అడ్మినిస్ట్రేష‌న్ అంతా మీపై ఆధార‌ప‌డి వుందా?

అడ్మినిష్ట్రేష‌న్ అంతా మీ కొద్ది మంది అధికారుల‌పై ఆధార‌ప‌డి వుందా? అని న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ను తెలంగాణ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఈ నెల 16వ తేదీ లోపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు కేటాయించిన ఐఏఎస్…

అడ్మినిష్ట్రేష‌న్ అంతా మీ కొద్ది మంది అధికారుల‌పై ఆధార‌ప‌డి వుందా? అని న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ను తెలంగాణ హైకోర్టు ప్ర‌శ్నించింది. ఈ నెల 16వ తేదీ లోపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు కేటాయించిన ఐఏఎస్ అధికారులు ఆయా రాష్ట్రాల‌కు వెళ్లి చేరాల‌ని కేంద్ర సిబ్బంది, శిక్ష‌ణ వ్య‌వ‌హారాల‌శాఖ (డీవోపీటీ) ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న వాకాటి క‌రుణ‌, ఆమ్ర‌పాలి కాట‌, వాణీ ప్ర‌సాద్‌, రొనాల్డ్ రోస్ , అలాగే ఏపీలో ప‌ని చేస్తున్న సి.హ‌రికిర‌ణ్‌, లోతేటి శివ‌శంక‌ర్‌, జి.సృజ‌న త‌మ‌కు కేటాయించిన రాష్ట్రాల‌కు వెళ్లాల్సి వుంది.

అయితే డీవోపీటీ ఉత్త‌ర్వుల‌ను కొట్టేయాల‌ని కోరుతూ హైద‌రాబాద్ కేంద్ర ప‌రిపాల‌న ట్రైబ్యున‌ల్ (క్యాట్‌)లో ఏడుగురు ఐఏఎస్‌లు పిటిష‌న్‌లు దాఖ‌లు చేశారు. క్యాట్‌లో ఐఏఎస్‌ల‌కు వ్య‌తిరేక నిర్ణ‌యం వ‌చ్చింది. త‌మ‌కు కేటాయించిన రాష్ట్రాల‌కు వెళ్లాల్సిందే అని క్యాట్ తేల్చి చెప్పింది. ఈ నేప‌థ్యంలో క్యాట్ తీర్పును స‌వాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. విచార‌ణ‌లో భాగంగా ఇవాళ హైకోర్టు కీల‌క కామెంట్స్ చేసింది.

ప్ర‌జాసేవ కోస‌మే ఐఏఎస్‌లు ఉన్నార‌ని తెలంగాణ హైకోర్టు గుర్తు చేసింది. ఎక్క‌డ పోస్టింగ్ ఇస్తే అక్క‌డికి వెళ్లాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇలాంటి వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటూ పోతే ముగింపు వుండ‌దని న్యాయ‌స్థానం పేర్కొంది. ఏ అధికారి ఎక్క‌డ ప‌ని చేయాలో చెప్పే అధికారం హైకోర్టుకు లేదని స్ప‌ష్టం చేసింది.

మీరు ఎక్క‌డ ఉద్యోగం చేయాల‌నేది కేంద్ర ప్ర‌భుత్వానికి బాగా తెలుసు అని కోర్టు వ్యాఖ్యానించింది. ముందు మీకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాల‌ని, అప్పుడు మాత్ర‌మే వాద‌న‌లు వింటామ‌ని ఐఏఎస్‌ల‌కు హైకోర్టు తేల్చి చెప్పింది. అనంత‌రం తీర్పును రిజ‌ర్వ్ చేసింది. దీంతో ఐఏఎస్ అధికారులు త‌మ‌కు కేటాయించిన రాష్ట్రాల‌కు వెళ్లి రిపోర్ట్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో తాము ప‌ని చేస్తున్న రాష్ట్రాల్లోనే కొన‌సాగాల‌నే వారి ఆశ‌లు నెర‌వేర‌లేదు.

5 Replies to “అడ్మినిస్ట్రేష‌న్ అంతా మీపై ఆధార‌ప‌డి వుందా?”

  1. అవినీతి మరియు అసభ్య రాజకీయాలు: బోరుగడ్డ అనిల్ అరెస్టుతో ప్రజల సమాధానం స్పష్టమైంది

    బోరుగడ్డ అనిల్ ఈరోజు అరెస్టు కావడం, ప్రజలు జగన్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్లే కనిపిస్తోంది. అనిల్ వంటి వ్యక్తుల వల్లే పార్టీకి ప్రతిష్టహాని కలుగుతోంది. ఆయన అసభ్యమైన, తిడుతూ మాట్లాడే భాష ప్రజల నమ్మకాన్ని దూరం చేస్తుంది. జగన్‌ను నిజంగా మద్దతు ఇస్తున్నారా? అయితే, బోరుగడ్డ అనిల్ లాంటి వారిని అనుసరించకండి. ఆయన ఏ స్థితికి చేరుకున్నాడో, జగన్ నాయకత్వం కూడా ఇలాంటి నెగటివ్ వ్యక్తుల వల్ల ఇబ్బందుల్లో పడుతోంది.

    రాజకీయాల్లో అసభ్యమైన భాషకు అవసరం ఏమిటి? సంస్కారం, మర్యాదతో మాట్లాడటం ప్రజల గౌరవాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనది. అనిల్ పరిస్థితి ప్రతి ఒక్కరికీ పాఠం కావాలి—అసభ్యమైన ప్రవర్తన, జలగట్టు భాష మనిషిని కేవలం కష్టాల్లోకి తీసుకెళ్లడం తప్ప, గౌరవం తీసుకురాదు.

Comments are closed.