దంచికొడుతున్న వాన‌

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఫెంగ‌ల్ తుపాను ప్ర‌భావంతో నెల్లూరు, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడ‌తెర‌ప‌లేకుండా వ‌ర్షం ప‌డుతోంది. దీంతో ఇళ్ల‌లో నుంచి జ‌నం బ‌య‌టికి రాలేని ప‌రిస్థితి. నిత్యావ‌స‌ర…

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఫెంగ‌ల్ తుపాను ప్ర‌భావంతో నెల్లూరు, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడ‌తెర‌ప‌లేకుండా వ‌ర్షం ప‌డుతోంది. దీంతో ఇళ్ల‌లో నుంచి జ‌నం బ‌య‌టికి రాలేని ప‌రిస్థితి. నిత్యావ‌స‌ర స‌రుకులు తెచ్చుకునేందుకు మార్కెట్‌కు వెళ్లేందుకు కూడా వీల్లేకుండా ఏక‌ధాటిగా వ‌ర్షం ప‌డుతూనే వుంది.

శ‌నివారం రాత్రి 11 గంట‌ల‌కు పుదుచ్చేరికి స‌మీపంలో తీరం దాటింది. ఈ విష‌యాన్ని భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఆదివారం కాసేపు విరామం, ఆ త‌ర్వాత వ‌ర్షం…ఇలా వాతావ‌ర‌ణం నెల‌కుంది. అయితే వైఎస్సార్ ,అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో వ‌ర్షం ప‌డ‌లేదు.

ఉమ్మ‌డి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తుపాను ప్ర‌భావంతో ప‌డుతున్న వ‌ర్షం వ‌ల్ల పొలాలు చెరువులు త‌ల‌పిస్తున్నాయి. ముఖ్యంగా వ‌రి పంట పూర్తిగా నీళ్ల‌లో మునిగిపోయిన‌ట్టు నెల్లూరు జిల్లా వాసులు వాపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా తిరుమ‌ల‌లో ఎడ‌తెరిపి లేని వ‌ర్షంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

ద‌ర్శ‌నానికి వెళ్లాలంటే తెర‌ప ఇవ్వ‌క‌పోవ‌డంతో వాన‌లోనే త‌డుస్తూ వెళ్లాల్సి వ‌స్తోంద‌ని భ‌క్తులు అంటున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఒక‌ట్రెండు రోజుల్లో పూర్తిగా తెర‌ప ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు తెలిపారు.

5 Replies to “దంచికొడుతున్న వాన‌”

  1. అందెంటి నెల్లూరు, చిత్తూరు లొకట్టు ప్రాంతాలు, ముంపు ప్రంతాలు కాదు కదా?? మరి పొలాలు చెలువులని ఎలా తలపిస్తున్నాయి???

    .

    ఒక్కసారిగా విపరీతంగా వర్షం పడితె ఎ ప్రాంతం అయినా మునుగుతుంది!!

Comments are closed.