క‌డ‌ప వైసీపీలో స‌మ‌స్య‌… జ‌గ‌న్‌కు!

గెలుపోట‌ములు శాశ్వ‌తం కాద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. అయితే మ‌ళ్లీ గెలుస్తామ‌న్న ధీమాను జ‌గ‌నే క‌ల్పించాలి.

క‌డ‌ప వైసీపీలో స‌మ‌స్య‌. వైసీపీకి కంచుకోట‌లాంటి క‌డ‌ప న‌గ‌రంలో ఆ పార్టీ ప్ర‌తికూల ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకే ఇడుపుల‌పాయ‌కు క‌డ‌ప కార్పొరేట‌ర్ల‌ను ప్ర‌త్యేకంగా పిలిపించుకుని జ‌గ‌న్ మాట్లాడారు. భ‌విష్య‌త్ మ‌న‌దే అని, క‌ష్టాలు శాశ్వ‌తం కాద‌ని కార్పొరేట‌ర్ల‌లో ధైర్యం నింపే ప్ర‌యత్నం చేశారు. అయితే వైసీపీకి అడ్డాగా పేరు పొందిన క‌డ‌ప‌లో సంక్షోభం త‌లెత్త‌డం ఒక ర‌కంగా జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా మంచిదే.

రాజ‌కీయంగా అత్యంత బ‌లమైన క‌డ‌ప‌లో ఈ ప‌రిస్థితిని జ‌గ‌న్ ఊహించి వుండ‌రు. 2024లో రాజ‌కీయంగా జ‌గ‌న్ ఏ మాత్రం ఊహించన‌వి జ‌రిగాయి. ముఖ్యంగా క‌డ‌ప న‌గ‌రంలో వైసీపీ ఓడిపోవ‌డం అంటేనే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప‌రిస్థితి బాగా లేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు 8 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు టీడీపీ పంచ‌న చేరారు.

జ‌గ‌న్‌కు మేల్కోడానికి ఇదే స‌రైన స‌మ‌యం. వైసీపీ కార్పొరేట‌ర్లు టీడీపీలోకి వెళ్లేందుకు ఆస‌క్తి చూపుతున్నారంటే, సొంత గడ్డ‌పైనే స‌రైన నాయ‌క‌త్వం లేద‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికైనా తెలుసుకోవాలి. క‌డ‌ప మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు జ‌గ‌న్‌కు ఓ హెచ్చ‌రిక‌. అలాగే ఆయ‌న స‌మ‌ర్థ‌త‌కు, న‌మ్మ‌కానికి రాజ‌కీయ ప‌రీక్ష‌.

బంధువుల పేరుతో అడ్డ‌మైనోళ్ల‌కు రాజ‌కీయ ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్లే నేడు క‌డ‌ప‌లోనూ, జిల్లా వ్యాప్తంగా శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. గెలుపోట‌ములు శాశ్వ‌తం కాద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. అయితే మ‌ళ్లీ గెలుస్తామ‌న్న ధీమాను జ‌గ‌నే క‌ల్పించాలి. ఇందుకోసం ఏం చేయాలో జ‌గ‌నే ఆలోచించాలి. క‌డ‌ప‌లోనూ, అలాగే వైఎస్సార్ జిల్లాలోనూ వైసీపీకి బ‌ల‌మైన నాయక‌త్వ కొర‌త వుంది. అందువ‌ల్లే కార్పొరేట‌ర్లు గోడ దూక‌డానికి సిద్ధంగా ఉన్నారు.

అటువైపు వెళ్తున్నార‌ని జ‌గ‌న్ స‌మావేశం కావ‌డం ముఖ్యం కాదు. అస‌లు ఆ అలోచ‌నే క‌ల‌గ‌కుండా జ‌గ‌న్‌, ఆయ‌న న‌మ్మ‌కంగా బాధ్య‌త‌లు అప్ప‌గించిన వైసీపీ నాయ‌కులు చ‌ర్య‌లు తీసుకుని వుండాలి. ఆ ప‌ని చేయ‌లేద‌ని ఇప్ప‌టికైనా జ‌గ‌న్‌కు తెలిసొస్తే మంచిదే. ప్ర‌తి సంక్షోభాన్ని సానుకూలంగా మ‌లుచుకోవ‌డ‌మే నాయ‌క‌త్వ గొప్ప‌త‌నం. జ‌గ‌న్ కూడా ఆ కోణంలో ఆలోచించి, లోపాల్ని గుర్తించి, స‌రిదిద్దుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది

17 Replies to “క‌డ‌ప వైసీపీలో స‌మ‌స్య‌… జ‌గ‌న్‌కు!”

  1. అదేంటోగాని.. పార్టీ పూర్తిగా సంక నాకిపోతున్నా.. అది జగన్ రెడ్డి కి మంచిదే అని రాసుకోడానికి గట్స్ అయినా ఉండాలి.. లేదా సిగ్గొదిలేసి అయినా ఉండాలి..

    దేశ ప్రధాన మంత్రులనే తన వేళ్ళ మీద ఆడించిన జగన్ రెడ్డి కి.. ఇప్పుడు తన సొంత జిల్లా కార్పొరేటర్లను కాపాడుకోడానికి.. వాళ్ళ కాళ్ళ మీద పడే దుస్థితికి దిగజారిపోతే.. అంతా జగన్ రెడ్డి కి మంచిదే అనే భజన లో మాత్రం సౌండ్ తగ్గకుండా చూసుకోవడం.. ఒక టాలెంట్..

