చంద్రబాబు సర్కార్ 2024-25 సంవత్సరానికి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. రూ.2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు. మూల ధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లగా పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
కేటాయింపుల విషయానికి వస్తే…
పాఠశాల విద్య రూ.29,909 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలు రూ.11,855 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు, జలవనరులు రూ.16,705 కోట్లు, ఉన్నత విద్య రూ.2326 కోట్లు, పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు, ఇంధన రంగం రూ.8,207 కోట్లు, పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు, బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు, మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు, అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు, గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు, ఆరోగ్య రంగం రూ.18,421 కోట్ల ఇలా మరి కొన్ని రంగాలకు బడ్జెట్ కేటాయించారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని పయ్యావుల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 1-12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
vc estanu 9380537747
Super Kada GA?
Good