లిక్కర్ రేటు తగ్గిస్తానని చెప్పు బాబూ!

చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడిపోయినా అధికార కాంక్ష మాత్రం తగ్గడం లేదు. ప్రజలకు ఏం హామీలు ఇవ్వాలో, ఎలాంటి హామీలు ఇస్తే తన పార్టీనే భ్రష్టు పట్టుపోతుందో.. ఆయన విచక్షణను కోల్పోతున్నారు. బ్యాలెన్స్…

చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడిపోయినా అధికార కాంక్ష మాత్రం తగ్గడం లేదు. ప్రజలకు ఏం హామీలు ఇవ్వాలో, ఎలాంటి హామీలు ఇస్తే తన పార్టీనే భ్రష్టు పట్టుపోతుందో.. ఆయన విచక్షణను కోల్పోతున్నారు. బ్యాలెన్స్ మిస్సవుతున్నారు. కొన్ని రోజుల కిందట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. నాణ్యమైన మద్యం అందిస్తాం అనే హామీ ఇవ్వడం ద్వారా చంద్రబాబునాయుడు ఎంతగా భ్రష్టు పట్టిపోయారో అందరికీ తెలుసు.

రాష్ట్రంలోని మేధావులు తటస్థులు, ప్రజల క్షేమాన్ని కోరుకునే వారు అందరూ కూడా బాబు మాటల్ని ఈసడించుకున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మద్యపాన నిషేధం గురించి హామీ ఇస్తుంది. ఆ రకంగా ఆడపడుచులకు జీవితం పట్ల భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక వనరుల మీద ఆశ ఉండే నేపథ్యంలో మద్యనిషేధాన్ని హామీగా చెప్పలేకపోయినా.. అసలు మద్యం అనే ప్రస్తావన జోలికి వెళ్లకుండా పార్టీలు జనం ఎదుట మాట్లాడుతాయి.

అయితే చంద్రబాబునాయుడు తీరు వేరు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం తప్ప మరొక యావ ఏదీ లేకుండా చెలరేగిపోతూ ఉండే చంద్రబాబునాయుడు, ఆ క్రమంలో విచక్షణ మరచిపోయి.. నేను గెలిస్తే నాణ్యమైన మద్యం అందిస్తా లాంటి అపభ్రంశపు ప్రకటనలు చేశారు. దాంతో జనం ఎదుట నవ్వులపాలయ్యారు. ప్రజలు ఆయనను చీదరించుకున్నారు.

ఇంత జరిగినా కూడా ఆయనకు మాత్రం బుద్ధి వచ్చినట్టు లేదు. ఎందుకంటే.. తాజాగా నిర్వహించిన ప్రజాగళం సభల్లో కూడా ఆయన మద్యం ప్రస్తావన తెస్తున్నారు. గతంలో తమ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో క్వార్టర్ రూ.60కే వచ్చేదని, ఇప్పుడు దానిని రూ.200 చేశారని పాపం.. తాగుబోతులు అందరి తరఫున ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. మళ్లీ మేం అధికారంలోకి వస్తే 60కే క్వార్టర్ సీసా అందిస్తామని హామీ ఇచ్చేయ్ చంద్రబాబూ.. మరోసారి జనం ఎదుట నవ్వులపాలు అయిపోవచ్చు.. అని ప్రజలు ఆయన మీద సెటైర్లు వేసుకుంటున్నారు. అధికారం మీది యావతో.. ఏం మాట్లాడుతున్నాననే యోచన కూడా లేకుండా ఆయన మాట్లాడుతున్నారని అంటున్నారు.

అదే సమయంలో నాడు-నేడు పనులు చేసి విద్యావ్యవస్థను నాశనం చేశారని చంద్రబాబునాయుడు నిందలు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అత్యద్భుతమైన పనుల్లో నాడు-నేడు రూపేణా పాఠశాలల రూపురేఖలు, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బాగుచేయడం ఒకటి. పాఠశాలల్లో అత్యద్భుతమైన వసతులతో పాటు, క్లీన్ గా ఉంటున్న మరుగుదొడ్లు, రక్షిత మంచినీటి సదుపాయంతో పాటూ అనేక వసతులు సమకూరుతున్నాయి. డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటవుతున్నాయి.

ఇవన్నీ ప్రజలు స్వయంగా చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు స్వయంగా చూస్తు్న్న అభివృద్ధి పనుల విషయంలో ఇలా చిల్లరగా విమర్శలు చేస్తే.. చంద్రబాబు కుత్సిత బుద్ధితో ఆరోపణలు చేస్తున్నారని జనం ఈసడించుకుంటారు. ఈ వాస్తవాల్ని ఆయన గుర్తు పెట్టుకుంటే ముందు ముందు ప్రచారం సందర్భంగా అయినా పరువు పోకుండా ఉంటుంది.