నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్దు!

సీఎం చంద్ర‌బాబునాయుడు ముఖ్యంగా నాగ‌బాబు విష‌యంలో మొహ‌మాటానికి పోతే, అస‌లుకే ఎస‌రు పెడ్తార‌ని హెచ్చ‌రిస్తున్నారు.

త్వ‌ర‌లో ఎమ్మెల్సీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబుకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్ద‌నే డిమాండ్లు టీడీపీ నుంచి వెల్లువెత్తుతున్నాయి. నాగ‌బాబు తీరుపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వ‌ర్మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌కుండా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌, ఆయ‌న అన్న నాగ‌బాబు అడ్డుకున్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.

ఈ ప్ర‌చారానికి బ‌లం క‌లిగించేలా పిఠాపురంలో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో నాగ‌బాబు ప్ర‌సంగం వుంది. పిఠాపురంలో ప‌వ‌న్ గెలుపు వెనుక జ‌న‌సేన మిన‌హాయిస్తే, మ‌రెవ‌రో ఉన్నార‌నే ప్ర‌చారాన్ని నాగ‌బాబు నిర్మొహ‌మాటంగా ఖండించారు. ప‌వ‌న్ విజ‌యం వెనుక తాము ఉన్నామ‌ని ఎవ‌రైనా అనుకుంటే, అది వాళ్ల ఖ‌ర్మ అని వ‌ర్మ‌ను ఉద్దేశించి ప‌రుషంగా మాట్లాడార‌ని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో టీడీపీని కించ‌ప‌రిచేలా మాట్లాడిన నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఎందుకు ఇవ్వాల‌నే ప్ర‌శ్న ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి వ‌స్తోంది. నాగ‌బాబు న‌వ్వుతూనే, మిత్ర‌ప‌క్షమైన టీడీపీకి చుర‌క‌లు అంటిస్తుండ‌డాన్ని కార్య‌క‌ర్త‌లు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి వ్య‌క్తికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం అంటే, కూట‌మి పాలిట భ‌స్మాసుర హ‌స్తమే అని టీడీపీ కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

సీఎం చంద్ర‌బాబునాయుడు ముఖ్యంగా నాగ‌బాబు విష‌యంలో మొహ‌మాటానికి పోతే, అస‌లుకే ఎస‌రు పెడ్తార‌ని హెచ్చ‌రిస్తున్నారు. నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం అంటే, పాముకు పాలుపోసి పెంచిన‌ట్టే అని చంద్ర‌బాబు గ్ర‌హించాల‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

23 Replies to “నాగ‌బాబుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వొద్దు!”

    1. స్వయానా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చెప్పిన స్టేట్మెంట్.. తమరికి ఈ విషయం ఆవిధంగా రీచ్ అవ్వలేదో ఆశ్చర్యం కలిగించే ల ఉంది..

      1. విషయం తెలిసిన గానీ చంద్రబాబు షరా మామూలు గా మోసం చేస్తాడని, నాగబాబు కి మంత్రి పదవి ఇవ్వరని mrrational ఉద్దేశం కావచ్చు

  1. TDP has better candidates for ministerships than PK and Naga babu….

    CBN should not give ministry to him… …

    even if he gets ministry… better some TDP leader or minister should take the responsibility of Naga babu

  2. వర్మ రెండు తప్పిదాలు చేసాడు…

    మొదటిది లోకేష్ ని ముఖ్యమంత్రి చేయాలి అనే డిమాండ్

    రెండోది పవన్ మీద చేసిన ట్వీట్..

    వర్మ మంచి వ్యక్తి అనడం లో ఎటువంటి సందేహం లేదు… కానీ వర్మ కి బాబు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టీడీపీ దే ఇందులో జనసేన కి సంబంధం లేదు… ఒకవేళ పిఠాపురం కాకపోతే బాబు ముందే అలోచించి వర్మ కి చెప్పివుండాలి..

    దీని గురించి నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు..

    పవన్ కి బాబు మీద గౌరవం వుంది… అలాగని పార్టీ విషయాల్లో జోక్యం ఉండదు కదా

  3. ఈ నీచుడికి కూడా రోజా లాగ కంపు నోరు , రోజా కనీసం ఎమ్మెల్యే గా గెలిసి నోరు పారేసుకుంది వీడు అందుకు కూడా పనికిరాడు

    1. ఏమి అన్నాడుఅని అంత ఏడుస్తున్నారు. ? వర్మ antagaa nachithe , వర్మ మీ పార్టీ లోకి వస్తే వైసీపీ లోకి చేర్చుకోండి..

        1. how so ?

          nuvvu pedda vadavvi kabatti neeku ala ardhamayindi.

          nagababu maataki AP sanka naakipovadaniki karanam yela avutaduraa vedava..

          jaglak gaadu AP ni brastupattinchadu mari notlo yemi vesukoni comment chestunnav ? jaglak gaadi malamaa leka paytm ?

  4. Every Leader should remember that without T.D.P. other parties have no recognition and able to get some seats, otherwise nil. T.D.P. is having its own cader and strength in Telugu States, is no doubt and can stand alone with their leader who is avisionery and can co-ordinate all parties in time and if necessary. Any tie-up with Centre or political party is nothing but for the welfare and development of the State.

Comments are closed.