తోలు తీసి కింద కూచోపెడ‌తాన‌న్న ప‌వ‌న్

వైసీపీ నేత‌ల అహంకారం తీయ‌డంతో పాటు తోలు తీసి కింద కూచోపెడ‌తాన‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ నేత‌ల అహంకారం తీయ‌డంతో పాటు తోలు తీసి కింద కూచోపెడ‌తాన‌ని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాలివీడు ఎంపీడీవో జ‌వ‌హ‌ర్‌బాబుపై వైసీపీ లీగ‌ల్ సెల్ నాయ‌కుడు సుద‌ర్శ‌న్‌రెడ్డి చేతిలో దెబ్బ‌లు తిన్న గాలివీడు ఎంపీడీవో జ‌వ‌హ‌ర్‌బాబును పరామ‌ర్శించ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్లారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో ఆవేశంగా మాట్లాడారు.

ఆధిప‌త్య అహంకారంతో అధికారుల‌పై దాడులు చేస్తే మిమ్మ‌ల్ని ఎలాంటి శిక్ష‌లు వేయాలో చేసి చూపుతామ‌న్నారు. ఇష్టారాజ్యంగా చేయొద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. అహంకారంతో క‌ళ్లు నెత్తికెక్కాయ‌ని వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి అన్నారు. ఇది కూట‌మి ప్ర‌భుత్వం, వైసీపీ ప్ర‌భుత్వం కాద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గుర్తు చేశారు.

ఇష్టారాజ్యంగా చేస్తామంటే మౌనంగా కూచునే ప్ర‌భుత్వం కాద‌ని ఆయ‌న అన్నారు. ఏం చేస్తే అదుపులోకి వ‌స్తారో, ఆ ర‌కంగా చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 11 సీట్లే వ‌చ్చినా ఇంకా గాల్లో విహ‌రిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మిమ్మ‌ల్ని ఎలా కిందికి దించాలో త‌మ‌కు బాగా తెలుస‌న్నారు. ఏ నాయ‌కులైనా స‌రే అధికారుల‌పై దాడి చేసినా, వారి విధుల్ని అడ్డుకున్నా క‌ఠిన చ‌ర్య‌లు వుంటాయ‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

ఎంపీడీవో జ‌వ‌హ‌ర్‌బాబు ఎస్సీ, ఎస్టీ వ్య‌క్తి అని తాను ఇక్క‌డికి రాలేద‌న్నారు. ఎవ‌రైనా స‌రే ఆధిప‌త్య ధోర‌ణితో ప్ర‌భుత్వ అధికారుల విధుల నిర్వ‌హ‌ణ‌కు అడ్డొస్తే ఉపేక్షించే ప్ర‌భుత్వం త‌మ‌ది కాద‌న్నారు. ఈ దాడికి సంబంధించి త‌ప్పించుకున్న మ‌రో 9 మందిని కూడా ప‌ట్టుకోవాల‌ని ఎస్పీకి స్ప‌ష్టంగా చెప్పామ‌న్నారు.

15 Replies to “తోలు తీసి కింద కూచోపెడ‌తాన‌న్న ప‌వ‌న్”

  1. ఎంత కడప అయితె మాత్రం, అలా SC అదికారి అని కూడా చూడకుండా Y.-.C.-.P నేత చెయ్యి చెసుకొవటం ఎమిటి?

    ఆ కొట్టింది రెడ్డి కాకుండా వెరె అయితె GA మద్యలొ కులం తెచ్చి ఎంత యాగి చెసెవాడొ?

  2. Era pk,

    aa 30,000 women missing kanipichara…anni musukuni unnav Ippudu…sollu aapara Poola..

    yiu are just a bait for tdp yellow dogs and pigs..

    musukuni padi undu..egirithe lepesthaaru

Comments are closed.