బాలయ్య సినిమా ట్రయిలర్ అంటే ఎట్లుండాలె. అరుపులు వుండాలె. మాటల మెరుపులు వుండాలె. బట్ ఫర్ ఏ ఛేంజ్..అలాంటి అరుపులు, మెరుపులు లేని ట్రయిలర్ కట్ చేసి వదిలితే..వదిలితే ఏంటీ..వదిలారు. డాకూ మహరాజ్ సినిమా ట్రయిలర్ విడుదలైంది. గతంలో వచ్చిన బాలయ్య సినిమాల ట్రయిలర్లు..ఈ ట్రయిలర్..బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నట్లు వుంది. ఇదో కొత్త తరహా ట్రయిల్ కట్ ట్రయిలర్.
హీరో నోట రెండు మూడు సార్లు రకరకాల పేర్లు చెప్పించడం తప్ప, డైలాగు లేదు. పోనీ అలా అని వేరే క్యారెక్టర్లు ఏమైనా పేజీలకు పేజీలు డైలాగులు చెప్పాయా అంటే అదీ లేదు. ఓ చిన్న పాట నోటి వెంట ఒక డైలాగు..విలన్ క్యారెక్టర్ల నోటి వెంట రెండు మాటలు. బస్..అంతే.
మరి ఇంతకీ ట్రయిలర్ లో ఏముంది? అండర్ ప్లే చేసిన హీరో క్యారెక్టర్ వుంది. జనాలను క్రూరంగా హింసించే విలన్ వున్నాడు. విలన్ బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వున్న హీరోయిన్..
కానీ కథ చాలా పెద్దదిగా వుంటుందని అనిపించేలా కట్ చేసారు ట్రయిలర్. మంచు ప్రాంతాలు, ఎడారి.. అడవి… బందిపోట్లు.. ఇంకా చాలా .ఒకటి కాదు..రెండు కాదు. చాలా సీన్లు పడ్డాయి ట్రయిలర్ లో. అంటే దర్శకుడు బాబీ కాస్త పెద్ద కథే ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది.
థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రొటీన్ గానే వుంది. విజవల్స్ బాగున్నాయి.
నువ్వు ఎప్పుడైనా బాలయ్య గురుంచి లేదా నందమూరి హీరోల గురుంచి పాజిటివ్ ఆర్టికల్ వ్రాసావా
Asalu positive vuntee kadha rayadaaniki nbk stage Medha Mike pattukunte boothu lu matladathadu
Yee great andhra kuda fake media yevaru power lo vunte valla uthsaa thaguthadu