‘పళ్ళు రాలగొడతా రాస్కెల్’ రెచ్చిపోయిన గంటా

ప‌ళ్లు రాల‌గొడ‌తా రాస్కెల్‌. గాడిద‌లు కాస్తున్నారా? క‌ళ్లు క‌నిపించ‌డం లేదా?

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించే పోలీసు అధికారుల‌పై వైఎస్ జ‌గ‌న్ ఘాటు హెచ్చ‌రిక చేయ‌గా, సంబంధిత సంఘం నేత‌లు, అలాగే కూట‌మి నేత‌లు ఆయ‌న‌పై విరుచుకుప‌డ్డారు. తాజాగా టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఏకంగా ఓ ప్ర‌భుత్వ ఉద్యోగిని అంద‌రి ఎదుటే ప‌ళ్లు రాల‌గొడ‌తాన‌ని సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు సంబంధిత ఉద్యోగ సంఘం నేత‌లు మీడియా ముందుకొచ్చి, టీడీపీ ఎమ్మెల్యే తీరును త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి వుందా? క్ష‌మాప‌ణ డిమాండ్ చేయ‌గ‌ల ద‌మ్ము వుందా? అనే ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

అస‌లేం జ‌రిగిందంటే… భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎండాడ‌లో ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు గురువారం ప‌ర్య‌టించారు. తాగేందుకు నీళ్లు, స‌రైన డ్రైనేజీ వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డంపై స్థానికులు ఎమ్మెల్యేను నిల‌దీశారు. దీంతో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేక … అత్త‌మీద కోపం దుత్త‌మీద చూపిన‌ట్టుగా, శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ ర‌విపై నోరు పారేసుకున్నారు.

“ప‌ళ్లు రాల‌గొడ‌తా రాస్కెల్‌. గాడిద‌లు కాస్తున్నారా? క‌ళ్లు క‌నిపించ‌డం లేదా?” అని శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్‌ను నోటికొచ్చిన‌ట్టు తిట్టారు. ఆ స‌మ‌యంలో గంటా చుట్టూ స్థానికులు, టీడీపీ అనుచ‌రులు ఉండ‌డం గ‌మ‌నార్హం. అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్ల‌కు త‌లొంచుకుని, భ‌రించ‌డం త‌ప్ప స‌ద‌రు ఉద్యోగి ఏమీ మాట్లాడ‌కపోవ‌డం గ‌మ‌నార్హం. స‌మ‌స్య‌ల్ని స్థానికులు త‌న దృష్టికి తీసుకొచ్చిన‌పుడు, సంబంధిత అధికారుల‌తో మాట్లాడి ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌జాప్ర‌తినిధుల‌పై వుంటుంది.

కానీ నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డం ఏ మేర‌కు సంస్కారం అని ఉద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌య‌మై మున్సిప‌ల్ ఉద్యోగ సంఘం నాయ‌కులు సీరియ‌స్‌గా స్పందించాల్సిన అవ‌స‌రాన్ని వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఇలాగైతే ఎవ‌రూ ఉద్యోగాలు చేయ‌లేర‌ని, గంటాను ఆద‌ర్శంగా తీసుకుని మ‌రో ప్ర‌జాప్ర‌తినిధి కూడా నోరు పారేసుకుంటార‌ని ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వ స్పంద‌న ఎలా వుంటుందో మ‌రి!

7 Replies to “‘పళ్ళు రాలగొడతా రాస్కెల్’ రెచ్చిపోయిన గంటా”

  1. ఏమీ నష్టం లేదు … ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఎలాగూ ఏ పని చెయ్యరు .. తన్నినా తప్పులేదు

  2. “గుడ్డలు వూడదీసి కొడతా” అన్న బోకు గాడి మాటలతో పోలిస్తే ఇవి జుజుబి!!

Comments are closed.