టీటీడీ భ‌క్తుల మ‌న‌సుల్లో మంట‌లు

ఎప్పుడూ లేని విధంగా, కొంత‌కాలంగా ఎందుకు దుర్ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

టీటీడీలో వ‌రుస దుర్ఘ‌ట‌న‌లు శ్రీ‌వారి భ‌క్తుల మ‌న‌సుల్లో మంట‌లు రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తిరుమ‌ల‌లో కారు ద‌గ్ధం కావ‌డాన్ని మ‌రిచిపోక‌నే, మ‌రొక‌టి అలాంటిదే చోటు చేసుకోవ‌డం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. తిరుమ‌ల రెండో ఘాట్‌రోడ్డులో వెళుతున్న కారులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అందులోని భ‌క్తులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఈ ఘ‌ట‌న రెండో ఘాట్ రోడ్డులోని భాష్య‌కార్ల స‌న్నిధి వ‌ద్ద ఆదివారం చోటు చేసుకుంది. కారు ఇంజ‌న్ ముందుభాగం నుంచి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. దీన్ని అందులో ప్ర‌యాణిస్తున్న భ‌క్తులు గుర్తించారు. వెంట‌నే కారును నిలిపి, అందులోంచి వాళ్లు కిందికి దిగారు. దూరంగా ప‌రుగు తీసి, ప్రాణాల్ని కాపాడుకున్నారు.

అంద‌రూ చూస్తుండ‌గానే కారు అగ్నికీల‌ల్లో ద‌గ్ధమైంది. వేసవి కాలం కావ‌డంతో కారు ఇంజ‌న్‌లో వేడి ఎక్కువై మంట‌లు చెల‌రేగాయ‌ని భావిస్తున్నారు. ఏది ఏమైనా తిరుమ‌ల‌కు సంబంధించి ప్ర‌తి రోజూ ఏదో ఒక దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంటుండంతో భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఎప్పుడూ లేని విధంగా, కొంత‌కాలంగా ఎందుకు దుర్ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. క‌లియుగ దైవం ఆగ్ర‌హానికి గురి అవుతున్నామ‌నే భ‌యాందోళ‌న వెంటాడుతోంది.

9 Replies to “టీటీడీ భ‌క్తుల మ‌న‌సుల్లో మంట‌లు”

  1. ఎండాకాలం వేడికి కార్ కాలిపోయింది అంటూనే ….టీటీడీ వ్యవహారాలకు లింక్ చెయ్యడం అంటే నీకు మెదడు మోకాలు లో కూడా లేదని అర్థం

  2. కన్ఫామ్ రా, ఇలానే కథలు మింగితే వచ్చేసారి అన్నకి కబడ్డీ టీం కూడా మిగలదు….

  3. ఇలా భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రాసెస్ లో దేవుడు శాడిస్ట్ కాదు అన్న బేసిక్ సంగతి విస్మరిస్తున్నారు..ఒకవేళ నిజం గ తప్పు జరిగి ఉంటె దాన్ని చేసిన వాళ్ళని శిక్షించాలి కానీ వేరే వాళ్ళ మీద కోపం చూపిస్తాడా దేవుడు

    1. What happens when the mistake is done by representatives of a government and the TTD board to promote their political beliefs above the belief in God?

  4. తిరుపతి ప్రసాదం ఇస్తే, మా లెవనన్న, అవి వదినలు తినకుండా డస్ట్ బిన్ లో పడేసారంట అందుకే తిరుమలలో వరుసగా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయ్ 

Comments are closed.