నెంబర్ 9 పిచ్చి పీక్స్ కు చేరుతోందా?

చంద్రబాబు నాయుడుకు కూడా 9 అంకె మీద లక్కీ నెంబర్ అనే నమ్మకం ఉంది.

9 అనేది అదృష్ట సంఖ్య అని చాలామంది భావిస్తుంటారు.. కారు నెంబర్లు 9 వచ్చేలా ఉండాలని చాలామంది ఆరాటపడుతుంటారు. 9 నెంబరు కోసం గాని 9999 నెంబర్ కోసం గానీ చాలా భారీ మొత్తాలకు వేలంపాటలు సాగుతూ ఉంటాయి. 20-30 లక్షల రూపాయలకు ఆన్లైన్ నెంబరు వేలంలో కొనుగోలు చేసిన మోజు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.

ఇదే తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా 9 అనే లక్కీ నెంబర్ మీద విపరీతమైన వ్యామోహం ఉన్నట్లుగా ఉంది. చివరికి రాజధాని కోసం చేస్తున్న భూసమీకరణ ప్రయత్నాలలో కూడా ఆయన 9 అంకె వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో అనిపిస్తోంది.

ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉన్న అమరావతి రాజధాని కోసం గతంలో 54 వేల ఎకరాల భూములు సమీకరించారు. అక్కడ ఇప్పుడు పనులు ప్రారంభం కావాల్సి ఉంది. వేగంగా ఆ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో 5,000 మంది కార్మికులు పనులు చేస్తున్నారని ఈ నెలాఖరు నాటికి ప్రధాని వచ్చి శంకుస్థాపనలు నిర్వహించే నాటికి మరో 15 వేల మంది కార్మికులు కూడా ఇక్కడ నిర్మాణ పనుల్లో జాయిన్ అవుతారని ప్రభుత్వంలోని పెద్దలు చెప్పుకుంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ తదితర కొత్త ఆలోచనలు చంద్రబాబుకు పుట్టుకొచ్చాయి. విమానాశ్రయం కోసం 5వేల ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం 1600 ఎకరాలు కావాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటికోసం 30 వేల ఎకరాలకు పైగా భూములు సమీకరిస్తేనే అవి సాధ్యమవుతాయని కూడా లెక్కలు వేస్తున్నారు.

తమాషా ఏమిటంటే 30 వేల ఎకరాలకు పైగా భూములు కొత్తగా అవసరమవుతాయి అనుకుంటున్న తరుణంలో సమీకరించే భూముల విస్తీర్ణాన్ని 44,676 ఎకరాలు ఉండేలా చూడాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు నిర్దిష్టంగా ఏమి అవసరాలు ఉన్నాయో.. వాటికి కచ్చితంగా ఎంత భూమి సరిపోతుందో.. దానికి సరిపడా ఎంత సమీకరించవలసి వస్తుందో.. ఇప్పటిదాకా వారి దగ్గర లెక్కలు లేవు.

కానీ భూమి మాత్రం 44,676 ఎకరాలు అని చాలా ఖచ్చితత్వంతో చెబుతున్నారు. ఆ ఫైనల్ ఫిగర్ కు ఎలా రాగలిగారు అని ఆలోచిస్తే ‘నెంబర్ 9 మీద ఉన్న మోజు కారణం’ అని పలువురు విశ్లేషిస్తున్నారు.

చంద్రబాబు నాయుడుకు కూడా 9 అంకె మీద లక్కీ నెంబర్ అనే నమ్మకం ఉంది. అమరావతి కోసం 54 వేల ఎకరాల సేకరించారు. ఇప్పుడు నయా అమరావతి కోసం 44 వేలు మాత్రమే కాకుండా మరో 676 కలిపితే ఆ మొత్తాన్ని కూడినప్పుడు లక్కీ నెంబర్ 9 వస్తుందనేది.. ఆయన ఆలోచనగా ఉంది. భూ సమీకరణలో కూడా ఈ అంకెల గురించిన వ్యామోహం ఏమిటి బాబు గారూ అని ప్రజలు విస్తుపోతున్నారు!

7 Replies to “నెంబర్ 9 పిచ్చి పీక్స్ కు చేరుతోందా?”

  1. ఒరేయ్, నువ్వు వీడియో గేమ్ లో ఐనా ఒక సిటీ బిల్డ్ చేయరా చూద్దాం, తింగరి మొహం. ఆ సత్తా లేకుండానే మీ పుల్లన్న మూడు ముక్కలు ఆడి రెండు నామాలు 11 తో పోయాడు

  2. In numerology, the number 9 is associated with completion, abundance, and humanitarian efforts. It’s often seen as the culmination of a cycle, leading to new beginnings and the realization of life’s purpose.  That may be the reason, he has chose 9 number, as he wanted to complete this task, wish people of AP with abundance of happiness in their lives

Comments are closed.