మహ‌నీయులు పుట్టిన నేల రాయ‌ల‌సీమ‌

ఎంతో మంది మ‌హ‌నీయులు పుట్టిన నేల రాయ‌ల‌సీమ అని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.

ఎంతో మంది మ‌హ‌నీయులు పుట్టిన నేల రాయ‌ల‌సీమ అని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. మెగా పేరెంట్స్‌-టీచ‌ర్స్ మీట్ కార్య‌క్ర‌మంలో భాగంగా క‌డ‌పలో ప‌వ‌న్ పాల్గొన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ త‌న‌ను పిఠాపురానికి ప‌రిమితం చేస్తార‌ని, కానీ చ‌దువుల త‌ల్లి స‌ర‌స్వ‌తికి నిల‌య‌మైన రాయ‌ల‌సీమ‌ను ఎంచుకున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

రాయ‌ల‌సీమ‌లో అత్య‌ధికంగా గ్రంథాలున్నాయ‌న్నారు. అందుకే రాయ‌ల‌సీమ‌ను తాను ఎంచుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా ఆయ‌న చెప్పారు. ప‌ద క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య‌, క‌వ‌యిత్రి మొల్ల‌, శివ‌తాండ‌వ‌డం ర‌చించిన పుట్ట‌ప‌ర్తి నారాయ‌ణాచార్యులు లాంటి ఎంతో మంది మ‌హానుభావులు పుట్టిన నేల ఈ రాయ‌ల‌సీమ అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

రాయ‌ల‌సీమ అంటే వెనుక‌బ‌డిన ప్రాంతం కాద‌ని, సాహిత్యానికి నిల‌య‌మైన ప్రాంత‌మ‌ని ఆయ‌న అన్నారు. చ‌దువు అనేది ఉద్యోగం కోసం మాత్ర‌మే కాద‌ని, జ్ఞానం ఆర్జించ‌డానికి అని ప‌వ‌న్ అన్నారు. ఐపాడ్‌ను చ‌దువుకోడానికి మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని, ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు వాటిని విద్యార్థులు వాడుకోవ‌డం బాధ్య‌తారాహిత్య‌మ‌ని ప‌వ‌న్ అన్నారు.

రాయ‌చోటిలో విద్యార్థులు గొడ‌వ‌ప‌డుతుంటే మంద‌లించిన ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్నారు. పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌పై త‌ల్లిదండ్రులు ఒక క‌న్ను వేసి ఉంచాల‌ని ప‌వ‌న్ సూచించారు. 16 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కూ విద్యార్థులు సోష‌ల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయొద్ద‌ని ఆయ‌న సూచించారు. డ్ర‌గ్స్ విద్యార్థుల వ‌ర‌కూ వెళ్ల‌డంపై ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

7 Replies to “మహ‌నీయులు పుట్టిన నేల రాయ‌ల‌సీమ‌”

  1. Kadapa lo Janasena punjukovadaniki vesina sketch aa 800 head masters ni transfer cheyadam. Basically now only balija community will thrive in YSR district now. After couple of years, janalaki ki manta putti malli maarusthaaru teachers ni kaadu, leaders ni

Comments are closed.