నాన్న‌కు ప్రేమ‌తో.. లోకేశ్ ఏం చేశారంటే?

16 వేల‌కు పైగా ఉపాధ్యాయ అభ్య‌ర్థుల‌కు ఉద్యోగ, ఉపాధి భ‌ద్ర‌త ఇవ్వ‌డం ద్వారా, తండ్రి పుట్టిన రోజును జీవితంలో మ‌రుపురాని రోజుగా మిగిల్చుకోవాల‌ని లోకేశ్ త‌లిచారు.

నాన్న‌కు ప్రేమ‌తో మంత్రి నారా లోకేశ్ మంచి ప‌ని చేశారు. ఇవాళ చంద్ర‌బాబు 75వ పుట్టిన రోజు. బాబుకు బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. స‌హ‌జంగానే విజయానికి అంద‌రూ ఆత్మీయులే. ఓట‌మికి అంద‌రూ శ‌త్రువులే. అధికారంలో ఉన్న నాయ‌కుల‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి అంతా ఉత్సాహం చూపుతుంటారు. ఇదే ఓడిపోయిన నాయ‌కుడికి శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి మ‌న‌సు రాదు. దీనికి కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి అధికారంలో వుంది. ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అందుకే ఆయ‌న‌కు అనుకూల మీడియాలో పోటీలు ప‌డి మ‌రీ టీడీపీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు చెబుతూ వాణిజ్య‌ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. ఇందులో పెద్ద‌గా ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. అధికారానికి ఉన్న ప‌వ‌ర్ అలాంటిది మ‌రి.

అయితే త‌న తండ్రికి మంత్రి నారా లోకేశ్ ఏం ఇచ్చార‌నేదే ఆస‌క్తి. మంత్రి నారా లోకేశ్ చంద్ర‌బాబు కేబినెట్‌లో విద్యాశాఖ బాధ్య‌త‌ల్ని చూస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వాలంటూ సంబంధిత అభ్య‌ర్థుల నుంచి డిమాండ్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందులోనూ చంద్ర‌బాబు మొట్ట‌మొద‌ట సంత‌కం చేసిన ఫైల్ కూడా డీఎస్సీదే కావ‌డం గ‌మ‌నార్హం.

దీంతో త‌న తండ్రి 75వ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని, మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని సంబంధిత శాఖ మంత్రిగా లోకేశ్ ఆలోచించారు. ముంద‌స్తు స‌మాచారం లేకుండా, డీఎస్సీ నోటిఫికేష‌న్ వెలువ‌రించి అభ్య‌ర్థుల్ని ఆనందాశ్చర్యానికి గురి చేశారు. 16 వేల‌కు పైగా ఉపాధ్యాయ అభ్య‌ర్థుల‌కు ఉద్యోగ, ఉపాధి భ‌ద్ర‌త ఇవ్వ‌డం ద్వారా, తండ్రి పుట్టిన రోజును జీవితంలో మ‌రుపురాని రోజుగా మిగిల్చుకోవాల‌ని లోకేశ్ త‌లిచారు. ఆ త‌లంపే ఆచ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం విశేషం. కార‌ణం ఏదైనా డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు మంచి జ‌రిగే నిర్ణ‌యం తీసుకోవ‌డం ప్ర‌శంస‌నీయం.

20 Replies to “నాన్న‌కు ప్రేమ‌తో.. లోకేశ్ ఏం చేశారంటే?”

  1. చంద్రబాబు కి పదవిలో లేనప్పుడు కూడా అందరూ శుభాకాంక్షలు చెప్పారు రా ?

  2. ఫస్ట్ 2 పేరాల్లో నీ కడుపు మంట తెలుస్తోంది..

    చంద్రబాబు పైన నువ్వు ఎంతగా రగిలిపోతున్నావో అర్థమవుతోంది..

    ఈ లక్షణాలన్నీ చూస్తుంటే.. తొందర్లో నీకు వైసీపీ లో మంచి పదవి దొరుకుతుందని అనిపిస్తోంది..

    అంతర్జాతీయ కార్యదర్శి పదవి నుండి సీమ రాజా ని తొలగించేసి.. జగన్ రెడ్డి నిన్ను పెడతాడని జనాలు అనుకొంటున్నారు..

      1. ఎగిరెగిరి దంచినా.. కూర్చుని దంచినా .. ఒకటే కూలి..

        2029 లో జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా రావడమే గొప్ప.. దాంతో సంతోషపడిపోతారు ఈ PAYTM కూలీలు….

      2. ఎగిరెగిరి దంచినా.. కూర్చుని దంచినా .. ఒకటే కూలి..

        2029 లో జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా రావడమే గొప్ప.. దాంతో సంతోషపడిపోతారు ఈ PAYTM కూలీలు….

      1. నీకు కూడా నీ జగన్ రెడ్డి మంచి పదవి ఇస్తాడులే..

        పార్టీ లక్షణాలు పుణికి పుచ్చుకొన్నావు..

  3. హమ్మయ్య మొదటి సంతకానికి 10 నెలలు పట్టిందా just నోటిఫికేషన్ release చేయడానికి ఆదికూడా సగం jobs previous govt. Dsc నోటిఫికేషన్ లొ వున్నవే. Results కోసం మళ్ళీ వచ్చే పుట్టినరోజు దాకా ఆగమంటాడా ఏంటి మాలోకం!

  4. ఎగిరెగిరి దంచినా.. కూర్చుని దంచినా .. ఒకటే కూలి..

    2029 లో జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా రావడమే గొప్ప.. దాంతో సంతోషపడిపోతారు ఈ PAYTM కూలీలు….

Comments are closed.