బాబు కూడా హ్యాండ్ ఇచ్చారా?

ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా గవరలు ఉన్నారు. వీరి ప్రభావం విశాఖ పశ్చిమ, పెందుర్తి, అనకాపల్లి, మాడుగుల, ఎలమంచిలి, చోడవరం వంటి చోట్ల గణనీయంగా ఉంటుంది.  ఈ నియోజకవర్గాలలో గెలుపు ఓటములను…

ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా గవరలు ఉన్నారు. వీరి ప్రభావం విశాఖ పశ్చిమ, పెందుర్తి, అనకాపల్లి, మాడుగుల, ఎలమంచిలి, చోడవరం వంటి చోట్ల గణనీయంగా ఉంటుంది.  ఈ నియోజకవర్గాలలో గెలుపు ఓటములను వీరు ప్రభావితం చేస్తూ వస్తున్నారు.

పార్టీలు ఏవైనా ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2009 తరువాత అది మెల్లగా తప్పిపోతూ  వస్తోంది. గవరలకు చిరకాలం ప్రతినిధులుగా ఉన్న మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావుల రాజకీయం ఈ సమయంలో డోలాయమానంలో పడడంతో గవరలకు మంత్రి పదవులు దక్కకుండా పోయాయి.

వైసీపీ టీడీపీల మధ్య ఈ మాజీ మంత్రులు తిరిగినా రాజకీయ లాభం దక్కకుండా పోయింది. అయితే 2014లో గవర సామాజిక వర్గానికి చెందిన గణబాబు గెలిచినా మంత్రి పదవి ఊరించి బాబు ఇవ్వలేదు అని ప్రచారంలో ఉంది. 2019లో టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది.

వైసీపీ అధికారంలోకి వచ్చినా కాపులకు, వెలమలకు ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో గవరలు కోపం పెంచుకుని 2024లో ఓడించారు. టీడీపీ కూటమికి ఫుల్ సపోర్ట్ చేశారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు జనసేన టికెట్ ఇచ్చింది.

ఈసారి గవరల నుంచి మంత్రి పదవి ఖాయమని అంతా నమ్మి ఉన్నారు. అయితే చంద్రబాబు ఏర్చి కూర్చిన మంత్రివర్గంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి దక్కింది. దాంతో గవరలకు చాన్స్ లేకుండా పోయింది.

అలా పదిహేనేళ్ళుగా ఊరిస్తున్న మంత్రి పదవీ యోగం లేకుండా పోతోందని మధనపడుతున్నారు. చంద్రబాబు విస్తరణలో ఏమైనా చాన్స్ ఉంటుందేమో అని చూడాల్సిన పరిస్థితి ఉంది. దాని కోసమైనా మరో రెండున్నరేళ్లు  దాకా ఓపిక పట్టాల్సిందే అని అంటున్నారు.