    ..

    2019-24 మధ్యలో చంద్రబాబు కుప్పం కి వెళితే వెటకారమాడిన ఈ నీలి మీడియా కి.. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రతి నెలకు రెండు సార్లు పులివెందుల వెళ్లి తిప్పలు పడుతుంటే మాత్రం.. మన జగన్ రెడ్డి కె మంచిది అని రాసుకోడానికి.. సిగ్గు, మానం, లజ్జ వదిలేసి బతుకుతున్నారని తెలుస్తోంది..

  2. అదేంటోగాని.. పార్టీ పూర్తిగా సంక నాకిపోతున్నా.. అది జగన్ రెడ్డి కి మంచిదే అని రాసుకోడానికి గట్స్ అయినా ఉండాలి.. లేదా సిగ్గొదిలేసి అయినా ఉండాలి..

    దేశ ప్రధాన మంత్రులనే తన వేళ్ళ మీద ఆడించిన జగన్ రెడ్డి కి.. ఇప్పుడు తన సొంత జిల్లా కార్పొరేటర్లను కాపాడుకోడానికి.. వాళ్ళ కాళ్ళ మీద పడే దుస్థితికి దిగజారిపోతే.. అంతా జగన్ రెడ్డి కి మంచిదే అనే భజన లో మాత్రం సౌండ్ తగ్గకుండా చూసుకోవడం.. ఒక టాలెంట్..

  3. అదేంటోగాని.. పార్టీ పూర్తిగా సంక నాకిపోతున్నా.. అది జగన్ రెడ్డి కి మంచిదే అని రాసుకోడానికి గట్స్ అయినా ఉండాలి.. లేదా సిగ్గొదిలేసి అయినా ఉండాలి..

    దేశ ప్రధాన మంత్రులనే తన వేళ్ళ మీద ఆడించిన జగన్ రెడ్డి కి.. ఇప్పుడు తన సొంత జిల్లా కార్పొరేటర్లను కాపాడుకోడానికి.. వాళ్ళ కాళ్ళ మీద పడే దుస్థితికి దిగజారిపోతే.. అంతా జగన్ రెడ్డి కి మంచిదే అనే భజన లో మాత్రం సౌండ్ తగ్గకుండా చూసుకోవడం.. ఒక టాలెంట్..

    ..

    2019-24 మధ్యలో చంద్రబాబు కుప్పం కి వెళితే వెటకారమాడిన ఈ నీలి మీడియా కి.. ఇప్పుడు జగన్ రెడ్డి ప్రతి నెలకు రెండు సార్లు పులివెందుల వెళ్లి తిప్పలు పడుతుంటే మాత్రం.. మన జగన్ రెడ్డి కె మంచిది అని రాసుకోడానికి.. సి గ్గు, మా నం, ల జ్జ వదిలేసి బతుకుతున్నారని తెలుస్తోంది..

  4. మావోడు సోనియా & మోడీ మెడలు వొంచే స్థాయి నుండి ఆఫ్టరాల్ సిల్లీ గల్లీ గాళ్ళ ముందు మోకాళ్ళు వొంచి

    “పార్టీ వీడొద్దు” అని అడుక్కునే స్థాయికి దిగజార్చారు కదరా.. నీ ‘యమ్మ కడుపులు మాడా.. తూ

  5. ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల వైసీపీకి నష్టం లేదు. 23 మంది ఎం. ఎల్. ఏ. లు మారినా నాలుగేళ్లలో అధికారం దక్కించుకున్నారు. పైగా ప్రజల మనసులు గెలుచుకోకుండా ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేస్తే టీడీపీ మీద వ్యతిరేకత పెరగవచ్చు.

    1. అప్పుడు మన వాడు పాలన ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అప్పుడు ఓట్లు వేశారు..

      ఇప్పుడు మనవాడి పాలన చూశాక ఓట్లు వేయడానికి భయపడుతున్నారు..

      మనవాడి కన్నా ఘోరం గా పాలన చేస్తే తప్ప ఛాన్స్ రాదు..

      అప్పటి దాకా పార్టీ ని కాపాడుకోక తప్పదు..

      జగనన్న బొమ్మ తో మాత్రం ఓట్లు పడవు..

  6. ఎవ్వరు పోయినా ఏమైతాది??.. సున్నా తో స్టార్ట్ చేసి

    “రాబోయే లోకల్ ఎలక్షన్ లో కడప మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం.. ఆ మాదిరిగా ముందుకు అడుగులు వేస్తాం” అని కూడా చెప్పుంటాడే??.. రాయడం మర్చిపోయావా ఏంకటి??

  7. జగన్ ని,

    పార్టీనీ నమ్ముకుని ఆస్తులు పోగొట్టుకున్న ఆ కార్పొరేటర్ లు అడిగిన ఒకే ఒక రిక్వెస్ట్.

    తమకి కాస్త ఆర్థిక ఆలంబన కలుగ చెయ్యమని.

    బాత్రూం కి కూడా ఫ్లైట్ లో వెళ్లే కోటీశ్వరుడు జగన్, తమని నమ్ముకున్న వాళ్ళకి ఆ కాస్త సహాయం చేస్త్తర లేక ప్యాలస్ లో గల్లా పెట్టే నింపే వాళ్ళకీ మాత్రమే నాయకుడు గా వుంటార?

    కడప కార్యకర్తలు మాత్రమే చెప్పాలి.

Comments are closed.