ఒక్కొక్క‌రుగా రోడ్డెక్కుతున్నారు!

కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ మిన‌హాయిస్తే, మిగిలిన సంఘాల‌కు చెందిన వాళ్లు ఒక్కొక్క‌రుగా రోడ్డెక్కుతున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ మిన‌హాయిస్తే, మిగిలిన సంఘాల‌కు చెందిన వాళ్లు ఒక్కొక్క‌రుగా రోడ్డెక్కుతున్నారు. 108 అంబులెన్స్ ఉద్యోగులు, అంగ‌న్‌వాడీ ఉద్యోగులు, అలాగే వాలంటీర్లు…ఇలా కీల‌క‌మైన వాళ్లంతా ఆందోళ‌న బాట ప‌ట్ట‌డం ప్ర‌భుత్వానికి మంచిది కాదు. మ‌రీ ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి కేవ‌లం ఆరు నెల‌లైంది.

ఇంత త‌క్కువ స‌మయంలో కూట‌మికి వ్య‌తిరేకంగా నిర‌స‌న స్వ‌రాలు వినిపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అంగ‌న్‌వాడీల‌కు జీతాల పెంపు, అలాగే ఉద్యోగులు మృతి చెందితే మ‌ట్టి ఖ‌ర్చులకు డ‌బ్బు ఇస్తామ‌ని హామీ, మినీ అంగ‌న్‌వాడీ కేంద్రాల‌ను అప్‌గ్రేడ్ చేయాల‌నే డిమాండ్ల‌తో వాళ్లంతా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధ‌ర్నాలు చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో అంగ‌న్‌వాడీ ఉద్యోగుల‌కు జీతాలు పెంచారు. అయిన‌ప్ప‌టికీ త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ వైసీపీ పాల‌న చివ‌రి రోజుల్లో 43 రోజుల పాటు ఉద్య‌మించి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను సృష్టించ‌డంలో విజ‌యం సాధించారు.

కానీ ఇప్పుడు ఆరు నెల‌ల‌కే అంగ‌న్‌వాడీ ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. అలాగే వాలంటీర్లు త‌మ కడుపు కొట్టొద్దంటూ రోజుకో జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 ల‌క్ష‌ల మంది వాలంటీర్లు ఉన్నారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో రూ.10 వేల వేతనం ఇస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. గౌర‌వ వేత‌నం పెంపు దేవుడెరుగు, ఉద్యోగాలు ఇవ్వండి అంటూ మొర‌పెట్టుకుంటున్నారు.

మ‌రోవైపు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అస‌లు మీరు ప్ర‌భుత్వ జీవోల్లోనే లేరు, ఇక ర‌ద్దు చేయ‌డం అనే ప్ర‌శ్నే ఉద‌యించ‌ద‌ని తేల్చి చెప్పారు. దీంతో వాలంటీర్లు రోడ్డున ప‌డ్డారు. 108 ఉద్యోగుల ప‌రిస్థితి కూడా అంతే. ఇంకా ప్ర‌భుత్వ ఉద్యోగులు ప్ర‌స్తుతానికి డిమాండ్ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యారు. ఆందోళ‌న బాట ప‌ట్ట‌లేదు. రానున్న రోజుల్లో వీళ్లు కూడా రోడ్డు మీదికి వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌.

ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే తాప‌త్ర‌యంతో కూట‌మి నేత‌లు అలివికాని హామీలు ఇచ్చారు. వాటిని నెర‌వేర్చ‌డానికి ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బు లేదు. అందుకే సూప‌ర్‌సిక్స్ హామీకి అతీగ‌తీ లేదు. ఏవో ఒక‌ట్రెండు ప‌థ‌కాలు మిన‌హాయిస్తే, ప్ర‌ధాన ప‌థ‌కాలేవీ అమ‌లుకు నోచుకోలేవు. ఇవ‌న్నీ చంద్ర‌బాబు స‌ర్కార్ మెడ‌కు గుదిబండ‌గా మార‌నున్నాయి. ప్ర‌భుత్వం కొలువుదీరి ఆరు నెల‌లే కావ‌డంతో మ‌రికొంత స‌మ‌యం ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తో ప్ర‌తిప‌క్ష పార్టీ, అలాగే ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప్ర‌జా సంఘాలు వేచి చూసే ధోర‌ణిలో ఉన్నాయి. అలాగ‌ని రానున్న రోజుల్లో మౌనంగా వుంటాయ‌ని అనుకుంటే పొర‌పాటే.

42 Replies to “ఒక్కొక్క‌రుగా రోడ్డెక్కుతున్నారు!”

    1. వాలింటర్ అనేది ఉద్యోగం కాదు అని జగనే స్వయంగా సెలవు ఇచ్చాడు.. ఎన్నికల ముందే దాదాపు లక్ష మంది వాలింటర్ లు ఆ బాధ్యత ల నుండి స్వచ్ఛందంగా వైదొలిగి వైసీపీ కి ప్రచారం చేశారు.. ఇంకా వాలింటర్ ఉద్యోగం అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది.

