ఓ ఎంపీ… మంత్రి….తల్లీ కొడుకుల బంధం

రాజకీయాల్లో బంధాలకు తావు లేదు అంటారు. దానికి కళ్ళెదుట అనేక సాక్ష్యాలు కనిపిస్తారు. రక్తం పంచుకుని పుట్టిన వారు సైతం పదవుల కోసం కత్తులు నూరుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి. అయితే రాజకీయ పార్టీలలో…

రాజకీయాల్లో బంధాలకు తావు లేదు అంటారు. దానికి కళ్ళెదుట అనేక సాక్ష్యాలు కనిపిస్తారు. రక్తం పంచుకుని పుట్టిన వారు సైతం పదవుల కోసం కత్తులు నూరుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి. అయితే రాజకీయ పార్టీలలో ఉన్న వారు అంతా తమది ఒక కుటుంబం అని చెప్పుకుంటారు.

పార్టీ అధినేతను కుటుంబ పెద్దగా భావిస్తారు. అయితే ఇదంతా తమకు రాజకీయం అనుకూలంగా ఉన్నపుడు మాత్రమే సుమా. విషయానికి వస్తే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ కి అమాత్య పదవి రావడం కాదు కానీ ప్రత్యర్ధులు ఇంటా బయటా ఎక్కువ అయిపోయారు. 

గట్టిగా మూడున్నర పదుల వయసు లేని అమరనాధ్ కి అయిదు కీలక శాఖలు ఇచ్చి జగన్ ఆదరించారు. దాంతో ఆయన ఇపుడే ఇలా ఇన్నేసి పెద్ద బాధ్యతలు మోస్తే ముందు ముందు ఎలా అని కంగారు పడుతున్న వారూ ఉన్నారు. 

మొత్తానికి ఆయనకూ అనకాపల్లి ఎంపీ సత్యవతికి మధ్య విభేధాలు ఉన్నట్లుగా చిత్రీకరించారు. దీని మీద జరుగుతున్న ప్రచారానికి గుడివాడ తనదైన తరహాలో చెక్ చెప్పేశారు.

తనకూ ఎంపీకి మధ్య విభేధాలు ఏంటి అని కొట్టిపారేశారు. అదంతా కొందరి సృష్టి మాత్రమే అన్నారు. ఆమె తనకు తల్లి లాంటిది అని కూడా ఆయన గొప్పగా చెప్పుకున్నారు. తామంతా వైసీపీ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసేవారమని ఆయన పేర్కొన్నారు. 

మొత్తానికి ఎంపీ మంత్రి ప్రత్యర్ధులు అని చెబుతున్న వారి నోళ్ళు మూయించేలా తల్లీ కొడుకుల బంధంతో గుడివాడ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారని అంటున్నారు.