రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి సహృద్భావ వాతావరణంలో ఒక సమావేశం జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ సమావేశం ఏం సాధించింది అనే విషయంలో ఇంకా అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
మూడించలలో సమస్యల పరిష్కారానికి కసరత్తు జరుగుతుందని ప్రస్తుతం అంటున్నారు. చీఫ్ సెక్రటరీ సారధ్యంలోని అధికారుల బృందాలు తొలత చర్చిస్తాయని, స్థాయిలో కొలిక్కిరాని అంశాలు ఉంటే మంత్రులు కమిటీలు భేటీ అయి చర్చిస్తాయని, అప్పటికి సమస్యలు పెండింగ్‌లో ఉంటే గనుక ముఖ్యమంత్రిల స్థాయికి వెళతాయని ప్రస్తుతానికి అంటున్నారు.
అదే సమయంలో కొన్ని విషయాలలో ఇప్పటికే పూర్తి స్పష్టత వచ్చేసింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన సమర్ధత , కార్యకుశలత చూపించు కోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. సమస్య తెరమీదకి వచ్చినప్పుడు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే విషయంలో కనీసం రేవంత్ రెడ్డి స్థాయి స్పష్టతతో చంద్రబాబు నాయుడు వ్యవహరించగలరా అనేది అనుమానంగా ఉంది.
ఉదాహరణకు హైదరాబాదులో ఉన్న భవనాలను కొన్నింటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని చంద్రబాబు ఒక డిమాండ్ ను చర్చలలో పెట్టారు. దీనిని నిర్మొహమాటంగా నిరుద్యోగంగా తోసిపుచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఉన్న ఆస్తులు మొత్తం తెలంగాణకు మాత్రమే చెందుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో మళ్లీ మళ్లీ చర్చలుకు అవకాశం లేకుండా మొదటి సమావేశంలోనే తేల్చేశారు. అదే సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ప్రతిపాదన వారు తెరమీదకి తెచ్చారు. దీనికి కేంద్రం అనుమతి కావాలంటూ డొంక తిరుగుడు సమాధానం వచ్చింది ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చెందిన మండలాలను తిరిగి ఇచ్చేది లేదని అంతే స్పష్టంగా చెప్పడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. కేంద్రం మీదికి నెట్ చేయడం వలన ఆ మండలాలను తిరిగి తమకు ఇవ్వాలంటూ తెలంగాణ కేంద్ర హోమ్ శాఖ ఉత్తరం రాసే పనిలో పడింది. కేంద్రం చెబితే ఆ మండలాలను ఏపీ తిరిగి ఇచ్చేస్తుందా? అలా జరిగితే కనుక అవి ముంపు మండలాలు అయ్యే ప్రమాదం వలన పోలవరం యూత్ తగ్గించాల్సిన దుస్థితి వస్తే చంద్రబాబు నాయుడు అందుకు బాధ్యత వహిస్తారా? అనేది ఇప్పుడు కీలకమైన చర్చనీయాంశాలుగా ఉన్నాయి.
నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల విషయంలో అంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉండగా.. 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవం 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా డొంకతిరుగుడు సమాధానాలు చెప్తూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్నారని ఆలోచన ప్రజలలో కలుగుతుంది. చంద్రబాబు కూడా అంతే స్పష్టంగా విలీన మండలాలను తిరిగి ఇవ్వబోం అని చెబితే తప్ప పోలవరం ప్రాజెక్టు న్యాయం జరగదనే వాదన ప్రజలలో వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చూడాలి.