ‘డీల్’ మాట్లాడుకోవడానికి మాత్రమే అని సామాన్య ప్రజలు సులువుగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి టికెట్ల పెంపు గురించి గానీ, లేదా, పన్నుల మినహాయింపు గురించి గానీ.. సినిమా నిర్మాతలు ఆశపడేప్పుడు వారు నేరుగా పాలకుల వద్దకు వచ్చి మోకరిల్లవలసిందేనా? ఇలాంటి విజ్ఞప్తులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం రూపొందించడం సాధ్యం కాదా?

ఒక వ్యవస్థను ఏర్పాటుచేసి.. నిర్మాతలు గానీ, ట్రేడ్ వారు గానీ, యూనియన్లు గానీ రావడానికి వీల్లేదు. మీ సినిమాకు ఎందుకు టికెట్ ధర పెంచాలో, ఎంత పెంచాలని కోరుకుంటున్నారో నిర్దిష్ట ఫార్మాట్ లో వివరిస్తూ దరఖాస్తు చేసుకోండి. లేదా, మీ సినిమాకు ఎందుకు పన్ను మినహాయింపులు ఇవ్వాలో వివరిస్తూ నిర్దిష్ట ఫార్మాట్ లో దరఖాస్తు చేసుకోండి. ఆ వ్యవస్థ (ప్రత్యేకంగా ఏర్పాటుచేసే బాడీ) దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అవసరమైతే వివరణ అడుగుతుంది. వివరణ ఇవ్వండి. అనే ఏర్పాటు ప్రభుత్వం చేస్తే అంతా పారదర్శకంగా ఉంటుంది కదా!

హీరోలు రాకూడదు.. నిర్మాతలు మాత్రం వచ్చి ‘మా సినిమా టికెట్ ధరలు పెంచండి ప్రభో.. దేహీ’ మని బతిమాలాలని కోరుకోవడం మరింత లోలెవెల్ బుద్ధి అని పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి. నిర్మాతలు తమ వద్దకు రావాలని కోరుకోవడం కేవలం.. ధరల పెంపుద్వారా అక్రమంగా పుచ్చుకునే వాటాల సంగతి తేల్చుకోవడానికి మాత్రమే అని ప్రజలు అనుమానిస్తారని కూడా ఆయన తెలుసుకోవాలి.

ఇలా చేస్తే అధికాదాయం?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ఓ అద్భుతమైన ఆలోచన చేశారు. ఆ రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన ఏర్పడి ఉన్న నేపథ్యంలో.. సినీ ప్రముఖకులు జట్టుగా వెళ్లి ప్రభుత్వ పెద్దలను కలిశారు. పవన్ కల్యాణ్ భాషలో చెప్పాలంటే.. నిర్మాతలు, హీరోలు కూడా వెళ్లి నమస్కారాలు పెట్టారు. పవన్ దృష్టిఃలో అది రేవంత్, భట్టిల లోలెవెల్ వ్యవహారం కావొచ్చు. కానీ.. నమస్కారాలు వచ్చినంత మాత్రాన.. వారేమీ సినీ పరిశ్రమను చంకకెక్కించుకోలేదు. మెత్తబడిపోలేదు. చాలా దృఢంగా వ్యవహరించారు.

ఇక మీదట బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదు.. అని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. అలాగే పవన్ కల్యాణ్ కు సమాన హోదాలో తెలంగాణలో సేవలందిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరో అద్భుతమైన ప్రతిపాదన పెట్టారు. తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మకంగా ప్లాన్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ గురుకులాలకోసం సినీ పరిశ్రమ నుంచి, టికెట్ల మీద సెస్ విధించి వసూలు చేయాలని ఉన్నట్లు చెప్పారు. ప్రతి టికెట్ మీద పరిమితంగా భారం పడుతుంది. పూర్తి మొత్తం.. ప్రభుత్వం సంకల్పిస్తున్న ఒక మంచి పనికి వెళుతుంది.

