సినీ న‌టికో న్యాయం, సామాన్యురాలైతే మ‌రో న్యాయ‌మా?

నేరాన్ని అనుస‌రించి కాకుండా, రాజ‌కీయంగా మాత్ర‌మే చ‌ర్య‌లుంటాయ‌ని ఏపీ ప్ర‌భుత్వం నిరూపించుకుంద‌నే మాట వినిపిస్తోంది.

నేరాన్ని అనుస‌రించి కాకుండా, రాజ‌కీయంగా మాత్ర‌మే చ‌ర్య‌లుంటాయ‌ని ఏపీ ప్ర‌భుత్వం నిరూపించుకుంద‌నే మాట వినిపిస్తోంది. ముంబ‌య్ న‌టి కాదంబ‌రీ జెత్వానీ, తాజాగా తిరుప‌తి మ‌హిళ ల‌క్ష్మి కేసుల్ని ఇందుకు ఉదహ‌రిస్తున్నారు. కాదంబ‌రి జెత్వానీ కేసును తిర‌గ‌దోడి. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని స‌స్పెండ్ చేయ‌డంతో పాటు వాళ్ల‌పై కేసులు కూడా బ‌నాయించిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్‌కు ద‌క్కింది.

న్యాయ స్థానంలో ఐపీఎస్ అధికారుల‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్క‌డంతో స‌రిపోయింది. లేదంటే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈ పాటికి జైల్లో ఊచ‌లు లెక్కించాల్సి వ‌చ్చేది. మ‌హిళ‌ల విష‌యంలో త‌ప్పు ఎవ‌రు చేసినా క‌ఠినంగా వ్య‌వ‌హించాల్సిన అవ‌స‌రం వుంది. అయితే పాల‌కులు అలా వ్యవ‌హ‌రించ‌క‌పోవ‌డంతోనే విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. గ‌త మూడు రోజులుగా తిరుప‌తికి చెందిన ల‌క్ష్మి వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ త‌న‌ను మోస‌గించిన వైనాన్ని ఆమె మీడియా ముందుకొచ్చి ల‌బోదిదోమ‌నే చెప్పుకుంటోంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌ను కాపాడాల‌ని ఆమె వేడుకుంటోంది. ర‌క్షించ‌డం దేవుడెరుగు, ఆమెను రాజ‌స్థాన్ నుంచి వ‌చ్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. ల‌క్ష్మి ఆరోప‌ణ‌లు చేసిన వ్య‌క్తి మాత్రం ద‌ర్జాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు చెప్పుకుంటూ హీరోయిజాన్ని చెలాయిస్తున్నాడు.

ఇదే కాదంబ‌రి జెత్వానీ కేసులో నిందితుడైన విద్యాసాగ‌ర్ డెహ్రాడూన్‌లో దాక్కుంటే, పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తే, వైసీపీ హ‌యాంలో ప‌ని చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని టార్గెట్ చేసి, కాదంబ‌రిని సాకుగా చూపి క‌క్ష తీర్చుకుంద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. ప్ర‌భుత్వం క‌క్ష క‌డితే, చివ‌రికి ఐపీఎస్ అధికారుల్ని అయినా అరెస్ట్ చేయ‌డానికి వెనుకాడ‌ద‌ని జెత్వానీ కేసు నిరూపించింది.

ఇదే రాజ‌కీయ అండ వుంటే, ద‌ర్జాగా కాల‌ర్ ఎగ‌రేసుకుని తిరగొచ్చ‌ని తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ బాధితురాలి కేసు నిరూపిస్తోంది. ఒక మ‌హిళ త‌న‌కు అన్యాయం చేశార‌ని ఆరోప‌ణ‌లు చేస్తే, పార్టీ విచారించ‌డం ఏంటో అర్థం కాదు. పోలీసులతో నిష్ప‌క్ష‌పాతంగా ద‌ర్యాప్తు చేయిస్తే, స‌ద‌రు నాయ‌కుడు ఎంత‌టి ఘ‌నుడో తెలిసిపోతుంది. ఆ ప‌ని చేయ‌కుండా పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ అంత‌ర్గ‌త విచార‌ణ చేస్తుంద‌ట‌! రాజ‌కీయాల్లో జ‌న‌సేన‌, కూట‌మి ప్ర‌భుత్వం కొత్త ఒర‌వ‌డిని సృష్టిస్తున్నాయి. అయితే త‌మ‌ను జ‌నం చూస్తున్నార‌నే సంగ‌తి విస్మ‌రిస్తున్నారు.

