తన మేనకోడలు, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఏ మాత్రం సంస్కారం లేదని విజయా డెయిరీ చైర్మన్, ఆమె మేనమామ ఎస్వీ జగన్మోహన్రెడ్డి అన్నారు. నంద్యాలలోని విజయా డెయిరీ కార్యాలయానికి అఖిలప్రియ వెళ్లి, చైర్మన్ సీట్లో కూచుని, మీడియా ఎదుట హడావుడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అఖిలప్రియకు ఎస్వీ జగన్మోహన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన కార్యాలయానికి అనుమతి లేకుండా రావడమే కాకుండా, తన సీట్లో కూచున్న అఖిలప్రియ విజ్ఞతకే వదిలి పెడ్తున్నా అన్నారు. ఆ కుర్చీనే తీసేశానని ఆయన చెప్పారు. అదేమీ హీరోయిజం కాదన్నారు. అఖిలప్రియ చేసింది తప్పు అని ఆయన స్పష్టం చేశారు. మీ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూచుంటే ఎలా వుంటుంది? అని అఖిలప్రియను ఆయన ప్రశ్నించారు. విజయడెయిరీ అనేది స్వతంత్ర సంస్థ అన్నారు. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.
తన కార్యాలయంలో చంద్రబాబు ఫొటో పెట్టారని, దాన్ని తీసేయవచ్చన్నారు. కానీ చంద్రబాబు తమకు సీఎం అని ఆయన అన్నారు. గౌరవంగా ఆ ఫొటోనే అట్లే ఉంచుతా అన్నారు. చంద్రబాబు ఫొటో పెట్టాలని అనుకున్నట్టు ఆయన చెప్పారు. అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని అన్నారు. తనకు పదవి ఇచ్చిన జగన్ అభిమానాన్ని ఎలా మరిచిపోతానని ఆయన ప్రశ్నించారు. మనిషన్న తర్వాత విశ్వాసం వుండదా? అని ఎస్వీ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
అనుమతి లేకుండా తన కార్యాలయానికి వచ్చిన అఖిలప్రియపై కేసు పెట్టకూడదని అనుకున్నట్టు ఆయన చెప్పారు. కేసులతో ఒరిగేదేమీ లేదన్నారు. తాము వ్యాపారాలు చేసుకునే వాళ్లమని, ఇలాంటి మానసిక ఆందోళనలు అవసరం లేదన్నారు. అఖిలప్రియకు కేసులు అలవాటయ్యాయన్నారు. కిడ్నాప్‌లు, తన్నడాలు… ఇలాంటివి ఆమెకు అలవాటే అన్నారు.
తమ కుటుంబానికి అలాంటివి తెలియదన్నారు. తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డికి రౌడీయిజం తెలియదన్నారు. అవే జీన్స్ తనకు వచ్చాయన్నారు. ఎస్వీ నాగిరెడ్డి ఫొటో ముట్టుకున్న అఖిలప్రియకు ఆ క్షణమే పతనం ప్రారంభమైందని ఎస్వీ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. కేవలం సీఎం చంద్రబాబునాయుడి మెహర్బానీ కోసమే నంద్యాలలో తమ కార్యాలయానికి వచ్చి హడావుడి చేసిందని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు అఖిలప్రియ గురించి అన్నీ తెలుసన్నారు.
నాలుగు నెలల్లో అఖిలప్రియ ఏం చేశారో చంద్రబాబు దగ్గర చిట్టా వుందని ఆయన చెప్పారు. ఇదంతా తన తమ్ముడు జగత్‌విఖ్యాత్ కోసం అఖిలప్రియ చేస్తున్నారని ఎస్వీ జగన్ ఆరోపించారు. విజయా డెయిరీ చైర్మన్ పదవి నుంచి తనను దించి, తన తమ్ముడిని ఎక్కించాలని ఆమె ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇంకా తనకు ఏడాదిన్నర పదవీ కాలం ఉన్నట్టు ఆయన చెప్పారు.
గతంలో అఖిలప్రియ అబ్బ నారాయణరెడ్డి ఇదే పదవిలో తన పదవీ కాలం పూర్తయ్యే వరకు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా అఖిలప్రియ వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో తన అబ్బ నారాయణరెడ్డినే పదవి కోసం తన్నారని అన్నారు. ఇక మేనమామ అయిన తానెంత అని ఆయన ప్రశ్నించడం గమనార్హం. ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్లాలని ఆయన హితవు పలికారు. ఇతరుల కుర్చీల్లో కూచుంటే, అందరూ తనలాగా ఊరికే ఉండరని ఆయన హెచ్చరించారు. అఖిలప్రియ వల్ల మరో ఆళ్లగడ్డలా ప్రశాంతమైన నంద్యాల తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
vc estanu 9380537747
We heard and seen video.She spoke politely.As you are telling independant org ,how you have been nominated by Jaggul ?Let’s follow political rules .Get down and allow Vikyat in that seat.Otherwise you will be thrown forcefully that you know well pretty much!
It is not govt organisation . Can heritage have jagan photo if he is cm?
mee chandrababu heritage lo cm jagan photo unda last 5 years
“ఆ పదవి జగన్ ఇచ్చాడని అన్నారు” ఎలా ఇస్తారు? అది సహకార డైరీ, ప్రైవేట్ డైరీ కాదు కదా..మరి ప్రభుత్వ పదవే కదా.. భారతి సిమంట్ లో చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఆయన ఫోటో పెట్టుకోవచ్చు కదా.? మరి మహా మేత ఫోటో ఎందుకు? అంత కుల పిచ్చి ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చుగా..
Vinney vadu yedhavayithey, cheypey vaalu andharu JAGAN REDDY laagey feel avuthaaru 🤫🤫