    2. Voluntary system was introduced for the implementation of previous government schemes. Jagan himself gave a statement that it was not a job.. Before the election, about one lakh volunteers voluntarily resigned from those responsibilities and campaigned for YCP.. And where does the question of volunteer job arise.

  1. గృహప్రవేశం అయ్యాక దిష్టి తగులుతుందని ఇంటికి గుమ్మడికాయ కడతారు..ఇవీ అంతే just దిష్టి చుక్కలు..వీళ్ళను నమ్ముకుని గొంతు చించుకుంటే..ఆ తర్వాత నోరు పెగలేదు…

  2. జగన్ రెడ్డి లాగా కేసులు వేస్తారనే భయం లేదు.. తమ హక్కులను నినదిస్తున్నారు.. నిరసిస్తున్నారు.. ధైర్యం గా మాట్లాడగలుగుతున్నారు.. పోరాడగలుగుతున్నారు..

    దీన్నే.. “స్వేచ్ఛ” అంటారు.. దీన్నే.. “హక్కు” అంటారు..

    ఓటు వేసిన వాళ్ళు ఇంతకన్నా ఆశించేది ఉండదు..

    ప్రభుత్వాన్ని శాసించేది ప్రజల మాట.. ఆ మాటను నొక్కేసి.. అంతా అద్భుతం.. నువ్వే మా నమ్మకం అని కోట్లు పోసి యాడ్లు ఇచ్చుకుంటే.. 11 కి పడిపోతారు..

    ఆ తర్వాత బెంగుళూరు లో సేద తీరుతూ.. వారానికొకసారి చుట్టపు చూపుగా వచ్చిపోవడమే..

    జనాలు మర్చిపోయినా.. జనం గుండెల్లో బతుకుతున్నాము అని సాక్షి లో, గ్రేట్ ఆంధ్ర లో రాసుకోవడమే మిగులుతుంది ..

      1. చంద్రబాబు హయాం లో ఎవ్వడూ భయపడలేదు.. వాళ్ళ వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు..

        కాపు రిజర్వేషన్ కోసం రైళ్లు తగలబెట్టిన వ్యక్తులు మీ జగన్ రెడ్డి పార్టీ లోనే ఉన్నారు.. ఇప్పుడు కులం కూడా మార్చేసుకొనేటంతటి స్వామి భక్తి చూపించుకొంటున్నారు..

        చంద్రబాబు ప్రభుత్వం లో స్వేచ్ఛ ఉంటుంది.. జగన్ రెడ్డి ప్రభుత్వం లో బానిసత్వం ఉంటుంది..

        టీడీపీ కి 23 సీట్లు రావడానికి జగన్ రెడ్డి ని గుడ్డిగా నమ్మడమే.. ఆ నమ్మకం మోసం గా మారినప్పుడు వచ్చే కోపమే 11 సీట్లు..

        1. ayyo evariki teliyani vishayalu meku matramee telustyaii….. a freedom entho chutham….AP Future every tuesday…so sad….. honey moon is over….lol

          1. పార్టీ ఆఫీస్ కి తాళాలు వేసుకుని .. పెళ్లిళ్లకు రెంట్ కి ఇచ్చుకొంటున్న మీ పార్టీ వాళ్ళే చెప్పాలి.. ఆంధ్ర ఫ్యూచర్ గురించి.. LOL//

          2. హైదరాబాద్ లో కూడా వైసీపీ మూసేసుకొన్నారా.. ఓహో..

            రెండు స్టేట్స్ లో సంక నాకిపోయారు.. అని బోర్డు పెట్టేసుకోండి..

            చెప్పుకొవడమే ఎందుకులే.. జనాలకు తెలుసు.. మీ బతుకు..

          1. అందుకేగా 11 కి పండబెట్టేసారు..

            ఇప్పుడు మీ మేనిఫెస్టో గుర్తుకు కూడా రాదు.. అంతగా బుర్ర పగలదెంగారు.. గులకరాయితో..

          1. లెక్కలు తీసుకెళ్లి కోర్ట్ లో సబ్మిట్ చేసుకుని కేసులు వేసుకోండి..

      1. ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షమే అనేదే లేకుండా చేసేస్తే వైరాగ్యమే ఉంటుంది..

        ప్రజలు ప్రతిపక్షాన్ని చంపేసి.. 11 ముష్టి మొఖా్న కొట్టారు..

  3. గత ప్రభుత్వ పథకాలు అమలు కోసం వలింటరీ వ్యవస్థ ను తెచ్చారు. అది ఉద్యోగం కాదు అని జగనే స్వయంగా సెలవు ఇచ్చాడు.. ఎన్నికల ముందే దాదాపు లక్ష మంది వాలింటర్ లు ఆ బాధ్యత ల నుండి స్వచ్ఛందంగా వైదొలిగి వైసీపీ కి ప్రచారం చేశారు.. ఇంకా వాలింటర్ ఉద్యోగం అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది.