సొంతంగా మంచి ఆలోచనలు రాకపోతే పోయె.. కనీసం పొరుగురాష్ట్రం ఇలాంటి ఆలోచన చేస్తున్నప్పుడైనా.. ఏపీ పాలకులు ఎందుకు దానిని అందిపుచ్చుకోలేకపోయారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇప్పుడు అమరావతి అనే ఒక బృహత్ కార్యాన్ని నెత్తికెత్తుకుని పనిచేస్తోంది. అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని అనుకుంటోంది. మంచిదే. దేశచరిత్రలోనే అపూర్వంగా నిలిచిపోయే ఘట్టం అది. అందుకు అందరూ ఒప్పుకుంటారు.

ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు, ముందు ముందు రాబోయే ఇతర భారీ సినిమాలకు టికెట్లు ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చి.. ప్రజల్ని దోచుకోమని చెబుతున్న ప్రభుత్వం కేవలం 18 శాతం జీఎస్టీ దక్కుతుందనే మోసపూరిత మాట చెప్పకుండా ప్రత్యేకంగా ‘అమరావతి సెస్’ వంటిది ఎందుకు విధించకూడదు.

టికెట్ పెంపునకు అనుమతి ఇచ్చే తొలిరోజుల్లో ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు గనుక.. పేదలకు భారం లేదు అనే ఆత్మవంచన చేసుకోవడం పాలకులకు మామూలే. మరి అలాంటప్పుడు టికెట్ మీద 300-400 రూపాలు పెంచుకోడానికి అనుమతి ఇచ్చినప్పుడు.. అందులో సగం, అంటే 150-200, రూపాయలను అమరావతి సెస్ రూపంలో ప్రభుత్వం ఎందుకు వసూలు చేసుకోకూడదు.

ప్రతి సామాన్యుడు కూడా నష్టపోయే, భారం మోసే రీతిలో పెట్రోలు మీద, నిత్యావసరాల మీద కొన్ని సందర్భాల్లో సెస్సులు వేస్తుంటారు. ఈ ఫస్ట్ వీక్ ధరల పెంపు అనే విలాసం మీద యాభై శాతం వరకు ప్రభుత్వం అమరావతి సెస్ విధించి వసూలు చేస్తే కొన్ని కోట్ల రూపాయల నిధులు సమకూరుతాయి కదా.

ఇవాళ గేమ్ ఛేంజర్ కావొచ్చు, రేపు హరిహర వీరమల్లు కావొచ్చు.. ఒక్కో సినిమా పుణ్యమాని అమరావతి నగరంలో కనీసం ఒక్కో నిర్మాణం, ఒక్కో పార్కు, ఒక్కో రోడ్డు అయినా సాధ్యమవుతుంది కదా? ఇలాంటి నిర్మాణాత్మక ఆలోచన చేయకుండా.. కేవలం సినీ పరిశ్రమ వారు దోచుకోవడానికి లాకులు ఎత్తేస్తూ ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు?

ఈ విషయం తెలుసా సర్?

పవన్ కల్యాణ్ సమాజానికి ఏదో చేయాలనే అగణ్యమైన తపన ఉన్న నాయకుడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన చిత్తశుద్ధిని గానీ, నిజాయితీని గానీ శంకించాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయాల్లో అవినీతి చేయదలచుకుంటే ఆయన సినిమాల కంటె ఎక్కువ సంపాదించుకోగలరేమో కానీ.. సినిమాల్లో గుట్టుచప్పుడు కాకుండా.. వచ్చే సంపద, ఇక్కడ రాజకీయాల్లో సమకూరే సరికి పూర్తిగా భ్రష్టుపట్టిపోతారు.

ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు. ఆయన సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చారని అనలేం. అధికారం మీద మోజు ఉండొచ్చు.. కానీ వీటిని మించి ప్రజలకోసం ఏదోటి చేయాలనే సంకల్పం మాత్రం ఉందని ఒప్పుకోవాలి. అలాంటి పవన్ కల్యాణ్.. సినిమా టకెట్ ధరల పెంపు అనే వ్యవహారాన్ని డిమాండ్ అండ్ సప్లయి సిద్ధాంతంగా అభివర్ణించడం చాలా ఇబ్బందికరంగా ఉంది.

వ్యవస్థలో, సమాజంలో ప్రతి విషయమూ కూడా డిమాండ్ అండ్ సప్లయి అనే సిద్ధాంతం మీద మాత్రమే పనిచేసేట్లయితే.. ఇక ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకునే వ్యవస్థలూ ఎందుకు? ఇది చాలా లోతైన చర్చ. ప్రస్తుతానికి కొంత మేర చర్చించుకుందాం.

మందుల ధరలను నిర్ణయించే విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రజలందరికీ అవసరం కాగల జ్వరమూ, జలుబూ, తలనొప్పి వంటి రోగాలు మందుల ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అందుకే అవి తక్కువగా ఉంటాయి. మేం రీసెర్చికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం గనుక.. ధర మేం నిర్ణయించుకుంటాం అని మందుల తయారీ కంపెనీ అనడానికి వీల్లేదు. అదే సమయంలో.. విలాసాలుగా, సంపన్నులకు మాత్రమే ధ్యాస ఉండే రోగాలుగా భావించే వాటి విషయంలో మందుల తయారీ కంపెనీలు తమకు నచ్చిన ధర పెట్టుకోవచ్చు. గర్భనిరోధక మాత్రలు, వయాగ్రా వంటి మాత్రలు, ఒబేసిటీ- కొవ్వు తగ్గడానికి వాడే మందులు ఇలాంటివి ఈ కోవకు చెందుతాయి.

డిమాండ్ ఉన్నది కదాని.. సప్లయి చేసేవాడు పేదలను ఎడాపెడా దోచుకోకుండా ఉండడానికే ఇలాంటి ఏర్పాటు పెట్టారు. కానీ సినిమా అనేది కేవలం సంపన్నుల వ్యవహారమేనా? పేదలకు అక్కర్లేదా? మరి ఆ సూత్రం ప్రకారం ధరలు పెంచి దోచుకోవడానికి ప్రభుత్వం దగ్గరుండి సహకరించడం ఏ రకంగా సబబు అనిపించుకుంటుంది?

ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకుంటే ఉభయులకూ ప్రయోజనకరంగా ఉంటుంది.

మల్టిప్లెక్స్ వంటి సంపన్నులు వెళ్లే థియేటర్లలో రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చి, పేదలు వెళ్తారని భావించే సింగిల్, చిన్న థియేటర్లలో ఎప్పటిలా పాతధరలకు మాత్రమే టికెట్లు విక్రయించే ఏర్పాటుచేస్తే అసలు ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శ రాదు.

ప్రభుత్వం ఎప్పుడూ కూడా పెద్దన్న పాత్ర పోషించాలి. అటు సినిమా ఇండస్ట్రీని కూడా కాపాడాలి. ఇటు సినిమా పిచ్చిగల పేద ప్రేక్షకుల పక్షాన కూడా నిలబడాలి. అప్పుడే అది మంచి ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుంది. గొప్ప ప్రజాపాలకుడిగా ఎదగాలని కోరుకుంటున్న పవన్ కల్యాణ్ .. ఏకపక్షంగా ధరల పెంపును సమర్థించడం కాకుండా, ఈ సత్యాలను గ్రహించాలి.

37 Replies to “పవన్ ప్రజాపాలకుడేనా? అనేక సందేహాలు!”

  1. బెనిఫిట్ షొ లొ సినిమా టిక్కెట్లు దరలు పెంచుకంటె తప్పు.

