పెద్దారెడ్డి నిర్భంధం!

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు.

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏడు నెలలుగా తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే అవకాశం దక్కడం లేదు. ఒకసారి పోలీసులతో పాటు తాడిపత్రికి వస్తే, జేసీ అనుచరులు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. తాజాగా ఆయన తాడిపత్రికి వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీసులు ఆయనను తన గ్రామంలోనే గృహనిర్భంధం చేశారు.

అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అనంతపురం రూరల్ సబ్ డివిజన్ పోలీసులు ఆయన గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. “పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టించే ప్రసక్తే లేదు” అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పలుసార్లు మీడియాతో అన్నారు. దీంతో పోలీసులు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనీయడం లేదు. పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉంటే గొడవలు జరుగుతాయనే భావన పోలీసుల్లో ఉంది.

ఇప్పటికే జిల్లా ఎస్పీకి పలుసార్లు పెద్దారెడ్డి వినతులు అందజేసినా, ఏ మార్పు లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న పెద్దారెడ్డికి ఈ పరిస్థితి ఎదురైతే, అక్కడి వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం, జేసీ ఫ్యామిలీ హాయిగా తాడిపత్రిలో ఉండేది అని వైసీపీ నాయకులు అంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, మీడియా ద్వారా అధికారులను, వైసీపీ నేతలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇటీవల బీజేపీ నాయకులపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

5 Replies to “పెద్దారెడ్డి నిర్భంధం!”

  1. Orey Bose DK, JC inti meedha 3 car llo vellu dadi chesindi evaru? SP stai adhikari akkda JC intiki artharathri velli akkada lathi charge cheyaleda? ipudu pathivratha kaburlu , prajalu anni chusaru.

  2. JC family మొత్తం మీద కేసులు పెట్టారు , ఇంక్లూడింగ్ పెళ్ళాం, కోడలు మీద కూడా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వదులుతారు?

Comments are closed.