మంత్రిని అడ్డుకున్న జ‌న‌సేన నాయ‌కులు

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ను జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు.

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తిలో రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ను జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ‌కు క‌నీస గుర్తింపు లేద‌ని, కూట‌మిలో తాము భాగ‌స్వామ్య‌మ‌నే సంగ‌తే మ‌రిచిపోయారంటూ మంత్రి ఎదుట ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ‌రాత్రి మ‌హోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించేందుకు మంత్రి అక్క‌డికి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డితో పాటు ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా హాజ‌ర‌య్యారు. అయితే జ‌న‌సేన నాయ‌కుల్ని మాత్రం ఆహ్వానించ‌లేద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆగ్ర‌హంపై ఉన్న జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మంత్రి వ‌ద్ద‌కెళ్లారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ఏ ఒక్క కార్య‌క్ర‌మానికి త‌మ‌ను ఆహ్వానించ‌లేద‌ని, ఇదెక్క‌డి అన్యాయ‌మ‌ని మంత్రిని నిల‌దీశారు. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన ప‌రిస్థితి ప్ర‌తిప‌క్షం కంటే అధ్వానంగా ఉంద‌ని వాపోయారు. గుర్తింపు లేక‌పోతే ఎలా అని మంత్రిని నిల‌దీశారు.

ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి త‌మ‌ను దూరం పెట్టార‌ని, ఇలా ఎన్నాళ్ల‌ని వాళ్లు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అయితే జ‌న‌సేన నాయ‌కుల్ని మంత్రి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. క‌నీసం వాళ్ల ఆవేద‌న విన‌డానికి కాసేపు నిల‌బ‌డ‌డానికి కూడా ఆయ‌న ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం మ‌రింత ఆగ్ర‌హాన్ని తెప్పించింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

2 Replies to “మంత్రిని అడ్డుకున్న జ‌న‌సేన నాయ‌కులు”

  1. బడ్జెట్ లో ఏపీ కి ఎం రాలేదా… ? వాళ్ళకి తెలీదా ఇస్తే ఎం జరుగుతుందో.. ? 7 నెలల్లో ల.. యాభై వేల కోట్ల అప్పు చేశారు.. ఎక్కడికెళ్లిందో మనకి తెలియకపోయిన మోడీ కి తెలీదా.. ?

  2. Ante annav kaani ….aa uha entha bagundo…

    Akkada janasena ledu… adigindi ledu…antha mana paytm batche kada…

    Day time lo dreams enti GA

    Pavan anna TDP ki bye chepthe.. 4 va pellam ready ga unda enti..??

Comments are closed.