    అదె మద్యం దరలు మాత్రం మా అన్న ఎంతైనా పెంచుకొవచ్చు. J-బ్రాండలు తెచ్చి కమీషన్లు నొక్కుతూ మందు బాబుల ఆరొగ్యన్ని, వారి కుటుంబాలని పిప్పి చెయవచ్చు అంటావా?

    1. సినిమా రొజూ రాదు, మందు మాత్రం బాబులకి రొజూ కావలి! సినిమాతొ అరొగ్యం చెడిపొదు, J-బ్రండ్ లతొ మాకు అరొగ్యం పొతుంది అని మందుబాబులె గొడవ చెసారు! మరి ఎవరు ప్రజా పలకుడు?

  2. నిజమే అన్న ని లిక్కర్ ధరలు పెంచినందుకు అన్న ని అనకూడదు ఎప్పుడు అన్న నాణ్యమైన సరుకు ని మార్కెట్ లో రిలీజ్ చేయించి అమ్మితే అనకూడదు…ఇంకొకటి డిమాండ్ అండ్ సప్లై అనేది అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు….సినిమా రేట్లు పెంపు అనేది అన్ని సినిమాలకి వర్తించడం లేదు అలంటి సినిమాలు ఏడాదికి 4 నుండి 5 వరకు వస్తాయి….దానిని చూసే టార్గెట్ ఆడియన్స్ వేరు…ఇంకోటి దానిని అంత రేట్ పెట్టి చూడలేకపోతే ఇంకోటి సినిమా చుసిన నష్టం రాదు ఒక వేళా చుసిన సినిమా బాగాలేకపోయిన వాళ్ళకి నష్టం అంటే ఆరోగ్యపరం గా సామాజికపరం గా ఏమి లేదు కానీ మందు ఆలా కాదు చిన్న కూలి నుండి పెద్ద స్థాయి మనిషి వరకు ఇవ్వాళా తీసుకుంటున్నారు …ఇక్కడ మందు నాణ్యమైనది లేకపోతె వాళ్ళ ఆరోగ్యం డబ్బు రెండు వృధా అయిపోతున్నాయి….కొన్ని సార్లు అందుబాటు లో లేకపోతె కల్తీ మద్యం వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి…అదే కల్తీ సినిమా (పైరసీ) వల్ల రేట్ పెంచినోడే నష్ట పోతున్నాడు అది కూడా ఆర్థికం గా

  3. Edaina rase mundu burra upyongichara chi na

    Enta mandi tidutinnaro choostunnava

    Only yellow media and no actual message

    Ichhe Vadiki Leni durada neeku enti ra

    First.day chooddamane vallaki high rate istinnaru and other portions are also there.

    If the education is not proper how the logic can occur to the brains

    Qualification without knowledge and without brain

  4. డిమాండ్ అండ్ సప్లై కరెక్ట్ నే కదా. చిరు, పవన్, బాలయ్య,తారక్,రాంచరణ్,బన్నీ,,ప్రభాస్,మహేష్ బాబు..వీళ్ళ సినిమాలు కాకుండా మిగతా వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచి చూడండి..బెనిఫిట్ షో లు వెయ్యమనం డి.. ఒక్కడు రాడు మరి

  5. ఆ ఈవెంట్ కి సంబందించి ఎంతో మంది మాట్లాడారు! ఆ సినిమాకు సంబంధించి ఒక్క ఆర్టికల్ కూడా రాయలేదు. పవన్ కళ్యాణ్ మీద పే….ద్ద ఆర్టికల్స్ 2 రాసేసావు. పాపం నిద్రకూడా పోయి ఉండవు.

  6. నీ సలహాలు అన్ని గత 5 ఏళ్ళు పర్పాలించిన ఆయనకో లేదంటే ఆయన పెట్టుకున్న 50 మంది సలహాదారులకో ఇవ్వాల్సింది కదా! పాపం ఇంకో 2 సీట్లు ఎక్కువ గెలిచేవాళ్లేమో కదా!

