ఆఖరికి పోసాని కృష్ణమురళి మాటలకు కూడా బెదిరిపోయినట్టుగా ఉన్నాడు లోకేషుడు. పోసానిపై లోకేష్ ఏదో పరువు నష్టం దావా వేశాడట! మరి ఆ దావా సంగతేమిటో కోర్టు చూడాల్సి ఉంది. ఆ సంగతలా ఉంటే.. రాజకీయ నేతలు వేసే ఇలాంటి దావాలు ఎప్పుడూ మరో రకమైన విశ్లేషణలకు దారి తీస్తూ ఉంటాయి. తమ పరువు నష్టం దావాలో ఆ నేతలు యాభై లక్షలు, కోటీ అంటూ ఉంటారు. మరి వారి పరువు విలువ అంతనా! అనుకోవాల్సి వస్తోంది. అంతేనా అనుకోవాల్సి వస్తుంటుంది.
ఇక రోడ్డెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏదేదో మాట్లాడటమే పనిగా పెట్టుకున్న లోకేష్ ఇప్పుడు తనపై పోసాని మురళి ఏదో మాట్లాడాడు అంటూ పరువు నష్టం దావా వేయడం పరాకాష్ట! ఉదయం లేస్తే లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యమంత్రి విషయంలో అయితే అనుచిత భాషా ప్రయోగం కూడా చేస్తూ ఉంటాడు.
ఒరేయ్, అరేయ్, అంటూ వాడూ, వీడూ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. లోకేష్ మాటలు వింటే.. పొగరెక్కిన కృష్ణా జిల్లా కమ్మ కుర్రాడులా ఉంటాయి. కనీస పరిణతి కూడా ఉండదు! మరి ఇతడు తన గురించి ఎవరో ఏదో మాట్లాడాడు అంటూ పరువు నష్టం దావా వేయడం ఏమిటో! మరి తన వాకింగ్ యాత్రలో ప్రత్యర్థులపై లోకేష్ మాట్లాడున్న మాటలన్నింటిపై దావాలు వేస్తే.. అప్పుడు లోకేషుడి పరిస్థితి ఏమిటి!
అయినా పోసాని మాటలకు బెదిరిపోయి దావా వేసిన లోకేష్ మాటలను ప్రజలే పసలేనివి అని అని ఇతడి ప్రత్యర్థులు భావిస్తున్నట్టున్నారు. అందుకే వారు ఇలాంటి దావాలు ఏమీ వేయడం లేనట్టుగా ఉంది.