సాధారణంగా ఓ దర్శకుడు ఎవరైనా హీరోకి కథ చెప్పినా, సినిమా లైన్ చెప్పినా, హీరో క్యారెక్టరైజేషన్ చెప్పినా ఓ విధానం వుంటుంది. మీ పాత్ర ఇలా వుంటుంది. తెరతీయగానే ఇలావుంటుంది అంటూ మొదలుపెట్టి చెబుతారు. దీనికి పెద్దగా ఖర్చు వుండదు. టైమ్ ఖర్చు తప్ప. కానీ సినిమా లైన్ ఇదీ, ఇలా వుండబోతోందీ అని చెప్పడానికి కోటి రూపాయలు ఖర్చు చేసి ఓ గ్లింప్స్ తయారుచేయడం అంటే అది కాస్త ఆసక్తి కరమే.
దీనికి కారణం మారుతున్న ట్రెండ్. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి లేపాలి. అప్పటి నుంచి సినిమా విడుదల వరకు సమ్ థింగ్ ఏదో ఒకటి చేస్తూ ఆసక్తి జనరేట్ చేయాలి. అప్పుడు కానీ మాస్ హిస్టీరియా రాదు. సినిమాకు మంచి కలెక్షన్లు రావు. అది ఇప్పటి ట్రెండ్. అదీ కాక ఒకే కథను రకరకాలుగా చెప్పొచ్చు. కానీ ఇది నా స్టయిల్ ఇలా చూపించబోతున్నా అని దర్శకుడు చెబితే అది వేరుగా వుంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పారడైజ్ సినిమా మేకింగ్ ఇలా వుండబోతొందీ, జానర్ ఇలా వుండబోతోంది, లుక్ ఇలా వుండబోతోందీ అని చెప్పడానికి ఈ గ్లింప్స్ ఉపయోగపడింది.
ఇది కాకుల కథ.. తల్వార్ పట్టిన కాకుల కథ.. తల్వార్ పట్టేలా చేసిన నాయకుడి కథ.. ఇక్కడి వరకు ఎగ్జయింటింగ్ గా వుంది. అక్కడితో ఆగకుండా ఇది ఓ ల.. కొడుకు కథ అనడంతో మరింత హై టర్న్ తీసుకుంది. దానికి తోడు హీరోని పూర్తి ప్రొజెక్ట్ చేయకపోయినా, గెటప్ అదీ అలా అలా చూపించడంతోనే ఇదేదో వైవిధంగా వుండబోతోంది అని అర్థమయింది.
గ్లింప్స్ ప్రారంభంలోనే రా, రస్టిక్ అని నోట్ పెట్టేసారు. నాని గెటప్ బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. చాలా డిఫరెంట్ గా వుంది. నైజీరియన్ రఫ్ స్టయిల్ కనిపించింది. కాళ్లకు, మెడలో నగలు గట్రా చూస్తే పుష్ప ప్రభావం వుందా అనిపించింది. మొత్తం మీద నడుస్తున్న ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకెళ్లేలా కనిపించింది పారడైజ్ గ్లింప్స్ ట్రెండ్.
గ్లింప్స్ వరకు పాస్ అయింది. ఇదే తరహా మేకింగ్ కూడా జనాలను ఆకట్టుకుంటుంది. ఇక కావాల్సింది కథ, కథనాలు. వెయిట్ అండ్ సీ. గ్లింప్స్ లో వాడిన లం. పదం సెన్సార్ లో వుంటుందో వుండదో చూడాలి.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Chudalli