  7. మద్యం ధరలు పెంచితే ప్రజలు తక్కువగా తాగుతారు. తద్వారా ప్రజల ఆరోగ్యం గా వుంటారు. ఈ మాట స్వయంగా ఒకరు అసెంబ్లీలో సెలవిచ్చారు.

    అలాగే మొదటి రోజు సినిమా రేట్లు పెంచితే జనాలు తక్కువగా చూస్తారు. తద్వారా రద్దీ మరియు తోపులటలు వలన జరిగే ప్రమాదాలు తగ్గించవచ్చు.

    లాజిక్ సరిపోయిందా లేక GA పైన రాసిన ఆర్టికల్ లాగా తింగరి గా ఉందా

  8. రాసిన చెత్తనా కొడుకు గమనించావలసింది …సినిమా మాద్యమాన్ని ….ఆరోగ్యం పాడు చేసే సీపు లిక్కర్న్ని వేరు వేరుగా చూడాలి…వాసుదేవరెడ్డిని అడుగు ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అని…

  9. అహంకారం తో కళ్లు ముసుకుపోయి….రాజకీయంగా పవన్ ను యేమీ చేయలేక…ఒక్క పవన్ కళ్యాణ్ మీద కోపంతో, మొత్తం industry కి 10rs ,20rs ticket rates పెట్టిన వాడ్ని support చేయడానికి….ఇంత సోది అక్కర్లేదు GA…..మీ మూర్ఖత్వం ye పవన్ కళ్యాణ్ పెట్టుబడి….😂😂గుర్తు పెట్టుకో…

  10. ఒక్క pawan kalyan మీద కక్ష తో 10rs ticket rates పెట్టి మొత్తం industry ne నాశనం చెయ్యాలని చూసిన వాడ్ని support చేయడానికి ఇంత సోది అవసరం లేదు GA…..

  11. Nee Jagan pedha medhavi. andhuke 150 nundi 11 ku padi poyaadu.

    vedhava article nuvvu nu.

    telengana nunchi manam nerchukovaalaa?

    manaku swanta budhi ledhaa?

    liquor ki cinema ki comparison emitra?

  12. మనిషికి మరీ ఇంత అసూయ ఇంత ఓర్చుకోలేని తనం ఉండకూడదు.

    నువ్వు నీ రాతలు చదువుతుంటే నీ పైన అసహ్యం వేస్తుంది

  13. సూది దూరే సందు దొరికితే చాలు సోది రాస్తే మనకి అవకాశవాది అనే ముద్ర పడతాది, జర జాగర్త GA సారు

  14. Cinema brings entertainment for poor and mass people, thats the only main source for them.

    Let them enjoy in affordable prices, don’t try to steal their money.

    STOP SUPPORTING TICKET PRICES HIKE.

  15. మరి వైవీ సుబ్బా రెడ్డి ttd tickets ఇస్టాను సారం పెంచినపుడు నోట్లో ఏమి పెట్టుకున్నావు….GA

  16. ఏమి రాస్తిరి ఏమి రాత్రి నీవు ఎప్పుడు బుర్ర ఉండే ఆర్టికల్స్ రా ఇవ్వు ఎంతసేపు ఒకల మీద నెగిటివ్ రాయడమే తప్ప ఈ జన్మకు నువ్వు మారవు నీకు ఫలితం కూడా దక్కదు

  17. పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఈ ఆర్టికల్ కింద కామెంట్ లలో రైటర్ ను తప్పుపడుతూ మాట్లాడేవాళ్ల్లు గురించే. పీకే దోపిడీ కూడా వాళ్ళ ఫాన్స్ మీదనే. లేకుంటే వందలకు వందలు డబ్బులు పెట్టి ఏ తిక్కలోడు సినిమా చూస్తాడు. ఆ కులము తో కూడిన సినిమా పిచ్చ ఈస్ట్ వెస్ట్ లో ఉండే కొంతమంది అజ్ఞానులకే యెడ పేద రేట్ ల పెంపు మంచిది.

Comments are closed.