30 Replies to “సినీ న‌టికో న్యాయం, సామాన్యురాలైతే మ‌రో న్యాయ‌మా?”

  1. ఈ లక్ష్మి “రెడ్డి” ని జైపూర్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారబ్బా..

    ఆ ముక్క రాయడానికి చేతులు రాలేదెందుకబ్బా..

    ఆంధ్ర లో న్యాయం కోరితే.. రాజస్థాన్ ప్రభుత్వానికి కోపం వచ్చిందా..? అదెలాగబ్బా..?

    ..

    ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే.. జేత్వాని కేసుకు, ఈ లక్ష్మి రెడ్డి కేసుకు సంబంధం లేదు అని మీకే తెలుస్తుంది..

    1. జేత్వాని కోసం వేరే రాష్ట్ర పోలీసులు రాలేదు కదా..

      అయినా హాస్పిటల్ దగ్గిర సిబిఐ వాళ్ళని అపిన చరిత్ర మన అన్నయ్య ది

  2. లచ్చక్కని చేసిన మోసాలు బైటపడి, వారం రోజులుగా రాజస్థాన్ పోలీసులు తిరుపతి లో మాటువేసి గాలిస్తున్నారని తెలిసీ, దొరికిపోవడం గ్యారంటే అని తన ల0జే కథలు చెబితే వదిలేస్తారా??

  3. యెందుకు అరెస్ట్ చేశారు GA….ఐన మీ 420 cheating batch కి దేశం మొత్తం ఇదే పనా GA…

  4. ఈ లక్ష్మి “రెడ్డి” ని జైపూర్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారబ్బా..

    ఆ ముక్క రాయడానికి చేతులు రాలేదెందుకబ్బా..

    ఆంధ్ర లో న్యాయం కోరితే.. రాజస్థాన్ ప్రభుత్వానికి కోపం వచ్చిందా..? అదెలాగబ్బా..?

    ..

    ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే.. జేత్వాని కేసుకు, ఈ లక్ష్మి రెడ్డి కేసుకు సంబంధం లేదు అని మీకే తెలుస్తుంది..

    న్యాయం కావాలనుకుంటే.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి.. కే సు పెట్టాలి..

    ఇంట్లో కూర్చుని .. రెడ్డి నాయకుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి.. నటిస్తే.. సరిపోదు..

    పోలీసుల దగ్గరికి వెళ్లి.. సాక్ష్యాధారాలతో.. FIR పెట్టమని అడగాలి.. అప్పుడు పోలీసులు విచారణ చేసి.. కిరణ్ రాయల్ తప్పు ఉందని తెలిస్తే.. అతను ఎక్కడికి పారిపోయినా.. పట్టుకొచ్చి కోర్ట్ లో నిలబెడతారు..

    ..

    ఇవన్నీ వదిలేసి.. వారికో న్యాయం.. వీరికో న్యాయం అంటూ.. జగన్ రెడ్డి భజన చేసుకొంటున్నావు..

    ఇక రెడ్డి తోక ఉంటె చాలు.. ఊడిగం చేసేస్తుంటావు.. బుద్ది ఉండక్కర్లేదా..?

      1. మీరు చాలా బాధలో ఉన్నట్టున్నారు.. మీ బాధ తగ్గాలని, మళ్ళీ సాధారణ మనిషి గా మారాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను..

        మీ అమ్మగారికి నా పాదాభివందనం..

      1. నా తల్లిని తిడితే మీకు ఆనందం..

        కానీ అదొక రోగం..

        మీ ఆరోగ్యం బాగు పడాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను..

        ..

        ఇలాంటివన్నీ వదిలేసి.. HELLO GURU అనే ఐడి తో ఉన్న వ్యక్తి.. నన్ను తిడుతుంటాడు..

        ఒక్కొక్కరు ఒక్కోలా ఉన్నారు.. మీ పార్టీ లో..

          1. నా తల్లి ని తిట్టడం తప్పితే మీకు వేరే కామెంట్స్ లేనట్టున్నాయి..

