డార్లింగ్.. మరీ అపరిచితురాలు

నభా నటేష్- ప్రియదర్శి కీలకపాత్రల్లో నటించిన సినిమా డార్లింగ్. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ఇది. అశ్విన్ రామ్ దర్శకుడు. 19న థియేటర్ లకి వచ్చే…

నభా నటేష్- ప్రియదర్శి కీలకపాత్రల్లో నటించిన సినిమా డార్లింగ్. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ఇది. అశ్విన్ రామ్ దర్శకుడు. 19న థియేటర్ లకి వచ్చే ఈ సినిమా ట్రయిలర్ ను ఆన్ లైన్ లో విడుదల చేసారు. అవుట్ అండ్ ఫన్ యాంగిల్ లో కట్ చేసారు ట్రయిలర్ ను. కానీ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్ ఏదో వుండే వుంటుంది. దాన్ని ట్రయిలర్ లో దాచినట్లు కనిపిస్తోంది.

పెళ్లి చేసుకున్న వెంటనే పారిస్ వెళ్లాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న అబ్బాయి.. తీరా పెళ్లి చేసుకున్న తరువాత వచ్చిన అమ్మాయికి స్ప్లిట్ పర్సనాలిటీ వుంటే.. ఇంక చెప్పాలా.. ఆ ఫన్. అదే చూపించారు ట్రయిలర్ లో. కానీ నిజంగా స్ల్పిట్ పర్సనాలిటీ వుందా? ఇంకేమైనా సమ్ థింగ్ దాచారా అన్నది ట్రయిలర్ చూసిన వాళ్లకు వచ్చే అనుమానం.

ఆ సందేహం తీర్చుకోవడం కోసం అయినా థియేటర్ కు రావాల్సిందే కదా అన్నది దర్శకుడి పాయింట్ అయివుంటుంది. అల్లరి నరేష్ కు సెట్ అయ్యే పాత్ర. కానీ అల్లరి నరేష్ చేసి వుంటే రొటీన్ అవుతుంది. ప్రియదర్శి చేసాడు కనుక కొత్తగా వుంది.

నభా కొన్ని కొన్ని కట్స్ లో బాగా చేసింది. టోటల్ గా ఫాస్ట్ ఫన్ రైడ్ గా కట్ చేసారు ట్రయిలర్ ను. అందువల్ల సినిమా చూసి నపుడు కాస్త సటిల్డ్ గా వుండే అవకాశం వుంటుంది కనుక, ఇంకా బాగా ఎంజాయ్ చేయచ్చు.