  4. గత ప్రభుత్వ పథకాలు అమలు కోసం వలింటరీ వ్యవస్థ ను తెచ్చారు. అది ఉద్యోగం కాదు అని జ గ నే స్వయంగా సెలవు ఇచ్చాడు.. ఎన్నికల ముందే దాదాపు లక్ష మంది వాలింటర్ లు ఆ బాధ్యత ల నుండి స్వచ్ఛందంగా వైదొలిగి వై సీపీ కి ప్రచారం చేశారు.. ఇంకా వాలింటర్ ఉద్యోగం అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది.

  5. ఇవన్నీ నీచుడు జగన్ రెడ్డి పెట్టిన బకాయలు అప్పులు చేసి దోచుకుని చక్కగా బెంగళూరు పాలస్ లో రేవ్ పార్టీ లలో మునిగి తేలుతున్నాడు

    1. Previous govt 5 years lo chesina appulani present government 2.5 years lo break chesthundi. wait and see.. Previous govt amaravathi joliki poledu….. Present government amaravathi kosam chala appulu cheyalsi vasthundi….Idi fact.. amaravathi kosam andhra prajalu chala thyagalau cheyavalisi vasthundi…. manchido kaado 5 years tharvatha thelusthundi.

      1. అయితే అంతవరకు రెస్ట్ తీసుకోండి..

        ఇప్పటినుండే చిలక జోస్యాలు చెప్పుకుంటూ.. ఆ చిలక నెందుకు హింసిస్తున్నారు..

  6. Voluntary system was introduced for the implementation of previous government schemes. Jagan himself gave a leave saying that it was not a job.. Before the election, about one lakh volunteers voluntarily resigned from those responsibilities and campaigned for YCP.. And where does the question of volunteer job arise.

  7. అవసరం లేని వాలంటీర్ లు అవి జాబ్స్ నా, ఫేక్ సర్టిఫికెట్ ల తొ జాబ్స్ యిచ్చారు, చదువు లేని వారికి సంబంధిత క్వాలిఫికేషన్ లేని వారికి ఇవ్వమని ఇవ్వొ చ్చ

  8. Oka lakshaa 30 Vela kotla బకాయిలు పెట్టేసి దిగి పోయారు. సిగ్గు సరం బాధ్యత లేకుండా ఇప్పుడు ఇవన్నీ ఎవడు తీర్సుతాడు

  9. ఎంత త్వరగా అమరావతి, పోలవరం పూర్తవుతాయి

    ఎన్ని సంస్థలు ఏపీ కి వస్తాయి

    మన రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి

    భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తవుతుంది

    మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి

    అని బాధ పడు. తప్పు లేదు. అంతేగానీ

    వోట్ బ్యాంకు ముష్టి ఎప్పుడు వేస్తారు

    వోట్ బ్యాంకు సైన్యం ఎలా

    అప్పనంగా పప్పలు ఎలా

    అని బాధ పడకు

    1. పోలవరం, అమరావతి, .. మరో కామెడీ.

      ఇంతకుముందు ఎంత నాశనం చెయ్యాలో చేసి.. ఇప్పుడు మళ్ళీ వాటి గురించి..

      జీవితాంతం వాటి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడమే పని అనుకుంటా..

      అంతే మరి.. అవి పూర్తి చేస్తే.. మళ్ళీ ఇంకో కొత్తది కావాలి

      అవి పూర్తి చెయ్యకండి ఉంటె వాటితోటె గడిపేయొచ్చు.

  10. ఎంత అన్యాయం.. ?

    కర్ణాటక గవర్నమెంట్ కి 500 పీజీ మెడికల్ సీట్స్ ని allocate చేసింది సెంట్రల్ గవర్నమెంట్

    ఆంధ్ర లో allot చేసిన 50 మెడికల్ సీట్స్ ని కూడా మాకు వద్దు అని ఆ మెడికల్ కాలేజీ ఓపెనింగ్ ని ఆపేసారు..

    ఇప్పుడు దాంతో పాటు మిగతా మెడికల్ colleges కలిపి ప్రైవేట్ కి అప్పచెప్పే పని లో ఉన్నారు.. టీడీపీ గవర్నమెంట్

    ఎంతన్యాయం.. .? ఎంత ఘోరం.. ? ఎవరిది గొప్ప అడ్మినిస్ట్రేషన్.. ?

  11. అధికారంలోకి వచ్చి ఇంకా ఆరు నెలలు అవ్వలేదు..

    అప్పుడే.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాశనం

    4 మెడికల్ కాలేజీలు నాశనం

    cbse సిలబస్ నాశనం,

    స్కూల్స్ నాశనం

    రోడ్స్ మీద టోల్ పేరుతో మరో నాశనం

    హాస్పిటల్స్ నాశనం

    108 , 104 లు నాశనం

    పోలవరం నాశనం

    కర్నూల్ న్యాయ రాజధాని నాశనం

    వైజాగ్ రాజధాని నాశనం

    అమ్మఒడి నాశనం, అంగన్వాడీ నాశనం

    అంతా నాశనం..

  12. Y*sr మర*ణ ము కి కార*ణం ఎవరో అ*ప్పట్లో బొ*త్స సత్యనా*రాయణ. వెలువ*రించిన అను*మానం మీ*ద సిబి*ఐ విచా*రణ మొదలు పెట్టాలి.

Comments are closed.