            నేను తప్పు చేస్తే నన్ను తిట్టండి.. నా తల్లి ఏమి తప్పు చేసిందో కూడా చెప్పండి..

            దయచేసి.. తల్లులను తిట్టడం మానేయండి.. ప్లీజ్..

          2. సర్.. మీరెవరో.. నా తల్లిని తిట్టడానికే ఐడి క్రియేట్ చేసుకొన్నటున్నారు..

            మీ కామెంట్స్ హిస్టరీ చూస్తుంటే.. నా తల్లిని తిట్టే కామెంట్స్ మాత్రమే ఉన్నాయి..

            మీలాంటి వాళ్ళ కోసం నా టైం వేస్ట్ చేసుకోను.. అందుకే మిమ్మల్ని బ్లాక్క్ చేసేస్తున్నాను..

            ఇంకో ఐడి చేసుకుని వచ్చి తిట్టుకోండి..

    1. ఔను మొన్న విసారే కి ఇచ్చి నట్టు కిరణ్ రాయల్ కి కూడా లుకౌట్ నోటీసులు ఇస్తే ఓ పని అయిపోయేది.

      1. విసారే కి లుక్ అవుట్ నోటీసులు ఎందుకు ఇచ్చారో కూడా రాయాలి తమరు ఇక్కడ..

        అప్పుడు మీకే సమాధానం లటుక్కున దొరికేస్తుంది..

  5. 2021 నుంచి దొరకలేదు. Just like that ఇప్పుడే ఎలా తెలిసింది రాజస్థాన్ పోలీసులకు? Wow.. koota నీతి

    1. హైసెన్సు గారు.. మీకు సెన్స్ లేదని గతం లో చెప్పాను.. ఇప్పుడు మీరే నిరూపించుకొన్నారు..

      మీ రెడ్డి మీడియా.. రెడ్డి సోషల్ మీడియా .. తెగ ప్రచారం చేశారు కదా సెన్స్ లెస్..

      జైపూర్ పోలీసులు ఆవిడ కోసం వెతుకుతున్నప్పుడు.. ఆవిడ అడ్రస్ తో సహా మీరే బయట పెట్టుకొన్నారు..

      కిరణ్ రాయల్ ని మీరే కాపాడేశారు..

  6. ఈవిడ గారి మాటలు కి చేష్టలు కి సంభంధం లేనట్లుంది. నిజంగా కిరణ్ వైపు తప్పుంటే FIR ఎందుకు కట్టలేదు?12 ఏళ్లనుండి పరిచయం వుంటే..ఇప్పుడు బయటికి వచ్చి మోసగాడు..అదీ ఇదీ అంటే ఎలా నమ్ముతారు?

  7. కాదంబరి జత్వాని కె.సుకి ఈమె కి సంబందం ఎమిటిరా?

    .

    కాదంబరి జత్వాని కెసులొ పొలీసులె….

    దొం.-.గ పత్రాలు శ్రుస్టించి,

    దొం.-.గ కెసులు పెట్టించి,

    దొం.-.గ అర్రెస్ట్ లు,చెసి,

    ఆమెని ఆమె కుటుంబాన్ని బెదిరించి, భయపెట్టి,

    అమె కెసు విరిగిపొయెలా అమెను నిర్బందించి,

    అమె చేత తెల్లపెపర్ల మీద సంతకాలు చెయించుకొని,

    చివరికి అమె ఫొనులొ సాక్షాలను కూడా మాయం చెసారు అన్నది అబియొగం!

    ఇక దీని వెకున స్వయంగా అప్పటి ముక్యమంత్రి వున్నాడు అన్నది అబియొగం! ఇక ఆ వివరాలు చూస్తె ఇట్టె అర్ధం అవుతుంది!

    .

    అసలు ఈ లక్ష్మి విషయం లొ ప్రస్తుత అంద్రా పొలీసుల ఇన్వొల్మెంట్ ఎముందిరా రెడ్డి?

  8. ఈమె అరెస్టుకి ఏపీ ప్రభుత్వానికి ఏంటి రా సంబంధం !

    వచ్చింది రాజస్తాన్ పోలీసులు!

    చీటింగ్ కే సులో,అరెస్టు చేసి తీసుకెళ్లుతున్నది జైపూర్ పోలీసులు.

Comments are closed.