ఈసారి ఎలాగైనా పార్లమెంట్లో అడుగుపెట్టాలని బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ ఆరాటపడుతున్నారు. అయితే ఆయనకు స్థానిక నినాదంతో పాటు బలమైన సామాజిక వర్గం నుంచి వైసీపీ పోటీలోకి దించిన మహిళా అభ్యర్ధి బొత్స ఝాన్సీ నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది.
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో ఉంటూ గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేస్తున్నారు. విశాఖ పార్లమెంట్ ఓటర్లలో మూడవ వంతు ఉండే బలమైన సామాజిక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఉన్నారు. ఆ ఓట్లు కనుక ఫ్యాన్ పార్టీకి పడితే టీడీపీ ఆశలు గల్లంతు అని అంటున్నారు.
అలాగే విశాఖలో మైనారిటీలు పెద్ద ఎత్తున ఉన్నారు. బీజేపీకి టికెట్ ఇవ్వకపోవడంతో ఉత్తరాది ప్రాంతాల వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. ఇలా అనేక ఇబ్బందుల నడుమ టీడీపీ ఎంపీ అభ్యర్ధి ప్రచారం సాగుతోంది.
ఆయన గెలుపు కోసం బాలయ్య రంగంలోకి దిగుతున్నారు. ఆయన రెండు రోజుల పాటు విశాఖ విజయనగరంలో ప్రచారం చేస్తారు. బొత్స విశాఖ రాజకీయాల్లో జోరు చేయడంతో ఆయన చీపురుపల్లిలో టైట్ చేయడానికి అక్కడ బాలయ్య ప్రచారం చేస్తారు అని అంటున్నారు.
విశాఖలో బాలయ్య రోడ్ షోని భారీగా ప్లాన్ చేశారు. బాలయ్య సినీ గ్లామర్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బాలయ్య ఉత్తరాంధ్ర ప్రచారంలో ఎక్కువ సమయం విశాఖకే కేటాయించడంతో చిన్నల్లుడు కోసమే ఆయన ఫీల్డ్ లోకి దిగారు అని అంటున్నారు.