బాబుపై సీమ‌లో పెరుగుతున్న అసంతృప్తి

రాయ‌ల‌సీమ‌లో స‌హ‌జంగానే టీడీపీ బ‌ల‌హీనంగా వుంటుంది. అలాంటిది గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పాల‌న పుణ్యమా అని టీడీపీ గాలి బ‌లంగా వీచింది. వైసీపీకి ప‌ట్టున్న సీమ‌లో కూడా టీడీపీ తిరుగులేని ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించింది. ఆద‌రించిన…

రాయ‌ల‌సీమ‌లో స‌హ‌జంగానే టీడీపీ బ‌ల‌హీనంగా వుంటుంది. అలాంటిది గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ పాల‌న పుణ్యమా అని టీడీపీ గాలి బ‌లంగా వీచింది. వైసీపీకి ప‌ట్టున్న సీమ‌లో కూడా టీడీపీ తిరుగులేని ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించింది. ఆద‌రించిన సీమ ప్ర‌జానీకం రుణం తీర్చుకోడానికి బ‌దులు, కూట‌మి స‌ర్కార్ చేస్తున్న‌దేంటి? అనే ప్ర‌శ్న‌కు… ద్రోహం చేస్తోంద‌న్న స‌మాధానం అక్క‌డి స‌మాజం నుంచి వ‌స్తోంది.

రాయ‌ల‌సీమ‌ను కూడా స‌మానంగా చూడాల్సిన కూట‌మి స‌ర్కార్‌, ఆ ప‌ని చేయ‌డం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాయ‌ల‌సీమ‌లో కొత్త‌గా ఏవైనా ఏర్పాటు చేయ‌డానికి బ‌దులు, ఉన్న వాటిని కూడా అమ‌రావ‌తికి తీసుకెళుతుండ‌డంపై సీమ స‌మాజం మౌనంగా గ‌మ‌నిస్తోంది. సీమ స‌మాజం లోలోప‌ల కుత‌కుత‌లాడుతోంది. త‌మ‌కు ఇంత ద్రోహం చేస్తారా? అని సీమ స‌మాజం ఆగ్ర‌హంతో ఉంది.

వైఎస్సార్ జిల్లా కొప్ప‌ర్తి మెగా ఇండ‌స్ట్రీయిల్ హ‌బ్‌లో 19.5 ఎక‌రాల్లో రూ.250 కోట్ల‌తో ఎంఎస్ఎంఈ టెక్నాల‌జీ కేంద్రాన్ని వైసీపీ హ‌యాంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. అయితే కూట‌మి స‌ర్కార్ గ‌త సెప్టెంబ‌ర్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించేందుకు ఉత్త‌ర్వులు ఇచ్చి సీమ‌పై మొద‌టి దెబ్బ వేసింది.

తాజాగా కర్నూలు కేంద్రంగా ప‌ని చేస్తున్న లోకాయుక్త‌, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కార్యాల‌యాల‌ను అమ‌రావ‌తి త‌ర‌లింపున‌కు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. చ‌ట్ట స‌వ‌ర‌ణ‌తో కార్యాల‌యాల‌ను త‌ర‌లిస్తామ‌ని ఏపీ హైకోర్టుకు చంద్ర‌బాబు స‌ర్కార్ తెలిపింది. అలాగే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి (ఏపీ ఈఆర్సీ), వ‌క్ఫ్ ట్రిబ్యున‌ల్‌, సీబీఐ కోర్టును క‌ర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీఈఆర్సీకి క‌ర్నూలులో శాశ్వ‌త భ‌వ‌నాలు కూడా నిర్మించారు. అయిన‌ప్ప‌టికీ ఈ కార్యాల‌యాల‌న్నీ అమ‌రావ‌తికి త‌ర‌లించేందుకు కూట‌మి స‌ర్కార్ స‌మాయ‌త్తం అవుతోంద‌న్న వార్త‌ల‌తో సీమ స‌మాజం ఆవేద‌న చెందుతోంది.

ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు త‌మ‌కు అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్ట‌డంతో ఏం చేసినా అడ్డు లేద‌నే భావ‌న ఈ ప్ర‌భుత్వంలో ఉందేమో అనే అనుమానం క‌లుగుతోంది. కానీ చంద్ర‌బాబు స‌ర్కార్ రాయ‌ల‌సీమ‌కు కొత్త‌గా ఏమీ చేయ‌క‌పోగా, ఉన్న‌వన్నీ తీసుకెళ్లిపోతోంద‌న్న ఆగ్ర‌హం, ఆవేద‌న అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌సిగ‌ట్టి, సీమ‌కు న్యాయం చేయ‌డం ప‌క్క‌న పెట్టి, క‌నీసం అన్యాయం చేయ‌కుండా వుండాల‌ని ఆ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు.

