పార్టీ మారినా బాలినేనికి సుఖం లేదు!

బాలినేనిపై వైసీపీ ముప్పేట దాడి చేస్తోంది. మ‌రోవైపు బాలినేనికి జ‌న‌సేన నుంచి స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు.

అదేదో చెడినా సుఖ‌మైనా వుండాల‌నేది పెద్ద‌ల మాట‌. మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి గురించి మాట్లాడేవాళ్లంతా ఇప్పుడీ సామెత‌ను గుర్తు చేస్తున్నారు. వైసీపీలో అప‌రిమిత‌మైన అధికారాన్ని అనుభ‌వించిన బాలినేనికి ఆ పార్టీ అధికారం కోల్పోగానే జ‌గ‌న్ అంటే నచ్చ‌లేదు. ఎందుకో ఆయ‌న‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో మ‌హానుభావుడు క‌నిపించారు. వైసీపీ కండువా ప‌క్క‌న ప‌డేసి, జ‌న‌సేన కండువా క‌ప్పుకున్నారు.

రెండు రోజుల క్రితం జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో బాలినేని ప్ర‌సంగిస్తూ, జ‌గ‌న్‌పై విషం చిమ్మారు. వైసీపీలో బాలినేని లాంటి మంచి వాళ్లు కూడా ఉన్నార‌ని ప‌వ‌న్ అన్న‌ప్పుడే, తాను జ‌న‌సేన‌లో చేర‌కుండా త‌ప్పు చేశాన‌ని వాపోయారు. త‌న ఆస్తుల్ని జ‌గ‌న్ లాక్కున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. చివ‌రికి బాలినేని ఎక్క‌డికి దిగ‌జారారంటే, సినిమా తీయ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అవ‌కాశం ఇస్తే చాల‌ని కోరుకున్నారు.

బాలినేని విమ‌ర్శ‌ల‌పై వైసీపీ నేత‌లు సీరియ‌స్‌గా స్పందిస్తున్నారు. పేకాట‌, ఇత‌ర‌త్రా దుర‌ల‌వాట్ల‌తో ఆస్తుల్ని పోగొట్టుకుని త‌మ‌పై ప‌డి ఏడుస్తావా? అని బాలినేనిపై వైసీపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. పేకాట ఆడ‌డానికి ర‌ష్యా వెళ్లలేదా? అని నిల‌దీస్తున్నారు. ప్ర‌కాశం జిల్లాలో బాలినేని బ‌తుకు అంద‌రికీ తెలుసంటూ ద‌ర్శి ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. న‌ట‌న‌లో క‌మ‌ల్‌హాస‌న్‌తో బాలినేనిని పోల్చ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌తి ఒక్క‌ర్నీ వేధించి, వాళ్ల నుంచి దోచుకున్నావ‌ని ఆయ‌న ఆరోపించారు. బాలినేని బాధితులు కాని వాళ్లు ప్ర‌కాశం జిల్లాలో లేర‌న్నారు. బాలినేని పార్టీ మారిన త‌ర్వాత‌, వైసీపీ శ్రేణులు సంతోషంగా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆస్తుల్ని కాపాడుకునేందుకే జ‌న‌సేన‌లో చేరావ‌న్నారు. టీడీపీలో చేరాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ, ఆ పార్టీ తిర‌స్క‌రించింద‌ని ఆయ‌న అన్నారు. బాలినేనిపై వైసీపీ ముప్పేట దాడి చేస్తోంది. మ‌రోవైపు బాలినేనికి జ‌న‌సేన నుంచి స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. దీంతో ఆయ‌న ఎటూ కాకుండా పోయార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

10 Replies to “పార్టీ మారినా బాలినేనికి సుఖం లేదు!”

  1. ప్రపంచం లొ జగన్ కి తప్పితె ఎవ్వరికి సుఖం లెదు అన్ని మనల్ని నమ్మించటానికి తెగ కష్టపడుతున్నాడు GA!

    .

    ఇంటా బయటా సుఖం లెనిది మన జగన్ కె !

  2. ///ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌తి ఒక్క‌ర్నీ వేధించి, వాళ్ల నుంచి దోచుకున్నావ‌ని ఆయ‌న ఆరోపించారు. బాలినేని బాధితులు కాని వాళ్లు ప్ర‌కాశం జిల్లాలో లేర‌న్నారు///

    .

    మరి అదె నిజం అయితె….. Y.-.C.-.P లొ (2024 లొ) మళ్ళి MLA టిక్కెట్ ఎందుకు ఇచ్చారు రా అయ్యా!

  3. అదేమిటో …వైకాపా నుండి బయటకు రాగానే వివేకా రెండో భార్య గుర్తుకువస్తుంది, బాలినేని పేకాట గుర్తుకువస్తుంది….

Comments are closed.