ఇక దక్షిణాదిన బీజేపీ టార్గెట్

ఏపీ బీజేపీ నేతలలో ఈ రకమైన భావన ఏర్పడడం ఆ పార్టీకి మంచిది అయితే బీజేపీ ఎదుగుదల కోసం కూటమి పార్టీల నుంచే వాటా తీసుకోవడం జరుగుతుంది

దేశంలో కీలక ప్రాంతాల్లో విజయపతాక ఎగురవేసిన బీజేపీకి దక్షిణ భారతదేశంలో మాత్రం అనుకున్నంతగా రాజకీయ విస్తరణ సాధ్యపడడం లేదు. కర్ణాటకలో ఒక పర్యాయం గెలిచింది. ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణలో 2023లో గెలవాలని లేదా రెండో పార్టీగా ఉండాలనుకుంటే ఎనిమిది అసెంబ్లీ సీట్లే దక్కాయి. ఏపీలో కూటమి కట్టి ఎనిమిది అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్నా బీజేపీ పటిష్టం కావాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది.

తమిళనాడు, కేరళలలో ఇప్పట్లో బీజేపీ ఎదిగేందుకు అంతగా స్కోప్ అయితే లేదు. ఉత్తరాదిన వరస గెలుపులు తీసుకుని వచ్చే ఉత్సాహం బీజేపీకి దక్షిణాదిన కూడా తన హవా పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇక దక్షిణాదినే బీజేపీ గురి పెడుతుందని చెపారు. ఇలాగే బీజేపీ తన విజయ పరంపరను కొనసాగిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు అంతే కాకుండా తదుపరి ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇతర దక్షిణాది రాష్ట్రాలలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని జీవీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఇతర దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ ఉంది. ఏపీలో బీజేపీ బలం పెంచుకోవడం అంటే మిగిలిన మిత్రులతో పాటు సీట్లలో అధికారంలో వాటాను అధికం చేసుకోవడమే అని అంటున్నారు.

ఏపీ బీజేపీ నేతలలో ఈ రకమైన భావన ఏర్పడడం ఆ పార్టీకి మంచిది అయితే బీజేపీ ఎదుగుదల కోసం కూటమి పార్టీల నుంచే వాటా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడా సర్దుబాట్లు అవసరం అవుతాయి. కాషాయ దళంలో ఆత్మ విశ్వాసం అయితే పెరిగింది, ఈ రోజు ఢిల్లీ రేపు మన ప్రాంతం ఎందుకు కాకూడదు అన్న ఆశలలో తప్పు అయితే లేదు. ఏపీలో బీజేపీ విస్తరణకు మార్గాలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.

8 Replies to “ఇక దక్షిణాదిన బీజేపీ టార్గెట్”

  1. ముందు తెలంగాణ మీద, తరువాతే AP . AP లో ఎదగాలంటే వైసీపీ ని మింగేయాలి. అందులో భాగమే జగన్ నిష్క్రియాత్మకత.

  2. ఆంధ్రా లో బీజేపీ ఎదగాలి అంటే.. ముందు ప్రజలు దాన్ని నమ్మాలి…

    ఇప్పుడు కూడా పక్కలో ఒకళ్ళు మంచం కింద ఒకళ్ళు గా వుంది

    స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని లో వాళ్ళ నిజాయితీ చూపించాలి

    జగన్ ప్లేస్ కావాలో టీడీపీ ప్లేస్ కావాలో కూడా నిర్ణయించు కోవాలి

    టీడీపీ ప్లేస్ లోకి బీజేపీ రావడం అన్నది అసాధ్యం అని నా అభిప్రాయం

    1. స్టీల్ ప్లాంట్ ను ఏమీ తీసేయటం లేదు. ప్రైవేటుపరం చేస్తే, సోమరిపోతులతో పని చేయించి, ఇన్నాళ్ళూ నష్టాల్లో కునారిలుతున్న స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది.

      పోలవరం కేంద్రం కట్టి అప్పచెప్పాల్సిన ప్రాజెక్టు, చేతగాని ముఖ్యమంత్రులు కమీషన్ల కకుర్తితో భుజాన వేసుకుని నాశనం చేసారు. ఆ పనికిమాలిన ముఖ్యమంత్రులను కదా తిట్టాల్సింది.

      రాజధానికి ఇవ్వాల్సిన తమవంతు కేంద్రం ఏనాడో ఇచ్చేసారు. వర్షం వస్తే కారిపోయే సెక్రటేరియట్ భవనాలు కట్టించి భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రిని కదా అనాల్సింది. రాజధాని అంటే సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు తప్ప పబ్బులూ మాల్సూ కాదు. సింగపూర్ దగాకోరు కంపెనీతో రహస్య ఒప్పందం చేసుకుని నాశనం చేసినవారిని అనాలి.

      బీజేపీ వస్తే వస్తుంది లేకపోతే లేదు. కానీ సన్నాసులను ఎన్నుకునే పిచ్చిఆంధ్రుల బ్రతుకులు ఇలా కామెంట్లు పెట్టుకుంటూ బ్రతికేయటమే తప్ప బాగుపడేది ఏమీ ఉండదు

Comments are closed.