రాజ శ్యామల యాగానికి జగన్ వస్తున్నారా?

రాజ శ్యామల యాగం చేసిన వారికి అధికారం దక్కుతుంది. ఇది పురాణ కాలం నుంచి ఉన్న సెంటిమెంట్. ఆధునిక కాలంలో వర్తమానంలో చాలా మంది అధికారాన్ని అలాగే అందుకున్నారు. కేసీఆర్ రెండు సార్లు సీఎం…

రాజ శ్యామల యాగం చేసిన వారికి అధికారం దక్కుతుంది. ఇది పురాణ కాలం నుంచి ఉన్న సెంటిమెంట్. ఆధునిక కాలంలో వర్తమానంలో చాలా మంది అధికారాన్ని అలాగే అందుకున్నారు. కేసీఆర్ రెండు సార్లు సీఎం గా తెలంగాణాలో అయ్యారు అంటే రాజ శ్యామల అమ్మవారి దయ అని అంటారు.

ఏపీలో చూస్తే ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేయించారు అని ప్రచారంలో ఉంది. విశాఖలోని శ్రీ శారదాపీఠంలో ప్రతీ ఏటా వార్షికోత్సవాలు అయిదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా రాజ శ్యామల యాగం కూడా చేస్తారు.

సీఎం అయిన తరువాత ప్రతీ ఏటా జగన్ దాదాపుగా వార్షికోత్సవాలకు వస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 15 నుంచి 19 వరకూ వార్షికోత్సవాలు శ్రీ శారధాపీఠంలో జరుగుతున్నాయి. చివరి రోజున రాజశ్యామల యాగం ఉంటుంది అని అంటున్నారు.

శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర మహా స్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ప్రత్యేకంగా ఆయన క్యాంప్ ఆఫీసులో కలసి వార్షికోత్సవాల పత్రికను ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వార్షికోత్సవ విశేషాలను తెలియచేశారు. రాజ్యశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని జగన్ కి అందచేశారు.

జగన్ ఈసారి కూడా రాజ శ్యామల యాగంలో పాల్గొంటారా అమ్మవారిని దర్శించుకుంటారా అన్నది చూడాలి. కేసీఆర్ కి రెండు సార్లు అధికార యోగం దక్కింది. జగన్ కూడా రెండుకు మించి అధికారంలో ఉంటారని జోతీష్యాలు వినిపిస్తున్న వేళ రాజ శ్యామల అమ్మవారి దీవెనలు ఆయనకు నిండుగా ఉంటాయని వైసీపీ నేతలు అంటున్నారు.