17 Replies to “బాబుపై సీమ‌లో పెరుగుతున్న అసంతృప్తి”

  1. నాలుగు నెలల్లో.. అసంతృప్తి అంటూ 40 ఆర్టికల్స్ వదిలారు..

    రాజకీయాల్లో సహనం ఉండాలి.. సమయం కోసం ఎదురు చూడాలి.. పూర్తిగా సన్నద్ధం అవ్వాలి.. చాప కిందా నీరులా ప్రతిపక్షం ఎదగాలి..

    మన జగన్ రెడ్డి కి.. ఆడి సంకలు నాకే నీకు.. ఓపిక లేదు .. అర్జెంటు గా జగన్ రెడ్డి ని సీఎం చేసేయాలనే తాపత్రయం..

    క్షేత్రం లో నాయకత్వం లేదు.. క్యాడర్ కకావికలం..

    151 నుండి 11 కి ఎందుకు పడిపోయారో సమీక్షించుకోలేదు.. ఆ అవసరం లేదు.. ఈవీఎంల వల్ల గెలిచారు అని మిమ్మల్ని మీరు మోసం చేసుకొంటుంటారు..

    ఇక చంద్రబాబు ఇంకో పదేళ్లు మీ గురించి దిగులు పడాల్సిన పనే లేదు..

    పదేళ్ల తర్వాత జగన్ రెడ్డి ఉండడు .. వాడి పార్టీ కూడా ఉండదు..

    1. లేదు..లేదు…చాల వ్యతిరేకత ఉండింది అందుకే మా జగనన్న రాజీనామా చేసి పులివెందుల నుండి మల్ల పోటీ చేసి పులి ల ముందు వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి మరింత బంపర్ మెజారిటీ తో గెలవబోతున్నారు….

  2. రాజా రెడ్డి నుండి మహా మేత , ఓబుల్ రెడ్డి , శ్రీ రెడ్డి , అవినాష్ రెడ్డి , జగన్ రెడ్డి ఇలా అందరు రాయలసీమ ని రక్తం తో రాసిన రక్త చరిత్ర కదా …ఇప్పుడిప్పుడే రాయలసీమ బాగులాడుతుంది

  3. కడప ఉక్కు ఫ్యాక్టరీ కి అన్నియ మూడు సార్లు పునాది సారీ సమాధి రాయి వేసాడు… అప్పుడు జనం యామి అనలేదా

    కియా వచ్చినపుడు యామి అనలేదా…

    అమరారాజ ని వెళ్లగొట్టినపుడు యామి అనలేదా..

    నువ్వు… నీ కామెడీ… మీకన్నా భాఫున్స్ నయం

    1. అవును.. జగన్ రెడ్డి కి అధికారం పోగానే అన్ని సమితులను ఆక్టివేట్ చేయండి..

      జగన్ రెడ్డి కి అధికారం రాగానే.. అందరినీ పడుకోబెట్టండి ..

      జగన్ రెడ్డి కి అధికారం పోగానే కాపు రిజర్వేషన్ గుర్తొస్తుంది..

      జగన్ రెడ్డి కి అధికారం రాగానే.. కాపు రిజర్వేషన్ నిద్రలోకి జారుకుంటుంది.. ..

      అంతా మన చేతుల్లోనే ఉంది..

      పెద్ద డ్రామా ఆర్టిస్ట్.. మన జగన్ రెడ్డన్న..

  4. సరే మన అన్న ని పులివెందుల లో రాజీనామా చేసి మల్ల ఇంతకీ ముందు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ తో గెలవమనండి….

      1. నీకా డౌట్ వచ్చింది అంటే నువ్వు ఎం తింటున్నావో జనాలకి బాగా అర్ధం అయ్యింది

      2. అదేంటి పెపంచికం లో ఏ మంచి జరిగిన అన్న కే మంచి చంబా చెడు అన్నట్టు రాస్తారు కదా….అందుకే ఆలా అడిగా ఐన సింగల్ సింహం అని మీరు లేపడమే అక్కడ విషయం ఏమి లేదు అని తేలిపోయింది

Comments are closed.