నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఏపీ నేత‌లు మౌనం!

ఏపీకి వ‌చ్చే స‌రికి, మోదీ స‌ర్కార్‌ను నిల‌దీసే ద‌మ్ము ఎవ‌రికీ లేదు. సొంత ప్ర‌యోజ‌నాలే త‌ప్ప‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఏమాత్రం ప‌ట్ట‌డం లేదు.

2026లో కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్ట‌నుంది. జ‌నాభా ప్రాతిప‌దిక‌న నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే, ద‌క్షిణాధి రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌నే ఆందోళనను త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ వ్య‌క్తం చేశారు. ఈ విష‌య‌మై మిగిలిన రాష్ట్రాలు కూడా గ‌ళ‌మెత్తాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత‌లు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులెవ‌రూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. పైగా ఏపీలో ఎన్‌డీఏ ప్ర‌భుత్వ‌మే వుంది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అసెంబ్లీ స్థానాల్ని ఏపీ, తెలంగాణ‌లో పెంచాల్సి వుంది. ఇక దేశ వ్యాప్తంగా పార్ల‌మెంట్ స్థానాల పున‌ర్విభ‌జ‌న‌కు కేంద్రం అడుగులు వేస్తోంది. ఉత్త‌ర భార‌త‌దేశంలో కుటుంబ నియంత్ర‌ణ పాటించ‌ని కార‌ణంగా జ‌నాభా బాగా ఎక్కువ‌గా వుంది. దీంతో ఉత్త‌రాధిలో పార్ల‌మెంట్ స్థానాలు బాగా పెర‌గ‌నున్నాయి.

మ‌రోవైపు ద‌క్షిణాధిలో కు.ని పాటించ‌డంతో జ‌నాభా బాగా త‌గ్గింది. ఈ ప్ర‌భావం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌పైన ప‌డ‌నుంద‌ని త‌మిళ‌నాడు, తెలంగాణ , కేర‌ళ రాష్ట్రాల్లోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఏపీకి వ‌చ్చే స‌రికి, మోదీ స‌ర్కార్‌ను నిల‌దీసే ద‌మ్ము ఎవ‌రికీ లేదు. సొంత ప్ర‌యోజ‌నాలే త‌ప్ప‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ఏమాత్రం ప‌ట్ట‌డం లేదు. దీంతో ఏపీ ప‌దేప‌దే న‌ష్ట‌పోవాల్సి వ‌స్తోంది. పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లోనూ అలాంటి న‌ష్ట‌మే జ‌రిగే ప్ర‌మాదం లేక‌పోలేదు.

17 Replies to “నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఏపీ నేత‌లు మౌనం!”

  1. మా అన్నయ్య అధికారం లో ఉండి ఉంటే కేంద్రం మెడలు వంచి ఏపి కి యాభై ఎంపీ స్థానాలు తెచ్చేవాడు: 🐑 🐑 🐑

Comments are closed.