తమది కాని తప్పును తమ మీద వేసి, జనం ట్రోల్ చేస్తుంటే ఎవరైనా ఎదురు తిరగాల్సిందే. వైకాపా అయినా ఈ పని చేయాల్సిందే. జనాలకు నిజం చెప్పాల్సిందే. కాకినాడ నుంచి రాజానగరం వరకు వున్న రోడ్ ను నాలుగు లైన్ల రోడ్ గా మార్చే పని కొన్నేళ్ల క్రితం మొదలైంది. అది నత్త నడక నడుస్తూ, ప్రయాణించేవారికి నరకం చూపిస్తోంది.
ఆ విజువల్స్ అన్నీ సోషల్ మీడియాలోకి వచ్చి, వైకాపా ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నాయి. వైకాపా శ్రేణులు దాన్ని తిప్పి కొట్టలేకపోతున్నాయి. నిజానికి వాస్తవం వేరు.
ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రాజమండ్రికి చెందిన అస్మదీయుడు ఒకరికి ఆ కాంట్రాక్టు ఇచ్చారు. మరి ఏం జరుగుతోందో? మిగిలిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అన్నీ ఫాస్ట్ గా జరుగుతుంటే ఇది మాత్రం ఇలా మూలుగుతోంది. గమ్మత్తేమిటంటే మిగిలిన కేంద్ర ప్రాజెక్ట్ లు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. వాటి కాంట్రాక్టర్లు ఉత్తరాది వారు కావడం విశేషం.
అందువల్ల ఇప్పుడు వైకాపా చేయాల్సింది. రాజానగరం- కాకినాడ రోడ్ పై అది ఏ ప్రాజెక్ట్… దాని వివరాలు, కాంట్రాక్టర్ పేరు.. చిరునామా ఎక్కడ పడితే అక్కడ కనిపించేలా చేయాలి. అప్పుడు కానీ ఈ ట్రోలింగ్ లు ఆగవు.